తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato Share Price : ఆల్​- టైమ్​ హైలో జొమాటో షేరు.. షేర్​ ప్రైజ్​ టార్గెట్​ రూ. 400!

Zomato share price : ఆల్​- టైమ్​ హైలో జొమాటో షేరు.. షేర్​ ప్రైజ్​ టార్గెట్​ రూ. 400!

Sharath Chitturi HT Telugu

12 April 2024, 13:23 IST

    • Zomato share price target : జొమాటో షేర్​ ప్రైజ్​ టార్గెట్​ని ప్రకటించింది జేఎం ఫైనాన్షియల్స్​. అందుకే.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో సంస్థ షేర్లు ఆల్​-టైమ్​ హైని తాకాయి.
జొమాటో షేర్​ ప్రైజ్​ టార్గెట్​ రూ. 400?
జొమాటో షేర్​ ప్రైజ్​ టార్గెట్​ రూ. 400? (REUTERS)

జొమాటో షేర్​ ప్రైజ్​ టార్గెట్​ రూ. 400?

Zomato share price target : ఇండియన్​ స్టాక్​ మార్కెట్​లో వరుస లాభాలతో దూసుకెళుతున్న జొమాటో స్టాక్​.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో మరో ఆల్​ టైమ్​ హైని తాకింది. ఉదయం రూ. 196.5 వద్ద ఓపెన్​ అయిన షేర్లు.. 11 గంటల ప్రాంతంలో రూ. 199.7 వద్ద రికార్డు స్థాయిని టచ్​ చేశాయి. ఒక్క నెలలోనే.. జొమాటో షేర్లు 23.5శాతం పెరగడం విశేషం! జేఎం ఫైనాన్షియల్​ సంస్థ.. జొమాటో షేర్​ ప్రైజ్​ టార్గెట్​ని పెంచడంతో శుక్రవారం షేర్లు పెరిగాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

జోమాటో షేర్​ ప్రైజ్​ టార్గెట్​ రూ. 400..!

జోమాటో స్టాక్​కి 'బై' రేటింగ్​ ఇచ్చింది జేఎం ఫైనాన్షియల్​. గతంలో ఇచ్చిన రూ. 200 షేర్​ ప్రైజ్​ టార్గెట్​ని రూ. 260కి పెంచింది. అందుకే.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో జొమాటో షేర్లు ఒకానొక దశలో రూ. 199.7 వద్ద ఆల్​ టైమ్​ని తాకాయి. ఆ తర్వాత.. కూల్​-ఆఫ్​ అయ్యి మధ్యాహ్నం 1 గంట సమయంలో రూ. 194.5 వద్ద ట్రేడ్​ అవుతున్నాయి.

Zomato share price target in Telugu : బ్లికింట్​ బిజినెస్​ వేగంగా వృద్ధిచెందుతుండటంతో జొమాటో షేర్​ ప్రైజ్​ టార్గెట్​ని పెంచుతున్నామని జేఎం ఫైనాన్షియల్​ పేర్కొంది. ఇక 3ఏళ్ల షేర్​ ప్రైజ్​ టార్గెట్​ని రూ. 400గా వెల్లడించింది.

జేఎం ఫైనాన్షియల్స్​ ప్రిఫర్డ్​ స్టాక్స్​లో జొమాటో ఒకటి. రోబస్ట్​ డిమాండ్​ కారణంగా ఈ ఫుడ్​ డెలివరీ సంస్థ రాణిస్తుందని, హైపర్​లోకల్​ డెలివరీ బిజినెస్​ వేగంగా పుంజుకుంటుందని అంచనా వేసింది.

"జొమాటో ఫుడ్​ డెలివరీ బిజినెస్​ని 50ఎక్స్​ మార్చ్​ 26 ప్రీ ఐఎన్​డీ ఈవీ/ఎబిట్​డా వద్ద వాల్యూ చేస్తున్నాము. క్యాపెక్స్​కి తక్కువ అవసరాలు ఉండటం, వర్కింగ్​ క్యాపిటల్​ ఇన్​వెస్ట్​మెంట్స్​ కూడా అవసరం లేకపోతుండటం జొమాటోకు ప్లస్​ పాయింట్​. రీటైల్​ కేటగిరీలో బ్లింకిట్​ మరింత వేగంగా వృద్ధిచెందుతుందని భావిస్తున్నాము," అని జొమాటో షేర్​ ప్రైజ్​ టార్గెట్​పై జేఎం ఫైనాన్షియల్స్​ సంస్థ వివరణ ఇచ్చింది.

"జొమాటో సొంత ఫుడ్​ డెలివరీ బిజినెస్​కి.. బ్లింకిట్​ లాంగ్​ టర్మ్​లో ప్రీమియం ప్రాఫిట్​ని తీసుకొస్తుందని మేము భావిస్తున్నాము. కానీ షార్ట్​ టర్మ్​లో ఇలా జరగకపోవచ్చు," అని జేఎం ఫైనాన్షియల్స్​ పేర్కొంది.

జొమాటో షేర్​ ప్రైజ్​ హిస్టరీ..

Zomato share price : జొమాటో షేరు.. 5 రోజుల్లో 1.34శాతం పెరిగింది. ఇక నెల రోజుల్లో ఈ స్టాక్​ దాదాపు 23.5శాతం రిటర్నులు ఇచ్చింది. ఆరు నెలల్లో ఏకంగా 75.9శాతం మేర పెరిగింది జొమాటో స్టాక్​. ఈ ఏడాదిలో ఇప్పటివరకు.. 55శాతం రిటర్నులు ఇచ్చింది. ఇక ఏడాది కాలంలో ఈ ఫుడ్​ డెలివరీ సంస్థ షేరు 267 శాతం పెరగడం విశేషం.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​.. మధ్యాహ్నం 1 గంట సమయానికి.. జొమాటో షేర్​ ప్రైజ్​ ఆల్​ టైమ్​ హై రూ. 199.7గా ఉంది.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్​వెస్ట్​మెంట్​ చేసే ముందు.. మీరు మీ ఫైనాన్షియల్​ అడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)