Zomato CEO: మెక్సికో మోడల్ ను రెండో పెళ్లి చేసుకున్న జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్-zomato ceo deepinder goyal marries mexican model grecia munoz ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato Ceo: మెక్సికో మోడల్ ను రెండో పెళ్లి చేసుకున్న జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్

Zomato CEO: మెక్సికో మోడల్ ను రెండో పెళ్లి చేసుకున్న జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్

HT Telugu Desk HT Telugu
Mar 22, 2024 04:21 PM IST

Zomato CEO: జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మెక్సికోకు చెందిన మోడల్, సొంతంగా స్టార్ట్ అప్ ను ప్రారంభించిన గ్రేసియా మునోజ్ ను గత నెలలో దీపిందర్ వివాహం చేసుకున్నారు. ఇది దీపిందర్ గోయల్ కు రెండో పెళ్లి.

గ్రేసియా మునోజ్, దీపిందర్ గోయల్
గ్రేసియా మునోజ్, దీపిందర్ గోయల్ (Instagram/greciamunozp, File photo)

Zomato CEO: మెక్సికో మోడల్ గ్రేసియా మునోజ్ ను జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ (Zomato CEO Deepinder Goyal marriage) వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని గోయల్ సన్నిహితులు ధ్రువీకరించారు. ఈ జంట రెండు నెలల క్రితం వివాహం చేసుకున్నారని, ఫిబ్రవరిలో హనీమూన్ కూడా ముగించుకున్నారని మరో వ్యక్తి వెల్లడించారు. మునోజ్ (Grecia Munoz) ప్రస్తుతం మోడలింగ్ లో లేదని తెలిపారు. గ్రేసియా మునోజ్ 2022 లో అమెరికాలోని మెట్రోపాలిటన్ ఫ్యాషన్ వీక్ విజేతగా నిలిచారు.

yearly horoscope entry point

దీపిందర్ గోయల్ కు రెండో వివాహం..

జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ కు ఇదివరకే వివాహమైంది. ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT DELHI)-ఢిల్లీలో చదువుతున్నప్పుడు పరిచయమైన కంచన్ జోషిని దీపిందర్ గోయల్ గతంలో వివాహం చేసుకున్నాడు. గుర్గావ్ కు చెందిన దీపిందర్ గోయల్ (41) తన బాల్యాన్ని పంజాబ్ లోని ముక్త్సర్ పట్టణంలో గడిపాడు. చండీగఢ్ లో ప్రీ యూనివర్శిటీ పూర్తి చేశారు.

కొత్త ఇంట్లో.. కొత్త జీవితం

మెక్సికోలో జన్మించిన గ్రేసియా మునోజ్ ప్రస్తుతం భారత్ లో తన కొత్త ఇంట్లో ఉన్నానని తన ఇన్ స్టాగ్రామ్ బయోలో పేర్కొంది. తన థ్రెడ్స్ బయో ప్రకారం ఆమె తనను తాను మోడల్ గా, టెలివిజన్ హోస్ట్ గా అభివర్ణించుకున్నారు. జనవరిలో ఢిల్లీలోని ఎర్రకోట, కుతుబ్ మినార్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించిన ఫోటోలను గ్రేసియా మునోజ్ షేర్ చేశారు. ‘‘దిల్లీ దర్శన్ (పార్ట్ 1) - నా కొత్త ఇంట్లో నా కొత్త జీవితానికి సంబంధించిన దృశ్యాలు’’ అని క్యాప్షన్ ఇచ్చారు.

2008 నుంచి..

గుర్గావ్ కు చెందిన 41 ఏళ్ల దీపిందర్ గోయల్ 2008లో కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీలో ఉద్యోగాన్ని వదిలేసి రెస్టారెంట్ అగ్రిగేటర్, ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో (అప్పట్లో Foodiebay.com గా పిలిచేవారు) ను ప్రారంభించారు. ఇప్పుడు లేటెస్ట్ గా శాకాహారుల కోసం ప్రత్యేకంగా "ప్యూర్ వెజ్ మోడ్" మరియు "ప్యూర్ వెజ్ ఫ్లీట్" లను ప్రారంభించారు. ఈ ఫ్లీట్ లోని డెలివరీ సిబ్బంది ధరించే గ్రీన్ డ్రెస్ కోడ్ పై విమర్శలు రావడంతో ఆ డ్రెస్ కోడ్ ఆలోచనను విరమించుకుంటున్నట్లు గోయల్ ప్రకటించారు. వెజ్ ఫ్లీట్ సహా డెలివరీ ఏజెంట్లందరూ ప్రస్తుత ఎరుపు రంగు చొక్కాలు లేదా టీ షర్టులను ధరించడం కొనసాగిస్తారని దీపిందర్ గోయల్ బుధవారం వివరించారు. మూడేళ్ల క్రితం స్టాక్ మార్కెట్లో జొమాటో బ్లాక్ బస్టర్ లిస్టింగ్ తర్వాత గోయల్ భారతదేశంలో అత్యంత ధనవంతుల్లో ఒకరుగా నిలిచారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, జొమాటోలో అతని వాటా ఆధారంగా అతని సంపద విలువ 650 మిలియన్ డాలర్లుగా ఉంది.

Whats_app_banner