Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ను భారీ లాభాల్లో ముగించాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 116 పాయింట్లు పెరిగి 19,722 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 385 పాయింట్ల లాభంతో 66,266 వద్ద ముగిసింది. ఇక బ్యాంక్ నిఫ్టీ.. 469 పాయింట్లు పెరిగి 44,878 వద్దకు చేరింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా పెరిగాయి.
స్టాక్ మార్కెట్ నిపుణులు.. నిఫ్టీ అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది.
"నిఫ్టీ డైలీ ఛార్ట్‌లో లాంగ్ బుల్ క్యాండిల్ ఏర్పడింది. 19,650 లెవల్ వద్ద ఉన్న రెసిస్టెన్స్‌ను అధిగమించింది. షార్ట్ టర్మ్‌లో నిఫ్టీ ఇక్కడి నుంచి 20,000-20,200 లెవల్స్ వరకు వెళ్లొచ్చు. 19,500-19,600 లెవల్స్ సపోర్ట్‌గా ఉన్నాయి," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 758.55 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 28.11 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ సూచీలు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను ఫ్లాట్‌గా మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ.. దాదాపు 20 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా సూచీలు గురువారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.17శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.32శాతం పడింది. చైనా- యాపిల్ ఎఫెక్ట్‌తో.. నాస్డాక్ సూచీ మాత్రం 0.8శాతం పతనమైంది.
Tata motors share price target : టాటా మోటార్స్:- బై రూ. 615, స్టాప్ లాస్ రూ. 600, టార్గెట్ రూ. 645
టెక్ మహీంద్రా (టెక్ఎం):- బై రూ. 1269, స్టాప్ లాస్ 1237, టార్గెట్ రూ. 1330
Zomato share price target : జొమాటో:- బై రూ. 100, స్టాప్‌లాస్ రూ. 96, టార్గెట్ రూ. 105
ఈఐడీ పెర్రీ:- బై రూ. 516, స్టాప్ లాస్ రూ. 500, టార్గెట్ రూ. 545
డీఎల్ఎఫ్:- బై రూ. 530, స్టాప్ లాస్ రూ. 518, టార్గెట్ రూ. 548
ఇండస్ఇండ్ బ్యాంక్:- బై రూ. 1440, స్టాప్ లాస్ రూ. 1415, టార్గెట్ రూ. 1474
సంబంధిత కథనం