తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Guntur Medical Jobs : గుంటూరు జిల్లాలో వైద్య శాఖ‌లో కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్‌ పోస్టులు-జీతం రూ.ల‌క్ష పైమాటే

Guntur Medical Jobs : గుంటూరు జిల్లాలో వైద్య శాఖ‌లో కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్‌ పోస్టులు-జీతం రూ.ల‌క్ష పైమాటే

HT Telugu Desk HT Telugu

14 December 2024, 19:37 IST

google News
  • Guntur Medical Jobs : గుంటూరు జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 5 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు పాలియేటివ్ కేర్‌ పోస్టుల‌కు డిసెంబ‌ర్ 19, డైక్‌ పోస్టుల‌కు డిసెంబ‌ర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గుంటూరు జిల్లాలో వైద్య శాఖ‌లో కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్‌ పోస్టులు
గుంటూరు జిల్లాలో వైద్య శాఖ‌లో కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్‌ పోస్టులు

గుంటూరు జిల్లాలో వైద్య శాఖ‌లో కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్‌ పోస్టులు

Guntur Medical Jobs : గుంటూరు జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖ‌లో నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ (ఎన్‌హెచ్ఎం) పాలియేటివ్ కేర్‌, డైక్‌లో కింద ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పాలియేటివ్ కేర్ ఉద్యోగానికి జీతం ఏకంగా రూ.ల‌క్ష దాటే ఉంది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు పాలియేటివ్ కేర్‌ పోస్టుల‌కు డిసెంబ‌ర్ 19న‌, డైక్‌ పోస్టుల‌కు డిసెంబ‌ర్ 30న ఆఖ‌రు తేదీగా నిర్ణయించారు. ఆస‌క్తి గ‌ల వారు నిర్ణీత స‌మ‌యంలో ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసుకోవాల‌ని జిల్లా ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) కొర్రా విజ‌య‌ల‌క్ష్మి తెలిపారు. గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ‌లో ఖాళీగా ఉన్న మొత్తం 5 ఉద్యోగాల‌కు అర్హులైన అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టుల‌ను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌ ప‌ద్ధతిలో భ‌ర్తీ చేస్తున్నారు.

మొత్తం ఎన్ని పోస్టులు?

మొత్తం 5 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఎన్‌హెచ్ఎం (పాలియేటివ్ కేర్‌)కు సంబంధించి జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్‌ పోస్టు (తెనాలి జిల్లా ఆసుప‌త్రి)-1, ఎన్‌హెచ్ఎం (డైక్‌)లో మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టు -1, డెంట‌ల్ టెక్నీషియ‌న్ పోస్టు-1, ఫిజియోథెర‌పిస్ట్ పోస్టు-1, సోష‌ల్ వ‌ర్క‌ర్ పోస్టు-1ల‌ను భ‌ర్తీ చేస్తున్నారు.

నెల‌వారీ జీతాలు

1. ఎన్‌హెచ్ఎం (పాలియేటివ్ కేర్‌) పోస్టుకు: జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్‌ పోస్టు -రూ.1,10,000 ఉంటుంది. ఎన్‌హెచ్ఎం (డైక్‌) పోస్టుల‌కు : మెడిక‌ల్ ఆఫీస‌ర్, డెంట‌ల్ టెక్నీషియ‌న్, ఫిజియోథెర‌పిస్ట్, సోష‌ల్ వ‌ర్క‌ర్ పోస్టు-1ల‌కు వేర్వేరుగా ఉంటుంది.

వ‌యో ప‌రిమితి

ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసే అభ్యర్థుల వ‌యో ప‌రిమితి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడ‌బ్ల్యూఎస్‌ అభ్యర్థుల‌కు ఐదేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్లు, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్ కోటా వారికి మూడేళ్ల‌ వ‌య‌స్సు స‌డలింపు ఉంటుంది. అయితే గ‌రిష్టంగా వ‌య‌స్సు 52 ఏళ్లు మించ‌కూడ‌దు.

