తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Motors Ipo : హ్యుందాయ్​ మోటార్​​ ఐపీఓ.. త్వరలోనే స్టాక్​ మార్కెట్​లోకి!

Hyundai Motors IPO : హ్యుందాయ్​ మోటార్​​ ఐపీఓ.. త్వరలోనే స్టాక్​ మార్కెట్​లోకి!

Sharath Chitturi HT Telugu

05 February 2024, 12:45 IST

google News
  • Hyundai Motors IPO news : హ్యుందాయ్​ మోటార్​ ఇండియా నుంచి అతిపెద్ద ఐపీఓ రాబోతోందని సమాచారం. స్టాక్​ మార్కెట్​లో ఈ హ్యుందాయ మోటార్​ ఐపీఓ త్వరలోనే లిస్ట్​ అవుతుందని తెలుస్తోంది.

హ్యుందాయ్​ మోటార్స్​ ఐపీఓ.. త్వరలోనే స్టాక్​ మార్కెట్​లోకి!
హ్యుందాయ్​ మోటార్స్​ ఐపీఓ.. త్వరలోనే స్టాక్​ మార్కెట్​లోకి! (REUTERS)

హ్యుందాయ్​ మోటార్స్​ ఐపీఓ.. త్వరలోనే స్టాక్​ మార్కెట్​లోకి!

Hyundai Motors IPO latest news : భారతీయ ఆటోమొబైల్​ మార్కెట్​లోని అతిపెద్ద సంస్థల్లో ఒకటి హ్యుందాయ్​ మోటార్స్​. సౌత్​ కొరియాకు చెందిన ఈ హ్యుందాయ్​ మోటార్​​ ఇండియాకు సంబంధించిన ఓ కీలక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. స్టాక్​ మార్కెట్​లోకి త్వరలోనే అతిపెద్ద ఐపీఓని తీసుకురావాలని హ్యుందాయ్​ మోటార్​​ ఇండియా ప్లాన్​ చేస్తోందట. దీపావళి (నవంబర్​) నాటికి, ఈ ఐపీఓని లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందని సమాచారం. ఈ మేరకు.. ప్రముఖ వార్తా సంస్థ ఎకనామిక్​ టైమ్స్​.. ఓ నివేదికలో పేర్కొంది.

హ్యుందాయ్​ మోటార్​ ఇండియా ఐపీఓ..

1996 మే 6న.. హ్యుందాయ్​ మోటార్​ ఇండియా, దేశంలోకి వచ్చింది. 2023 సేల్స్​ ప్రకారం.. మారుతీ సుజుకీ తర్వాత, ఇండియాలో రెండో స్థానంలో నిలిచింది హ్యుందాయ్​ మోటార్​. ఎకనామిక్​ టైమ్స్​ నివేదిక నిజమే అయితే.. 28ఏళ్లకు సంస్థ నుంచి ఐపీఓ.. స్టాక్​ మార్కెట్​లోకి అడుగుపెడుతున్నట్టు అవుతుంది!

ఈ వ్యవహారంపై హిందుస్థాన్​ టైమ్స్​ అనుసంధాన మింట్​.. హ్యుందాయ్​ మోటార్​ ఇండియాను సంప్రదించేందుకు ప్రయత్నించింది. కానీ సంస్థ నుంచి స్పందన లభించలేదు.

Hyundai Motors India sales : కాగా.. ఈ హ్యుందాయ్​ మోటార్​ ఐపీఓ భారీగానే ఉంటుందని తెలుస్తోంది. కంపెనీ వాల్యూ 22- 28 బిలియన్​ డాలర్లు అని ప్రపంచంలోనే ప్రముఖ ఇన్​వెస్ట్​మెంట్​ బ్యాంకింగ్​ సంస్థలు అంచనా వేశాయి. గత వారం సౌత్​ కొరియాకు వెళ్లిన గోల్డ్​మాన్​ సాక్స్​, సిటీ, మోర్గన్​ స్టాన్​లీ, జేపీ మోర్గాన్​, బ్యాంక్​ ఆఫ్​ అమెరికా, హెచ్​ఎస్​బీసీ, డ్యూచ్​ బ్యాంక్​, యూబీఎస్​లు.. లెక్కలు వేసి, ఈ అంచనాలను హ్యుందాయ్​ సంస్థకు చెప్పాయి. అంటే.. హ్యుందాయ్​ మోటార్​ ఇండియా మార్కెట్​ క్యాపిటల్​ రూ. 1.82లక్షల కోట్లు- రూ. 2.32లక్షల కోట్ల మధ్యలో ఉండొచ్చు!

ఐపీఓ ద్వారా.. 15-20శాతం వాటాని విక్రయించాలని హ్యుందాయ్​ ప్లాన్​ చేస్తోందట. ఈ ఐపీఓ ద్వారా.. రూ. 27,390 కోట్ల నుంచి రూ. 46,480 కోట్లను సమకూర్చాలని సంస్థ భావిస్తోందని సమాచారం.

Stock market IPO news : ఇండియాలో.. ఇతర ఆటోమొబైల్​ సంస్థలకు హ్యుందాయ్​ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. సంస్థ సైతం వేగంగా వృద్ధి చెందుతూ, కొత్త కొత్త వాహనాలను లాంచ్​ చేస్తూ వస్తోంది. గతేడాది లాంచ్​ అయిన హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ.. సూపర్​ హిట్​ కొట్టింది. ఇక ఈ ఏడాదిలో 4 ఎస్​యూవీలను తీసుకురావాలని సంస్థ ప్లాన్​ చేస్తోందట. గతేడాది వచ్చిన సేల్స్​ని, ఈ ఏడాది మరింత పెంచుకోవాలని సంస్థ పట్టుదలతో ఉంది.

మరి ఈ ఐపీఓ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనేది.. హ్యుందాయ్​ మోటార్​ ఇండియా సంస్థ చెప్పాల్సి ఉంది.

తదుపరి వ్యాసం