India Test Squad: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకి 16 మందితో భారత్ జట్టు ప్రకటన.. బుమ్రాకి నో రెస్ట్
22 September 2024, 13:48 IST
India Squad For 2nd Test vs Bangladesh: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘన విజయాన్ని అందుకున్న టీమిండియా ఈ నెల 27 నుంచి కాన్పూర్ వేదికగా రెండో టెస్టు ఆడనుంది. ఈ టెస్టు మ్యాచ్ కోసం 16 మందితో కూడిన జట్టుని ఈరోజు బీసీసీఐ ప్రకటించింది.
భారత టెస్టు జట్టు
India Test Squad For 2nd Test: బంగ్లాదేశ్‌తో చెపాక్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో ఆదివారం ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ ముగిసిన గంటల వ్యవధిలోనే రెండో టెస్టు కోసం భారత్ జట్టుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది.
బుమ్రాకి నో రెస్ట్
కాన్పూర్ వేదికగా సెప్టెంబరు 27 (శుక్రవారం) నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టు కోసం 16 మందితో కూడిన జట్టుని బీసీసీఐ ప్రకటించింది. అయితే.. ఎలాంటి మార్పులు చేయకుండా తొలి టెస్టులో ఆడిన జట్టునే ఎంపిక చేసింది.
వాస్తవానికి ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకి రెండో టెస్టు నుంచి రెస్ట్ ఇస్తారని ఊహాగానాలు వినిపించాయి. ఎందుకంటే బంగ్లాతో సిరీస్ తర్వాత భారత్ జట్టు వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో కీలకమైన టెస్టు సిరీస్‌లు ఆడబోతోంది. దాంతో పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని బుమ్రాకి విశ్రాంతి ఇస్తారని అంతా అనుకున్నారు. అయితే.. రెండో టెస్టుకి కూడా బుమ్రాని బీసీసీఐ ప్రకటించింది.
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాళ్
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, యశ్ దయాళ్, కుల్దీప్ యాదవ్‌లకి తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే చోటు దక్కించుకున్న అకాశ్ దీప్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. దాంతో ఈ నెల 27 నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరిగే రెండో టెస్టులో అతడ్ని పక్కన పెట్టే అవకాశం ఉంది.
కుల్దీప్‌కి ఛాన్స్ ఇస్తే.. బెంచ్‌పైకి ఎవరు?
కాన్పూర్ పిచ్ సహజ సిద్ధంగా స్పిన్నర్లకి అనుకూలిస్తుంటుంది. దాంతో ఆకాశ్ దీప్‌ను తుది జట్టు నుంచి తప్పించి మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కి చోటు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
కాన్పూర్ స్టేడియం కుల్దీప్‌కి సొంత మైదానంకాగా.. అక్కడి పిచ్ గురించి అతనికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. కాబట్టి అశ్విన్, జడేజాతో పాటు అదనంగా ఒక స్పిన్నర్‌ను కూడా తుది జట్టులోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆకాశ్ దీప్‌ను కొనసాగిస్తే.. అప్పుడు మహ్మద్ సిరాజ్ రిజర్వ్ బెంచ్‌పై కూర్చోవాల్సి రావొచ్చు.
టాపిక్