తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India: ఆసియా కప్‌కు ఎంపికైన టీమిండియా ప్లేయర్స్ వన్డే రికార్డులు ఇవీ

Team India: ఆసియా కప్‌కు ఎంపికైన టీమిండియా ప్లేయర్స్ వన్డే రికార్డులు ఇవీ

Hari Prasad S HT Telugu

21 August 2023, 15:57 IST

google News
    • Team India: ఆసియా కప్‌కు ఎంపికైన టీమిండియా ప్లేయర్స్ వన్డే రికార్డులు ఇవీ. 2022 నుంచి ఈ 17 మంది ప్లేయర్స్ వన్డేల్లో ఎలాంటి ప్రదర్శన చేశారో ఒకసారి చూద్దాం.
ఇండియన్ క్రికెట్ టీమ్
ఇండియన్ క్రికెట్ టీమ్ (AFP)

ఇండియన్ క్రికెట్ టీమ్

Team India: ఆసియా కప్ 2023 కోసం సోమవారం (ఆగస్ట్ 21) సెలక్టర్లు ఇండియన్ క్రికెట్ టీమ్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జట్టును ప్రకటించారు. రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాల తర్వాత జట్టులోకి తిరిగొచ్చారు. రాహుల్ గాయం ఇంకా పూర్తిగా మానకపోవడంతో రిజర్వ్ ప్లేయర్ గా సంజూ శాంసన్ ను ఎంపిక చేశారు.

ఆగస్ట్ 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ లో భాగంగా ఇండియా తన తొలి మ్యాచ్ ను సెప్టెంబర్ 2న పాకిస్థాన్ తో ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీ కోసం ఎంపికై 17 మంది ప్లేయర్స్ ఈ మధ్య కాలంలో వన్డేల్లో ఎలాంటి ప్రదర్శన చేశారో ఒకసారి చూద్దాం.

ఆ 17 మంది వన్డేల్లో 2022 నుంచి ఇలా..

రోహిత్ శర్మ - కెప్టెన్ రోహిత్ శర్మ 2022 నుంచి ఇండియా తరఫున 17 వన్డేలు ఆడాడు. అందులో 45.14 సగటుతో 632 రన్స్ చేశాడు.

శుభ్‌మన్ గిల్ - ప్రస్తుతం ఉన్న టీమ్ లో అత్యుత్తమ ప్రదర్శన శుభ్‌మన్ గిల్ దే అని చెప్పాలి. అతడు 2022, జనవరి నుంచి ఇప్పటి వరకూ 24 వన్డేల్లో ఏకంగా 69.4 సగటుతో 1388రన్స్ చేశాడు. ఈ ఏడాది మొదట్లో శ్రీలంకపై డబుల్ సెంచరీ కూడా చేశాడు.

విరాట్ కోహ్లి - స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఏడాదిన్నర వన్డే రికార్డు అంత గొప్పగా లేదు. గతేడాది జనవరి నుంచి కోహ్లి 21 వన్డేల్లో కేవలం 38.36 సగటుతో 729 రన్స్ మాత్రమే చేశాడు.

తిలక్ వర్మ - వెస్టిండీస్ తో టీ20 సిరీస్ లో అరంగేట్రం చేసిన తిలక్ వర్మ ఇప్పటి వరకూ వన్డేలు ఆడలేదు. 7 టీ20ల్లో అతడు 174 రన్స్ చేసి, ఒక వికెట్ కూడా తీశాడు.

కేఎల్ రాహుల్ - మూడు నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ 2022 నుంచి 16 వన్డేలు ఆడాడు. అందులో 36.69 సగటుతో 477 రన్స్ చేశాడు.

ఇషాన్ కిషన్ - గతేడాది బంగ్లాదేశ్ పై వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్.. మొత్తం 2022 నుంచి 15 వన్డేల్లో 48.76 సగటుతో 634 రన్స్ చేశాడు.

శ్రేయస్ అయ్యర్ - గతేడాది టాప్ ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్.. ఈ ఏడాది గాయం కారణంగా చాలా వరకు టీమ్ కు దూరంగా ఉన్నాడు. అతడు 202 నుంచి 20 వన్డేల్లో 51.12 సగటుతో 818 రన్స్ చేశాడు.

సూర్యకుమార్ యాదవ్ - సూర్య వన్డే ఫామ్ చాలా దారుణంగా ఉంది. 2022 నుంచి 23 వన్డేలు ఆడిన అతడు.. కేవలం 20.36 సగటుతో 387 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియాపై వరుసగా మూడు వన్డేల్లో గోల్డెన్ డకౌటయ్యాడు.

హార్దిక్ పాండ్యా - ఆసియా కప్ కు వైస్ కెప్టెన్ గా ఎంపికైన హార్దిక్ పాండ్యా 2022 నుంచి 14 వన్డేలు మాత్రమే ఆడాడు. అందులో 34.54 సగటుతో 380 రన్స్ చేయడంతోపాటు 16 వికెట్లు కూడా తీశాడు.

రవీంద్ర జడేజా - ఇక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 2022 నుంచి ఇప్పటి వరకూ కేవలం 9 వన్డేలు మాత్రమే ఆడి 149 రన్స్ చేయడంతోపాటు 6 వికెట్లు తీసుకున్నాడు.

బుమ్రా - 11 నెలలుగా జట్టుకు దూరంగా ఉన్నాడు బుమ్రా. దీంతో 2022 నుంచి ఇప్పటి వరకు 5 వన్డేలు మాత్రమే ఆడి 13 వికెట్లు తీశాడు.

మహ్మద్ షమి - కొంతకాలంగా టీమ్ కు దూరంగా ఉన్న మహ్మద్ షమి గతేడాది నుంచి ఇప్పటి వరకూ 11 వన్డేలు ఆడాడు. 14 వికెట్లు తీసుకున్నాడు.

మహ్మద్ సిరాజ్ - సీనియర్లు లేని సమయంలో జట్టు భారాన్ని మోస్తున్న సిరాజ్.. 2022 నుంచి 23 వన్డేలు ఆడిన ఏకంగా 43 వికెట్లు తీయడం విశేషం.

శార్దూల్ ఠాకూర్ - మరో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ 2022 నుంచి 23 వన్డేలు ఆడాడు. 208 రన్స్ చేయడంతోపాటు 36 వికెట్లు తీసుకున్నాడు.

కుల్దీప్ యాదవ్ - ఈ లెఫ్టామ్ లెగ్ స్పిన్నర్ గతేడాది నుంచి 19 వన్డేలు ఆడి 34 వికెట్లు తీశాడు.

అక్షర్ పటేల్ - జట్టులోని మరో ఆల్ రౌండర్ ఇతడు. 2022 నుంచి 14 వన్డేల్లో 232 రన్స్ చేసి, 13 వికెట్లు తీశాడు.

ప్రసిద్ధ్ కృష్ణ - ఈ మధ్యే గాయం నుంచి కోలుకొని వస్తున్నాడు. గతేడాది నుంచి 11 వన్డేలు మాత్రమే ఆడాడు. 19 వికెట్లు తీసుకున్నాడు.

సంజూ శాంసన్ - సంజూ శాంసన్ రిజర్వ్ ప్లేయర్ గా ఉన్నాడు. అతడు 2022 నుంచి 13 వన్డేల్లో 55.71 సగటుతో 390 రన్స్ చేశాడు.

తదుపరి వ్యాసం