Addictive Learning IPO: లిస్టింగ్ రోజే 120 శాతం లాభం; ఇన్వెస్టర్లకు పండుగే..
30 January 2024, 17:18 IST
Addictive Learning IPO: అడిక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీస్ ఐపీఓ మంగళవారం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. లిస్ట్ అయిన రోజే ఐపీఓ అలాట్మెంట్ పొందిన ఇన్వెసర్లకు 120 శాతం లాభాలను అందించింది.
ప్రతీకాత్మక చిత్రం
స్టాక్ మార్కెట్లో అడిక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీస్ ఐపీఓ భారీ రిటర్న్స్ తో లిస్ట్ అయింది. ఇష్యూ ధర రూ.140తో పోలిస్తే 121.42 శాతం ప్రీమియంతో ఈ మీడియం అండ్ స్మాల్ స్కేల్ బిజినెస్ ఐపీఓ రూ.310 వద్ద లిస్ట్ అయింది. ఈ షేరు ఇంట్రాడేలో రూ.320 వద్ద గరిష్టాన్ని తాకింది.
ఇష్యూ ప్రైస్ రూ. 140
రూ.60.16 కోట్ల అడిక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీస్ (Addictive Learning Technology) ఐపీఓ 2024 జనవరి 19 న ఓపెన్ అయింది. జనవరి 24 వరకు సబ్ స్క్రిప్షన్ కు అవకాశం కల్పించారు. షేర్ ప్రైస్ బ్యాండ్ ను రూ.133- రూ. 140 గా నిర్ణయించారు. రూ.57.92 కోట్ల విలువైన 41.37 లక్షల విలువైన ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ, రూ.2.24 కోట్ల విలువైన 1.6 లక్షల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఈ ఐపీఓలో ఉన్నాయి.
245 రెట్లు సబ్ స్క్రిప్షన్
ఈ ఐపీఓ (IPO) ఇష్యూ మొత్తంగా 245 సార్లు సబ్ స్క్రైబ్ అయింది. ఈ ఇష్యూకు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి అద్భుతమైన స్పందన లభించింది, వారి వాటా 387 రెట్లు, నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల వాటా 533 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ వాటా 59 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. ఈ ఇష్యూతో సమీకరించిన మొత్తాన్ని టెక్నాలజీలో పెట్టుబడులు, కొత్త కోర్సుల అభివృద్ధి, బ్రాండింగ్ & మార్కెటింగ్ ఖర్చులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ఇతర కొనుగోళ్లు (భారతదేశం, విదేశాల్లో), సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించాలని కంపెనీ యోచిస్తోంది.
అడిక్టివ్ లెర్నింగ్
ఈ అడిక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ (Addictive Learning Technology) అనేది ఎడ్యు-టెక్ ప్లాట్ ఫామ్. ప్రధానంగా సీనియర్, మిడ్-కెరీర్ ప్రొఫెషనల్స్ కోసం, లా సీఖో, స్కిల్ ఆర్బిట్రేజ్, డేటాస్ గుడ్ అనే మూడు బ్రాండ్లు ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్స్ లా, ఫైనాన్స్, కాంప్లయన్స్, హ్యూమన్ రిసోర్సెస్, బిజినెస్ కన్సల్టింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంటెంట్ రైటింగ్, డేటా సైన్స్ కు సంబంధించిన వైవిధ్యమైన కోర్సులను అందిస్తుంది. యూఎస్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా, యూఎస్ ట్యాక్స్ లా, ఇంటర్నేషనల్ బిజినెస్ లా తదితర పాపులర్ సబ్జెక్టులతో అంతర్జాతీయ మార్కెట్లో రిమోట్ కెరీర్ అవకాశాలను అందిస్తుంది.
కెనడాలో లా ప్రాక్టీస్
అంతేకాకుండా, కెనడాలో ప్రాక్టీస్ చేయాలనుకునే భారతీయ న్యాయవాదుల కోసం కెనడియన్ బారిస్టర్ & సొలిసిటర్ ఎగ్జామ్ & ఎన్సిఎ పరీక్ష వంటి అంతర్జాతీయ బార్ పరీక్ష కోర్సులను కూడా కంపెనీ అందిస్తుంది. ఇంగ్లండ్, వేల్స్ లో సొలిసిటర్లుగా అర్హత సాధించడానికి ఉత్తీర్ణత సాధించాల్సిన సొలిసిటర్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ (SQE) కు కూడా భారతీయ న్యాయవాదులకు శిక్షణ ఇస్తుంది.
కంపెనీ ఆదాయం రూ.3,3354.47 లక్షలు
2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.677.77 లక్షలు కాగా, 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.1,859.34 లక్షలకు, 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.3,3354.47 లక్షలకు పెరిగింది. 2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.0.54 లక్షల నికర నష్టాన్ని ప్రకటించింది. నష్టాలు 2022 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగాయి. 2022 లో నష్టాలు రూ .49.07 లక్షలకు చేరుకున్నాయి. అయితే 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.247.13 లక్షల లాభాన్ని ఆర్జించింది. 2023 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కంపెనీ రూ.2,482 లక్షల ఆదాయాన్ని, రూ.315.96 లక్షల నికర లాభాన్ని నమోదు చేసింది.