Nova Agritech IPO: నోవా అగ్రిటెక్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన; జీఎంపీ ఎంత అంటే..?
Nova Agritech IPO: నోవా అగ్రిటెక్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఐపీఓ ప్రారంభమైన తొలి గంటలోనే 100% బుక్ అయి, రికార్డు సృష్టించింది. రిటైల్, నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.
Nova Agritech IPO: భారత స్టాక్ మార్కెట్లో మరోసారి ఐపీఓల జాతర ప్రారంభమైంది. ఫండమెంటల్స్ బలంగా ఉన్న కంపెనీల ఐపీఓలకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా, బిడ్డింగ్ కు వచ్చిన నోవా అగ్రిటెక్ ఐపీఓకు కూడా భారీ స్పందన లభిస్తోంది.
తొలి గంటలోనే 100 శాతం బుకింగ్
నోవా అగ్రిటెక్ ఐపీఓ (Nova Agritech IPO) మార్కెట్లోకి వచ్చిన తొలి గంటలోనే ఫుల్ గా సబ్ స్క్రైబ్ అయింది. మంగళవారం మధ్యాహ్నం వరకు నోవా అగ్రిటెక్ ఐపిఒ సబ్ స్క్రిప్షన్ స్టేటస్ 5.13 రెట్లుగా ఉంది. రిటైల్ పోర్షన్ 7.74 రెట్లు, నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎన్ ఐఐ) భాగం 5.77 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబి) వాటా ఇంకా బుక్ కాలేదు.
ఐపీఓ వివరాలు..
నోవా అగ్రిటెక్ ఐపీఓకు జనవరి 25, గురువారం వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. తొలుత జనవరి 22 సోమవారం నోవా అగ్రిటెక్ ఐపీఓ ప్రారంభం కావాల్సి ఉండగా, అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈక్విటీ మార్కెట్ సోమవారం మూతపడింది. దీంతో నోవా అగ్రిటెక్ ఐపీఓ ఓపెనింగ్ వాయిదా పడింది. నోవా అగ్రిటెక్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ.39 నుంచి రూ.41 మధ్య నిర్ణయించారు. నోవా అగ్రిటెక్ ఐపీఓ లాట్ పరిమాణం 365 ఈక్విటీ షేర్లు. ఈ ఐపీఓలో 50 శాతం వాటాలను క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ)కు, 15 శాతానికి తగ్గకుండా నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (ఎన్ ఐఐ) కేటాయించింది. మిగతా 35 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు.
సబ్ స్క్రిప్షన్ స్టేటస్
మంగళవారం మధ్యాహ్నానికి నోవా ఐపీఓకు 13,03,70,700 షేర్లకు బిడ్లు వచ్చాయి. రూ.143.81 కోట్లను సమీకరించే లక్ష్యంతో ఈ ఐపీఓను తీసుకువచ్చారు. ఇందులో రూ. 112 కోట్ల తాజా ఇష్యూ కూడా ఉంది. ఈ ఐపీఓ ద్వారా సమకూరిన మొత్తాన్ని కొత్త ఫార్ములా ఫ్యాక్టరీ నిర్మాణానికి, అనుబంధ సంస్థ నోవా అగ్రి సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో పెట్టుబడలకు, ఇప్పటికే ఉన్న ఫార్ములా ప్లాంట్ విస్తరణ కోసం, కంపెనీ మూలధన వ్యయాలకు ఫైనాన్సింగ్, కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు ఫైనాన్సింగ్, సాధారణ వ్యాపార ప్రయోజనాల కోసం వెచ్చించనున్నారు.
జీఎంపీ ఎంతంటే..?
నోవా అగ్రిటెక్ ఐపీఓ కు గ్రే మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఈ షేర్లు రూ. 20 ప్రీమియం (GMP) తో ట్రేడ్ అవుతున్నాయి. అంటే, ఇదే ప్రీమియం కొనసాగితే, లిస్టింగ్ రోజు ఈ కంపెనీ షేర్లు రూ. 61 వద్ద ట్రేడ్ కావచ్చు. ఇది ఐపీఓ ఇష్యూ ధర అయిన రూ .41 కంటే 48.78% ఎక్కువ.
సూచన: ఇది ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించే కథనం మాత్రమే. పెట్టుబడి పెట్టేముందు ఇన్వెస్టర్లు స్వీయ అధ్యయనంతో పాటు నిపుణులను సంప్రదించడం సముచితం.