Stocks to buy today : ఐటీసీ స్టాక్ ఈ ప్రైజ్‌లో కొంటే.. షార్ట్ టర్మ్‌లో భారీ లాభాలు!
12 April 2024, 8:57 IST
- Stocks to buy today : స్టాక్ మార్కెట్ ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్ టు బై లిస్ట్..
Stocks to buy today : ఈద్-ఉల్-ఫితర్ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం సెలవు. ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు లాభపడ్డాయి. 354 పాయింట్లు పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ 75,038 వద్ద స్థిరపడింది. 111 పాయింట్ల లాభంతో 22,754 వద్ద ముగిసింది ఎన్ఎస్ఈ నిఫ్టీ. ఇక 256 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ.. 48,987 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2778.17 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 163.26 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ.. దాదాపు 125 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
Stock market news today : గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.01 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.74శాతం మేర లాభపడింది. కానీ.. టెక్ ఇండెక్స్ నాస్డాక్ మాత్రం.. 1.68శాతం లాభపడింది.
అయితే.. అమెరికా ద్రవ్యోల్బణం డేటా.. యూఎస్ సీపీఐ మదుపర్లను ఆందోళనకు గురిచేస్తోంది. బుధవారం సాయంత్రం యూఎస్ సీపీఐ డేటా వెలువడింది. ఇది మార్కెట్ అంచనాలకు మించి నమోదైంది. అంటే.. ఇటు ద్రవ్యోల్బణం తగ్గకపోతుండటం, అటు ఆర్థిక వ్యవస్థ కూడా బలంగా ఉండటంతో.. ఫెడ్ వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గకపోవచ్చని మదుపర్లలో ఆందోళన మొదలైంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 125 పాయింట్ల లాస్లో ఉండటానికి కూడా ఇదే కారణం.
స్టాక్స్ టు బై..
Stocks to buy : ఐటీసీ:- బై రూ. 437, స్టాప్ లాస్ రూ. 428, టార్గెట్ రూ. 460
ఐహెచ్సీ:- బై రూ. 596, స్టాప్ లాస్ రూ. 580, టార్గెట్ రూ. 625
కొటాక్ మహీంద్రా బ్యాంక్:- బై రూ. 1825, స్టాప్ లాస్ రూ. 1800, టార్గెట్ రూ. 1870