Indian Car Of The Year 2024 : హ్యుందాయ్​ ఎక్స్​టర్​.. ఇండియన్​ కార్​ ఆఫ్​ ది ఇయర్​!-hyundai exter wins indian car of the year 2024 award see details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Indian Car Of The Year 2024 : హ్యుందాయ్​ ఎక్స్​టర్​.. ఇండియన్​ కార్​ ఆఫ్​ ది ఇయర్​!

Indian Car Of The Year 2024 : హ్యుందాయ్​ ఎక్స్​టర్​.. ఇండియన్​ కార్​ ఆఫ్​ ది ఇయర్​!

Sharath Chitturi HT Telugu
Dec 22, 2023 06:36 AM IST

Indian Car Of The Year 2024 : ఇండియన్​ కార్​ ఆఫ్​ ది ఇయర్​ 2024 అవార్డు.. హ్యుందాయ్​ ఎక్స్​టర్​కి దక్కింది. మరో రెండు అవార్డులను కూడా ప్రకటించారు. ఆ వివరాలు..

హ్యుందాయ్​ ఎక్స్​టర్​.. ఇండియన్​ కార్​ ఆఫ్​ ది ఇయర్​!
హ్యుందాయ్​ ఎక్స్​టర్​.. ఇండియన్​ కార్​ ఆఫ్​ ది ఇయర్​!

Indian Car Of The Year 2024 : ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లో లాంచ్​ అయినప్పటి నుంచి సేల్స్​ పరంగా దూసుకెళుతున్న హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ.. మరో ఘనత సాధించింది. ఈ ఎస్​యూవీకి.. ఇండియన్​ కార్​ ఆఫ్​ ది ఇయర్​ (ఐసీఓటీవై) 2024 అవార్డు లభించింది! వీటితో పాటు మరో రెండు అవార్డులను ప్రకటించింది ఐసీఓటీవై. ఆ వివరాలు..

ఇండియన్​ కార్​ ఆఫ్​ ది ఇయర్​..

ఐసీఓటీవై 2024 ప్రీమియం కార్​ ఆఫ్​ ది ఇయర్​గా బీఎండబ్ల్యూ 7 సిరీస్​ నిలిచింది. ఇక ఐసీఓటీవై 2024 గ్రీన్​ కార్​ ఆఫ్​ ది ఇయర్​ అవార్డు.. హ్యుందాయ్​ ఐయానిక్​ 5ని వరించింది.

ధర, ఫ్యూయెల్​ ఎఫీషియెన్సీ, డిజైన్​, కంఫర్ట్​, పర్ఫార్మెన్స్​, ప్రాక్టికాలిటీ, టెక్నికల్​ ఇన్నోవేషన్​, వాల్యూ ఫర్​ మనీ, ఇండియా రోడ్ల డ్రైవింగ్​ కండీషన్లకు అనుగూణంగా కంపాటబులిటీ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డులను ప్రకటిస్తారు.

Hyundai Exter Indian Car Of The Year 2024 : ఇక ఇండియన్​ కార్​ ఆఫ్​ ది ఇయర్​ 2024 అవార్డు కోసం గట్టి పోటీనే నడిచిందని చెప్పుకోవాలి. సిట్రోయెన్​ సీ ఎయిర్​క్రాస్​, హోండా ఎలివేట్​, హ్యుందాయ్​ వెర్నా, టయోటా ఇన్నోవా హైక్రాస్​ వంటి వాహనాలను ఢీకొట్టి, విజేతగా నిలిచింది హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ.

ఇక గ్రీన్​ కార్​ ఆఫ్​ ది ఇయర్​ అవార్డు కోసం బీవైడీ అట్టో 3, సిట్రోయెన్​ ఈసీ3, మెర్సిడెస్​ బెంజ్​ ఈక్యూఈ, ఎంజీ కామెట్​, వోల్వో సీ40 రీఛార్జ్​ వంటి ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ మధ్య పోటీ జరగింది. ఐయానిక్​ 5 ఈవీ విజేతగా నిలిచింది.

చివరిగా.. ప్రీమియం సెగ్మెంట్​లో బీఎండబ్ల్యూ ఎం2, లెక్సస్​ ఎల్​ఎక్స్​, లాండ్​ రోవర్​ రేంజ్​ రోవర్​ స్పోర్ట్​, మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​సీ, వోల్వో సీ40 రీఛార్జ్​ని వెనక్కి నెట్టి.. విజయం సాధించింది బీఎండబ్ల్యూ 7 సిరీస్​.

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ దూకుడు..

Hyundai Exter on road price Hyderabad : ఇక హ్యుందాయ్​ ఎక్స్​టర్​ విషయానికొస్తే.. ఈ ఎస్​యూవీ సేల్స్​ దూసుకెళుతున్నాయి. ఇప్పటికే 1లక్షకుపైగా బుకింగ్స్​ సంపాదించుకుంది ఈ మోడల్​. తక్కువ ధరకు, అధిక ఫీచర్స్​, మంచి డిజైన్​ వస్తుండటంతో కస్టమర్లు ఈ వెహికిల్​పై ఆసక్తి చూపిస్తున్నారు.

ఇండియాలో హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎక్స్​షోరూం ధర రూ. 6లక్షలు- రూ. 10.5లక్షల మధ్యలో ఉంటుంది. ఈ ప్రైజ్​ పాయింట్​కే స్మార్ట్​ ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​, వయర్​లెస్​ ఛార్జర్​, డ్యూయెల్​ వ్యూ డాష్​ కామ్​, 6 ఎయిర్​బ్యాగ్స్​ వంటివి లభిస్తుండటం విశేషం.

WhatsApp channel

సంబంధిత కథనం