Bumrah Record: బుమ్రా ఖాతాలో మరో రికార్డు.. ఆ 4 వికెట్లతో 400 వికెట్ల క్లబ్‌లో చేరిన స్టార్ బౌలర్
- Bumrah Record: చెన్నైలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా స్టార్ పేస్ బౌలర్ బుమ్రా మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. 400 వికెట్ల క్లబ్ లో చేరిన పదో ఇండియన్ బౌలర్ గా నిలిచాడు.
- Bumrah Record: చెన్నైలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా స్టార్ పేస్ బౌలర్ బుమ్రా మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. 400 వికెట్ల క్లబ్ లో చేరిన పదో ఇండియన్ బౌలర్ గా నిలిచాడు.
(1 / 5)
Bumrah Record: బంగ్లాదేశ్ తో చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా బంతితో చెలరేగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే వికెట్లు తీయడం మొదలుపెట్టాడు. మొత్తంగా బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతడు మరో రికార్డు సొంతం చేసుకున్నాడు.(PTI)
(2 / 5)
Bumrah Record: బంగ్లాదేశ్ తో చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా 11 ఓవర్లు బౌలింగ్ చేసి 50 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. (AFP)
(3 / 5)
Bumrah Record: జస్ప్రీత్ బుమ్రా 196 అంతర్జాతీయ మ్యాచ్ లలో 227 ఇన్నింగ్స్ ఆడి 401 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 12 ఇన్నింగ్స్ లో ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. టెస్టుల్లో పదిసార్లు, వన్డేల్లో రెండుసార్లు ఈ ఘనత సాధించాడు.(AP)
(4 / 5)
Bumrah Record: బుమ్రా 37 టెస్టుల్లో 70 ఇన్నింగ్స్ ఆడి మొత్తం 163 వికెట్లు పడగొట్టాడు. 89 వన్డేల్లో 88 ఇన్నింగ్స్ లో 149 వికెట్లు తీసుకోగా.. 70 టీ20ల్లో 89 వికెట్లు పడగొట్టాడు.
ఇతర గ్యాలరీలు