Stocks to buy today : ఐటీసీ స్టాక్​ ఈ ప్రైజ్​లో కొంటే.. షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!-stocks to buy today 12th april 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ఐటీసీ స్టాక్​ ఈ ప్రైజ్​లో కొంటే.. షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Stocks to buy today : ఐటీసీ స్టాక్​ ఈ ప్రైజ్​లో కొంటే.. షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu
Apr 12, 2024 08:57 AM IST

Stocks to buy today : స్టాక్​ మార్కెట్​ ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై లిస్ట్​..
స్టాక్స్​ టు బై లిస్ట్​..

Stocks to buy today : ఈద్​-ఉల్​-ఫితర్​ కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లకు గురువారం సెలవు. ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు లాభపడ్డాయి. 354 పాయింట్లు పెరిగిన బీఎస్​ఈ సెన్సెక్స్​ 75,038 వద్ద స్థిరపడింది. 111 పాయింట్ల లాభంతో 22,754 వద్ద ముగిసింది ఎన్​ఎస్​ఈ నిఫ్టీ. ఇక 256 పాయింట్లు పెరిగిన బ్యాంక్​ నిఫ్టీ.. 48,987 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2778.17 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 163.26 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ.. దాదాపు 125 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

Stock market news today : గురువారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.01 శాతం నష్టపోయింది. నాస్​డాక్​ 0.74శాతం మేర లాభపడింది. కానీ.. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్​ మాత్రం.. 1.68శాతం లాభపడింది.

అయితే.. అమెరికా ద్రవ్యోల్బణం డేటా.. యూఎస్​ సీపీఐ మదుపర్లను ఆందోళనకు గురిచేస్తోంది. బుధవారం సాయంత్రం యూఎస్​ సీపీఐ డేటా వెలువడింది. ఇది మార్కెట్​ అంచనాలకు మించి నమోదైంది. అంటే.. ఇటు ద్రవ్యోల్బణం తగ్గకపోతుండటం, అటు ఆర్థిక వ్యవస్థ కూడా బలంగా ఉండటంతో.. ఫెడ్​ వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గకపోవచ్చని మదుపర్లలో ఆందోళన మొదలైంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 125 పాయింట్ల లాస్​లో ఉండటానికి కూడా ఇదే కారణం.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : ఐటీసీ:- బై రూ. 437, స్టాప్​ లాస్​ రూ. 428, టార్గెట్​ రూ. 460

ఐహెచ్​సీ:- బై రూ. 596, స్టాప్​ లాస్​ రూ. 580, టార్గెట్​ రూ. 625

కొటాక్​ మహీంద్రా బ్యాంక్​:- బై రూ. 1825, స్టాప్​ లాస్​ రూ. 1800, టార్గెట్​ రూ. 1870

(గమనిక:- ఇవి నిపుణులు అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)​

Whats_app_banner

సంబంధిత కథనం