Asia Cup 2023 Team India Squad : ఆసియా కప్‌కు టీమిండియా జట్టు ప్రకటన.. తిలక్ వర్మ ఇన్.. సంజూ ఔట్
India's Squad For Asia Cup 2023 : ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే ODI ఆసియా కప్ కోసం 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. ఢిల్లీలో అజిత్ అగార్కర్ నేతృత్వంలో జరిగిన సమావేశం అనంతరం జట్టును ప్రకటించారు.

ఆగస్టు 30 నుంచి వన్డే ఆసియా కప్ (Asia Cup 2023) జరగనుంది. ఇందుకోసం 17 మంది సభ్యులతో కూడిన టీమ్ ఇండియాను ప్రకటించారు. టీమిండియా కెప్టెన్సీ రోహిత్ శర్మ చేతిలో ఉండగా వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) బాధ్యతలు చూసుకోనున్నాడు. అందరూ అనుకున్నట్టుగానే.. చాలా కాలం తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఆసియా కప్ ద్వారా టీమ్ ఇండియాకు పునరాగమనం చేయనున్నారు. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ వన్డే ఆసియా కప్ జట్టు నుండి తొలగించారు. కేవలం 8 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన, ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడని బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మకు జట్టులో చోటు దక్కడం విశేషం.
ఇక ఆసియా కప్(Asia Cup)కు పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ రెండు దేశాలు ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ప్రకటించాయి. ప్రపంచకప్‌లా కాకుండా ఆసియా కప్‌లో 15 మంది సభ్యులకు బదులు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసేందుకు అవకాశం కల్పించారు. ఇప్పుడు బీసీసీఐ(BCCI) కూడా ఆసియాకప్‌కు 17 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ప్రకటించింది.
17 మంది సభ్యుల భారత జట్టులో 8 మంది బ్యాట్స్‌మెన్‌లు ఎంపికయ్యారు. ఇద్దరు ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లు, ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు సహా మొత్తం నలుగురు ఆటగాళ్లు ఆల్ రౌండర్ కోటాలో ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మరో నలుగురు ఆటగాళ్లకు చోటు దక్కగా, కుల్దీప్ యాదవ్ మాత్రమే జట్టులో పూర్తి స్థాయి స్పిన్నర్‌గా ఎంపికయ్యాడు.
బ్యాటింగ్ విభాగం : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్.
ఆల్ రౌండర్లు : హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్.
బౌలింగ్ విభాగం : జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, పర్దీష్ కృష్ణ.
గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్(KL Rahul), అయ్యర్ మళ్లీ టీమిండియాలోకి వచ్చేశారు. వీరిద్దరి రాకతో జట్టులో నాలుగో ఆర్డర్ లోపాన్ని శ్రేయాస్ అయ్యర్ అధిగమించగా, కేఎల్ రాహుల్ రాకతో కీపింగ్, బ్యాటింగ్ ద్వారా జట్టుకు మరింత బలం చేకూరుతుంది.
వెస్టిండీస్, ఐర్లాండ్ పర్యటనలో తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్(Sanju Samson)కు ఆసియా కప్ జట్టులో చోటు దక్కలేదు. బ్యాకప్ ప్లేయర్‌గా ఎంపిక చేయడం విశేషం. ఐర్లాండ్‌తో జరిగిన రెండో T20లో సంజూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయితే ఆ ఇన్నింగ్స్ మాత్రం సెలక్షన్ బోర్డు దృష్టిని ఆకర్షించడంలో విఫలమైంది. వెస్టిండీస్ టూర్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన స్పిన్నర్ చాహల్ కూడా ఆసియా కప్ జట్టులో అవకాశం వస్తుందని అనుకున్నాడు. కానీ సెలక్షన్ బోర్డు మాత్రం.. చాహల్ గురించి పట్టించుకోలేదు.
ఇప్పుడు అందరి చర్చ తిలక్ వర్మ(Tilak Varma) మీదనే జరుగుతోంది. ఎందుకు అంటే.. ఐపీఎల్(IPL)లో మెరిసి భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న తిలక్ వర్మ ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. వెస్టిండీస్ టూర్‌లో అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. మొత్తం సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కానీ ఐర్లాండ్ టూర్‌లో తిలక్ బ్యాట్ మాత్రం పెద్దగా మ్యాజిక్ చేయలేదు. ఈ నేపథ్యంలో అసలు ఆసియా కప్ జట్టులో తిలక్ వర్మ ఉండడు అనే.. చాలా మంది కన్ఫార్మ్ చేసేశారు. కానీ తిలక్ వర్మకు సెలక్షన్ బోర్డు అవకాశమివ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
India's Squad For Asia Cup 2023 : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ , పర్షిద్ కృష్ణ.
బ్యాకప్ - సంజు శాంసన్.