IPPB Recruitment 2024 : పోస్టల్ బ్యాంక్ లో 68 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, ఇలా దరఖాస్తు చేసుకోండి
21 December 2024, 18:16 IST
IPPB Specialist Officers Recruitment 2024 : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో రెగ్యులర్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన 68 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 21 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు జనవరి 10, 2025 ఆఖరు తేదీ.
పోస్టల్ బ్యాంక్ లో 68 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, ఇలా దరఖాస్తు చేసుకోండి
IPPB Specialist Officers Recruitment 2024 : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB)....దిల్లీ సహా దేశంలోని ఐపీపీబీ శాఖల్లో రెగ్యులర్, కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. స్కేల్ I, II, & III లలో రెగ్యులర్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆన్‌లైన్ అప్లికేషన్లు ఆహ్వానించింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు 21.12.2024 నుంచి 10.01.2025 వరకు www.ippbonline.com వెబ్‌సైట్ లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
(i) దరఖాస్తుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ - 21.12.2024 ఉదయం 10.00 గంటలు
(ii) రుసుముతో దరఖాస్తుల ఆన్‌లైన్ సబ్మిట్ కు చివరి తేదీ - 10.01.2025, రాత్రి 11.59 గంటలు
వయస్సు (01.12.2024 నాటికి)
- అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు - 20 నుంచి 30 సంవత్సరాలు
- మేనేజర్ పోస్టులకు - 23 నుంచి 35 సంవత్సరాలు- 03 ఏళ్ల అనుభవం
- సీనియర్ మేనేజర్ పోస్టులకు- 26 నుంచి 35 సంవత్సరాలు- 06 ఏళ్ల అనుభవం
ఖాళీల వివరాలు-68 పోస్టులు
- అసిస్టెంట్ మేనేజర్ ఐడీ - 54 పోస్టులు
- మేనేజర్ ఐటీ (పేమెంట్ సిస్టమ్స్) -01 పోస్టు
- మేనేజర్ ఐటీ (ఇన్ఫ్రాస్ట్రక్చర్,నెట్‌వర్క్ & క్లౌడ్)- 02 పోస్టులు
- మేనేజర్ ఐటీ (ఎంటర్‌ప్రైజ్ డేటా వేర్‌హౌస్) -01 పోస్టు
- సీనియర్ మేనేజర్ ఐటీ (పేమెంట్ సిస్టమ్స్)-01 పోస్టు
- సీనియర్ మేనేజర్ ఐటీ (ఇన్ఫ్రాస్ట్రక్చర్,నెట్‌వర్క్ & క్లౌడ్) -01 పోస్టు
- సీనియర్ మేనేజర్ ఐటీ (వెండర్, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, ప్రొక్యూర్‌మెంట్,ఎస్ఎల్ఏ, చెల్లింపులు) -01 పోస్టు
- సైబర్ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్ - 07 పోస్టులు(కాంట్రాక్ట్)
దరఖాస్తు రుసుము
- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు - రూ.150
- మిగిలిన వారందరికీ - రూ.750
అర్హతలు
- పోస్టులను అనుసరించి బీఈ, బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్)
- పీజీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్)
- బీఈ, బీటెక్ (ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్) లేదా బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)
ఆన్‌లైన్ దరఖాస్తు విధానం
- అభ్యర్థులు https://www.ippbonline.com/web/ippb/current-openings లింక్ పై క్లిక్ చేయాలి.
- ముందుగా అభ్యర్థి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ క్రియేట్ అవుతుంది.
- రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ తో లాగి అయ్యి దరఖాస్తు ఫారమ్ లో పూర్తి వివరాలు, ఫోటోగ్రాఫ్, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించే ముందు, అన్ని వివరాలు పరిశీలించి ఫైనల్ సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
- ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాల్సిన SC, ST, OBC, PWD సర్టిఫికెట్ల ఫార్మాట్‌లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.