అర్హత‌లు

1. విద్యా అర్హత‌లు, అనుభ‌వం ఒక్కో పోస్టుకు ఒక్కో ర‌కంగా ఉన్నాయి. పీజీ ఎంబీబీఎస్, ఎండీ జ‌న‌ర‌ల్ మెడిసిన్‌ ఆయా పోస్టుల‌కు విద్యా అర్హ‌తులు ఉన్నాయి. అలాగే కొన్ని పోస్టుల‌కు అనుభ‌వం కూడా కావాలి.

2. ఎన్‌హెచ్ఎం (పాలియేటివ్ కేర్‌) పోస్టుకు సంబంధించి పూర్తి వివ‌రాలు ఈ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://cdn.s3waas.gov.in/s30777d5c17d4066b82ab86dff8a46af6f/uploads/2024/12/2024121212.pdf క్లిక్‌చేస్తే ఓపెన్ అవుతాయి.

3. ఎన్‌హెచ్ఎం (డైక్‌) పోస్టుల‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు ఈ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s30777d5c17d4066b82ab86dff8a46af6f/uploads/2024/12/2024121289.pdf క్లిక్‌చేస్తే ఓపెన్ అవుతాయి.

అప్లికేష‌న్ ఫీజు

1. ఎన్‌హెచ్ఎం (పాలియేటివ్ కేర్‌) పోస్టుకు సంబంధించి అప్లికేష‌న్ ఫీజు ఓసీ, బీసీ అభ్య‌ర్థుల‌కు రూ.750 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థులకు రూ.500గా నిర్ణ‌యించారు.

2. ఎన్‌హెచ్ఎం (డైక్‌) పోస్టుల్లో మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుకు అప్లికేష‌న్ ఫీజు ఓసీ, బీసీ అభ్య‌ర్థుల‌కు రూ.750 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థులకు రూ.500గా నిర్ణ‌యించారు. ఇత‌ర పోస్టుల‌కు సంబంధించి అప్లికేష‌న్ ఫీజు ఓసీ, బీసీ అభ్య‌ర్థుల‌కు రూ.500 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు, ఎక్స్ స‌ర్వీస్ మెన్‌ అభ్య‌ర్థులకురూ.200 ఉంటుంది.

3. ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అలాగే డీడీ, యూపీఐ పేమెంట్స్ ద్వారా కూడా ఫీజు చెల్లించవ‌చ్చు. బ్యాంక్ పేరుః యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రాంచ్ పేరు మెడిక‌ల్ కాలేజీ బ్రాంచ్‌, గుంటూరు, అకౌంట్ నెంబ‌ర్ః 100710100054512, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ః UBIN8110070

ద‌ర‌ఖాస్తు ఇలా చేసుకోండి

1. ఎన్‌హెచ్ఎం (పాలియేటివ్ కేర్‌) పోస్టుకు సంబంధించి ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తును అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s30777d5c17d4066b82ab86dff8a46af6f/uploads/2024/12/2024121275.pdf ను క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తి చేయాలి. సంబంధిత స‌ర్టిఫికేట్ల‌, ఆన్‌లైన్‌లో చెల్లించిన అప్లికేష‌న్ ఫీజు రిసిప్ట్‌ జ‌త‌చేసి, గ‌జిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించి ద‌ర‌ఖాస్తును డైరెక్ట్‌గా డిసెంబ‌ర్ 19న జ‌రిగే ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకావాలి.

2. ఎన్‌హెచ్ఎం (డైక్‌) పోస్టుల‌కు సంబంధించి పోస్టుల‌కు సంబంధించి ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తును అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s30777d5c17d4066b82ab86dff8a46af6f/uploads/2024/12/2024121299.pdf ను క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తి చేయాలి. సంబంధిత స‌ర్టిఫికేట్ల‌, డీడీని జ‌త‌చేసి రిజిస్ట్రార్ పోస్టు చేయాలి. డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ అండ్ హెల్త్ ఆఫీస‌ర్ (డీఎంహెచ్‌వో) కార్యాల‌యం, క‌లెక్ట‌రేట్ ఎదురుగా, న‌గ‌రంపాలెం, గుంటూరుకు ద‌ర‌ఖాస్తును పంపించాలి.

రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం