తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato New Feature: జొమాటోలో కొత్తగా ‘‘కూల్ న్యూ’’ ఫీచర్; దీని విశేషం ఏంటంటే?

Zomato new feature: జొమాటోలో కొత్తగా ‘‘కూల్ న్యూ’’ ఫీచర్; దీని విశేషం ఏంటంటే?

HT Telugu Desk HT Telugu

21 June 2024, 18:13 IST

google News
  • Zomato new feature: ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ‘జొమాటో’ లో కొత్త ఫీచర్ యాడ్ అయింది. ఈ ఫీచర్ వివరాలను జొమాటో ఫౌండర్ సీఈఓ దీపిందర్ గోయల్ మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ లో పంచుకున్నారు. తాను కూడా ఈ ఫీచర్ ను ఉపయోగించానని చెప్పారు.

జొమాటో లో కొత్తగా ‘‘కూల్ న్యూ’’  ఫీచర్
జొమాటో లో కొత్తగా ‘‘కూల్ న్యూ’’ ఫీచర్ (REUTERS)

జొమాటో లో కొత్తగా ‘‘కూల్ న్యూ’’ ఫీచర్

Zomato new feature: జొమాటో తన యాప్ ను మరోసారి అప్ డేట్ చేసింది. కొత్తగా కూల్ న్యూ’ అనే ఫీచర్ ను యాడ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్లు ఇప్పటివరకు వచ్చిన అన్ని ఆర్డర్స్ సంఖ్యను చూడవచ్చు. దేశవ్యాప్తంగా జోమాటో ద్వారా వచ్చిన ఆర్డర్ల సంఖ్య ఈ కూల్ న్యూ ఫీచర్ ద్వారా తెలుస్తుంది. ఈ వివరాలను జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్ ద్వారా వెల్లడించారు.

లైవ్ ఆర్డర్ల సంఖ్య

లైవ్ ఆర్డర్ల సంఖ్యను తెలుసుకోవడానికి వినియోగదారులకు వీలు కల్పించే కొత్త ఫీచర్ ను జొమాటోలో ప్రారంభించామని దీపిందర్ గోయల్ తెలిపారు. వినియోగదారులు ఇప్పుడు తమ స్మార్ట్ ఫోన్ లోని జొమాటో యాప్ లో భారతదేశం అంతటా, ఆ రోజు చేసిన ఫుడ్ ఆర్డర్ల సంఖ్యను చూడవచ్చు. అయితే, ఫుడ్ ఆర్డర్ చేసిన వినియోగదారులకు మాత్రమే ఈ ఆర్డర్ల సంఖ్య కనిపిస్తుంది.

ఉదయం 11 గంటలకే 2.5 లక్షలు

ఉదయం 11 గంటలకు తాను జొమాటోలో ఆర్డర్ ఇచ్చానని, ఆ వెంటనే ఈ రోజు ఆర్డర్ల సంఖ్య తన యాప్ లో కనిపించిందని దీపిందర్ గోయల్ తెలిపారు. తాను ఆర్డర్ ఇచ్చిన సమయానికి 2,50,000కు పైగా ఆర్డర్లు వచ్చాయని వెల్లడించారు. ‘‘మీరు ఆర్డర్ చేసిన వెంటనే ఆ రోజు లైవ్ ఆర్డర్ కౌంట్ ను చూడవచ్చు. నేను ఉదయం 11 గంటలకు ఆర్డర్ ఇచ్చాను. కౌంట్ అప్పటికే 250,000 కంటే ఎక్కువగా ఉంది’’ అని గోయల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ప్యూర్ వెజ్ ఫ్లీట్

మార్చిలో జొమాటో (Zomato) తన కస్టమర్ల కోసం "ప్యూర్ వెజ్ ఫ్లీట్"ను ప్రారంభించింది. "ప్యూర్ వెజ్ ఫ్లీట్"లో ప్రత్యేకమైన శాఖాహార ఆహారాన్ని అందించే రెస్టారెంట్లు మాత్రమే ఉంటాయి. ఇందులో మాంసాహారాన్ని అందించే రెస్టారెంట్లు ఉండవు. అయితే వివాదం తలెత్తడంతో ఈ ఫీచర్ నుంచి ప్యూర్ అనే పదాన్ని తొలగించి వెజ్ ఓన్లీగా పేరు మార్చింది. అలాగే, ఏప్రిల్ నెలలో కనీసం 50 మందికి సరిపోయేలా ఆర్డర్లు ఇవ్వడం కోసం ‘‘లార్జ్ ఆర్డర్ ఫ్లీట్’’ ను జొమాటో ప్రారంభించింది.

2008 నుంచి

గుర్గావ్ కు చెందిన ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో ను 2008లో దీపిందర్ గోయల్, పంకజ్ చద్దా స్థాపించారు. ఈ ప్లాట్ఫామ్ ప్రస్తుతం ఆహార మెనూలు, రెస్టారెంట్ల సమీక్షలపై సమాచారాన్ని అందిస్తుంది. భారతదేశం అంతటా ఫుడ్ డెలివరీలను అందిస్తుంది. జొమాటో కు ప్రధాన పోటీ దారుగా బెంగళూరుకు చెందిన స్విగ్గీ ఉంది.

పేటీఎం తో చర్చలు

పేటీఎంతో చర్చలు, పేటీఎం టికెటింగ్, మూవీస్ వ్యాపారాన్ని కొనుగోలు చేసే అవకాశాలపై జొమాటో ఇటీవల రెగ్యులేటరీ ఫైలింగ్ లో ధృవీకరించింది. జొమాటో 2022 ఆగస్టులో బ్లింకిట్ (గతంలో గ్రోఫర్స్) ను కొనుగోలు చేసింది. 2024 ఆర్థిక సంవత్సరం క్యూ4 ఆదాయాలలో కంపెనీ రూ .175 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

తదుపరి వ్యాసం