తెలుగు న్యూస్  /  career  /  Tg Tet 2024 Ii Exams : ఈనెల 26న తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల - జనవరి 1 నుంచి పరీక్షలు

TG TET 2024 II Exams : ఈనెల 26న తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల - జనవరి 1 నుంచి పరీక్షలు

18 December 2024, 9:02 IST

google News
    • TG TET 2024 Exam Hall Tickets : తెలంగాణ టెట్ హాల్ టికెట్లు డిసెంబర్ 26వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి. ఈసారి టెట్ పరీక్షల కోసం 2 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. జనవరి 1, 2025వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. అయితే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ రావాల్సి ఉంది.
తెలంగాణ టెట్ హాల్ టికెట్లు 2024
తెలంగాణ టెట్ హాల్ టికెట్లు 2024

తెలంగాణ టెట్ హాల్ టికెట్లు 2024

తెలంగాణ టెట్‌ 2024 (II) పరీక్షలకు సమయం దగ్గరపడింది. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 26వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఇందుకు సంబంధించిన పరీక్షలు జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.

జనవరి 20, 2025తో టెట్ పరీక్షలు ముగుస్తాయి. అయితే ఎగ్జామ్ టైమ్ టేబుల్ కు సంబంధించిన షెడ్యూల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ రెండు రోజుల్లో పూర్తి వివరాలతో కూడిన పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

ఈసారి టెట్ పరీక్షల కోసం మొత్తం 2,48,172 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులోనూ పేపర్‌-1కు 71,655 అప్లికేషన్లు రాగా… పేపర్‌-2కు 1,55,971 దరఖాస్తులు వచ్చాయి. ఉదయం సెషన్ 9 గంటలకు ప్రారంభమై.. 11. 30 గంటలకు ఎగ్జామ్ ముగుస్తుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై... 04. 30 గంటలకు పూర్తవుతుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 91 7075028882 / 85 నెంబర్లను సంప్రదించవచ్చు. ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఈ నెంబర్లు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 5వ తేదీన టెట్ తుది ఫలితాలను ప్రకటిస్తారు.

తెలంగాణ టెట్ హాల్ టికెట్లు - డౌన్లోడ్ ఇలా

  • తెలంగాణ టెట్ అభ్యర్థులు ముందుగా schooledu.telangana.gov.in లేదా https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే ' Download TET Hall Tickets(II) 2024 ఆప్షన్ పై నొక్కాలి.
  • రిజిస్ట్రేషన్ వివరాలతో పాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
  • పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి.

టెట్ సిలబస్ విడుదల:

ఇటీవలనే టెట్ సిలబస్ ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు వెబ్ సైట్ లో సిలబస్ ఆప్షన్ ను తీసుకొచ్చింది. మొత్తం 15 పేపర్లకు సంబంధించిన సిలబస్ వివరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. https://tgtet2024.aptonline.in/ లింక్ పై క్లిక్ చేసి అభ్యర్థులు సిలబస్ కాపీలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే గత టెట్‌కు, తాజా టెట్‌ సిలబస్‌కు ఎటువంటి మార్పు లేదు.

టెట్ సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  1. టెట్ అభ్యర్థులు https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలో కనిపించే Click Here for TG TET-2024-II ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది.
  3. ఇక్కడ హోం పేజీలో కనిపించే Syllabus ఆప్షన్ పై నొక్కాలి.
  4. 15 పేపర్ల పేర్లు కనిపిస్తాయి. ఆ పక్కనే సిలబస్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దానిపై నొక్కితే సిలబస్ కాపీ డౌన్లోడ్ అవుతుంది.
  5. ప్రింట్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

టెట్ లో రెండు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్‌-1 సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా నియామకానికి, పేపర్‌-2 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు. పేపర్‌-2లో మళ్లీ గణితం, సైన్స్‌, సాంఘికశాస్త్రం రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది. పేపర్‌-1కు 1-8 తరగతులు, పేపర్‌-2కు 6-10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి.

ప్రతి పేపర్‌కు 2. 30 గంటల సమయం అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలంపాటు సంబంధిత సర్టిఫికెట్ తో డీఎస్సీ రాయవచ్చు. ఇక టెట్ లో మంచి స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలో మార్కులు యాడ్ అవుతాయి. రెండింట్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను రూపొందించి ఫలితాలను విడుదల చేస్తారు.

తదుపరి వ్యాసం