Stocks to buy today : ఈ రూ. 290 స్టాక్‌ని ట్రాక్ చేయండి.. షార్ట్ టర్మ్‌లో లాభాలు!
05 April 2024, 9:00 IST
- Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలను ఇక్కడ చెక్ చేయండి..
స్టాక్స్ టు బై టుడే..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగుతోంది. గురువారం ట్రేడింగ్ సెషన్లో కూడా సూచీలు లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 351 పాయింట్లు పెరిగి 74,228 వద్ద ముగిసింది. 80 పాయింట్లు పెరిగిన నిఫ్టీ50.. 22,515 వద్ద స్థిరపడింది. ఇక 437 పాయింట్ల లాభంతో 48,060 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం నిఫ్టీ.. లాభాల్లో దూసుకెళుతోంది. కానీ శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్బీఐ పాలసీ మీటింగ్ ముగింపు నేపథ్యంలో శక్తికాంత దాస్ వడ్డీ రేట్ల గురించి వ్యాఖ్యలు చేయనున్నారు. ఇది.. స్టాక్ మార్కెట్ల కదలికలను ప్రభావితం చేసే విషయం. రెట్ కట్ ఉండదనే అంచనాలు ఉన్నాయి. అయితే.. ఇలా ఎన్ని రోజులు రెట్ కట్స్ ఉండవు? అన్న విషయం ఇక్కడ కీలకంగా మారింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
Stock market news today : గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1136.47 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు కూడా రూ. 893.11 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ 55 పాయింట్ల లాస్లో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
US Stock market updates : గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. డౌ జోన్స్ 1.35శాతం, ఎస్ అండ్ పీ 500 1.23శాతం మేర డౌన్ అయ్యాయి. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.4శాతం మేర నష్టాలను చూసింది.
స్టాక్స్ టు బై..
Stocks to buy : ఐషేర్ మోటార్స్:- బై రూ. 4014.3, స్టాప్ లాస్ రూ. 3880, టార్గెట్ రూ. 4270
తత్వ చింతన్:- బై రూ. 1245, స్టాప్ లాస్ రూ. 1220, టార్గెట్ రూ. 1310
జీఆర్ఎస్ఈ:- బై రూ. 888, స్టాప్ లాస్ రూ. 855, టార్గెట్ రూ. 950
కొఫోర్జ్:- బై రూ. 5819, స్టాప్ లాస్ రూ. 5690, టార్గెట్ రూ. 6050
కపాసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్:- బై రూ. 290- రూ. 291, స్టాప్ లాస్ రూ. 285, టార్గెట్ రూ. 305
జెన్జార్ టెక్నాలజీస్:- బై రూ. 627- రూ. 628, స్టాప్ లాస్ రూ. 615, టార్గెట్ రూ. 650