Addictive Learning IPO: గంటలోపే ఫుల్ గా సబ్ స్క్రైబ్ అయిన ఐపీఓ..
Addictive Learning IPO: అడిక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ ఐపీఓ జనవరి 19 న ఓపెన్ అయింది. ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్లు జనవరి 23 వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ సంస్థ ప్రధానంగా మిడ్ కెరీర్ మరియు సీనియర్ ప్రొఫెషనల్స్ కు ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సేవలను అందిస్తుంది.
Addictive Learning IPO: అడిక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. జనవరి 19 శుక్రవారం సబ్ స్క్రిప్షన్ కోసం ప్రారంభమైన ఈ ఐపీఓ గంటలోపే పూర్తిగా సబ్ స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓకు జనవరి 23 వరకు బిడ్డింగ్ చేసుకోవచ్చు.
ప్రైస్ బ్యాండ్
అడిక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ లిమిటెడ్ ఐపీఓ (Addictive Learning IPO) ప్రైస్ బ్యాండ్ ధరను రూ.140గా నిర్ణయించింది. ఈ ఐపీఓ లాట్ సైజులో 1,000 ఈక్విటీ షేర్లు ఉంటాయి. ఇన్వెస్టర్లు లాట్స్ లో సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక లాట్ లో ఉండే 1,000 షేర్లకు సబ్ స్క్రైబ్ చేయడానికి కనీసం రూ. 1,40, 000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కంపెనీ ప్రమోటర్లుగా అభ్యుదయ అగర్వాల్, రామానుజ్ ముఖర్జీ ఉన్నారు. సంస్థలో రామానుజ్ ముఖర్జీ మేనేజింగ్ డైరెక్టర్ గా, ప్రమోటర్ గా ఉన్నారు. అతను "లా సీఖో" ను సృష్టించిన సంస్థకు సహ వ్యవస్థాపకుడు.
ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ప్లాట్ ఫామ్
అడిక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ లిమిటెడ్ అనేది ప్రధానంగా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. ఇది ప్రధానంగా మిడ్-కెరీర్, సీనియర్ ప్రొఫెషనల్స్, అలాగే అప్పుడప్పుడు యువ ప్రొఫెషనల్స్ కు కెరీర్ సేవలను అందిస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూలో క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ)కు 50 శాతానికి మించకుండా, నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (ఎన్ ఐఐ) 15 శాతానికి తగ్గకుండా, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతానికి తగ్గకుండా షేర్లను రిజర్వ్ చేసింది.
షేర్స్ అలాట్మెంట్
జనవరి 24 బుధవారం ఈ ఐపీఓ షేర్ల కేటాయింపు జరుగుతుంది. జనవరి 25, గురువారం కంపెనీ రీఫండ్స్ ప్రారంభిస్తుంది, అదే రోజు షేర్లను కేటాయింపుదారుల డీమ్యాట్ ఖాతాకు జమ చేస్తారు. జనవరి 29 సోమవారం స్టాక్ మార్కెట్లో లెర్నింగ్ టెక్నాలజీ షేర్లు లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఐపీఓ సబ్ స్క్రిప్షన్ స్టేటస్
అడిక్టివ్ లెర్నింగ్ ఐపీఓ కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మొదటి రోజే 22.68 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. ఈ ఇష్యూకు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సానుకూల స్పందన లభించింది. రిటైల్ పోర్షన్ 32.64 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. ఎన్ఐఐ పోర్షన్ 20.74 రెట్లు, క్యూఐబీ వాటా 6.65 రెట్లు బుక్ అయింది. మొత్తం 27,88,000 షేర్లకు గాను 6,32,38,000 షేర్లకు బిడ్స్ వచ్చాయి.
జీఎంపీ ఎంత?
అడిక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ లిమిటెడ్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం శుక్రవారం +121 గా ఉంది. ఈ ఐపీఓకు గ్రే మార్కెట్లో లభిస్తున్న ప్రస్తుత ప్రీమియంను పరిగణనలోకి తీసుకుంటే, అడిక్ట్ లెర్నింగ్ టెక్నాలజీ యొక్క అంచనా లిస్టింగ్ ధర రూ. 261 గా ఉండవచ్చు. ఇది ఐపీఓ ఇష్యూ ధర రూ. 140 కంటే 86.43% ఎక్కువ.
సూచన: ఈ కథనంలో వచ్చిన అభిప్రాయాలు మరియు సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు, నిపుణులు, బ్రోకింగ్ కంపెనీలవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించడం మంచిది.