TG TET 2024 II Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అప్డేట్ - డిసెంబర్ 26న హాల్ టికెట్లు విడుదల-telangana tet hall tickets issued on 26 december 2024 key details read here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Tet 2024 Ii Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అప్డేట్ - డిసెంబర్ 26న హాల్ టికెట్లు విడుదల

TG TET 2024 II Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అప్డేట్ - డిసెంబర్ 26న హాల్ టికెట్లు విడుదల

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 29, 2024 05:34 PM IST

TG TET 2024 Exam Hall Tickets : తెలంగాణ టెట్ దరఖాస్తుల స్వీకరణ ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 2 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిసెంబర్ 26 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనవరి 1, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.

తెలంగాణ టెట్ హాల్ టికెట్లు 2024
తెలంగాణ టెట్ హాల్ టికెట్లు 2024

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ 2024 (II) దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఈ పరీక్ష కోసం మొత్తం 2,48,172 దరఖాస్తులు అందాయి. ఇందులోనూ పేపర్‌-1కు 71,655 అప్లికేషన్లు రాగా… పేపర్‌-2కు 1,55,971 అందిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు… డిసెంబర్ 26వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి.

తెలంగాణ టెట్ హాల్ టికెట్లు 26 డిసెంబర్ 2024న విడుదలవుతాయి. https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక జనవరి 1, 2025వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. జనవరి 20, 2025తో అన్ని పరీక్షలు ముగుస్తాయి. ఫిబ్రవరి 5వ తేదీన తుది ఫలితాలను ప్రకటిస్తారు.

టెట్ హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • తెలంగాణ టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా schooledu.telangana.gov.in లేదా https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే ' Download TET Hall Tickets(II) 2024 ఆప్షన్ పై నొక్కాలి.
  • రిజిస్ట్రేషన్(Journal Number) వివరాలతో పాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
  • పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి.

పరీక్షా విధానం :

తెలంగాణ టెట్‌ పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ అభ్యర్థులకు-90 మార్కులు, బీసీలకు 75, మిగిలిన వారికి 60 మార్కులు వస్తే టెట్‌ ఉత్తీర్ణులుగా గుర్తిస్తారు. రిజర్వేషన్ల ఆధారంగా నిర్దేశిత మార్కులు సాధించిన వారికి మాత్రమే డీఎస్సీ రాసేందుకు అవకాశం లభిస్తుంది. టెట్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులకు డీఎస్సీ నియామకాల్లో 20 శాతం వెయిటేజ్ ఉంటుంది. డీఎస్సీ నియాకంలో టెట్ స్కోర్ అత్యంక కీలకం.

తెలంగాణ టెట్ 2024 II నోటిఫికేషన్ - ముఖ్య తేదీలు:

  • టెట్ దరఖాస్తుల వెబ్ సైట్ - https://tgtet2024.aptonline.in/tgtet/
  • హాల్ టికెట్ల జారీ - 26 డిసెంబర్ 2024
  • టెట్ పరీక్షలు - జనవరి 1, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. జనవరి 20, 2025తో ముగుస్తాయి.
  • పరీక్ష సమయం - మొదటి సెషన్: 9.00 AM to 11.30 AM, రెండో సెషన్ : 2.00 PM to 4.30 PM
  • టెట్ ఫలితాలు - 05 ఫిబ్రవరి 2025.

Whats_app_banner

సంబంధిత కథనం