zomato news: ఏడాదిలో ఒక్కడే 3330 ఫుడ్ ఆర్డర్లు; బెస్ట్ కస్టమర్ గా జొమాటో అవార్డ్
3330 food orders in a year: ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ద్వారా 2022 సంవత్సరంలో 3330 ఫుడ్ ఆర్డర్స్ చేసి రికార్డు సృష్టించాడు.
Best customer of zomato: 2022లో భారతీయుల ఫుడ్ ఆర్డర్స్ పై జొమాటో(zomato) ఒక నివేదిక విడుదల చేసింది. అందులో ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. 2022 సంవత్సరంలో అత్యధికంగా 3330 ఫుడ్ ఆర్డర్స్ చేసిన ఢిల్లీకి చెందిన అంకుర్ అనే ఆ వ్యక్తి గురించి ప్రత్యేకంగా వివరించింది.
Best customer of zomato: బెస్ట్ కస్టమర్
ఢిల్లీకి చెందిన అంకుర్ ను ‘బెస్ట్ కస్టమర్ ఆఫ్ 2022(best customer of 2022)’గా జొమాటో(zomato) ప్రకటించింది. అతడు ‘నేషన్స్ బిగ్గెస్ట్ ఫూడీ ఆఫ్ 2022 (Nations biggest foodie)’ అని కూడా ప్రకటించింది. అంకుర్ 2022లో 3330 ఫుడ్ ఆర్డర్స్ చేశాడు. అంటే సగటున రోజుకు కనీసం 9 ఫుడ్ ఆర్డర్స్ అన్నమాట. జొమాటో(zomato) నివేదికలో ముంబైకి చెందిన మరో వ్యక్తి కూడా స్థానం సంపాదించాడు. అతడు యాప్ లోని ప్రొమో కోడ్ లను ఉపయోగించి 2022లో ఏకంగా, రూ. 2.43 లక్షలను సేవ్ చేశాడట. అయితే, ప్రొమోకోడ్ లను అత్యధికంగా ఉపయోగించిన నగరం మాత్రం పశ్చిమబెంగాల్ లోని రాయిగంజ్ అట. అక్కడి జొమాటో(zomato) ఫుడ్ ఆర్డర్లలో 99.7% ప్రొమో కోడ్ ను ఉపయోగించారట.
Biryani tops the order list: బిర్యానీనే టాప్
2022 సంవత్సరానికి గానూ జొమాటో(zomato) యాప్ లో వచ్చిన ఫుడ్ ఆర్డర్స్ ట్రెండ్స్ వివరాలను కూడా జొమాటో వెల్లడించింది. ఇండియాస్ నేషనల్ ఫుడ్ గా పేరుగాంచిన బిర్యానీ మరోసారి అత్యధిక ఆర్డర్ల రికార్డును తిరగరాసింది. ఈ సంవత్సరం జొమాటో యాప్ లో సగటున నిమిషానికి 186 బిర్యానీలను మన భారతీయులు ఆర్డర్ ఇచ్చారట. అంతేకాదు, జొమాటో(zomato) ప్రత్యర్థి స్విగ్గీ(swiggy)లోనూ బిర్యానీదే హవా. స్విగ్గీ యాప్ లో 2022 సంవత్సరంలో భారతీయులు నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డర్ ఇచ్చారట. భారతీయుల అత్యధిక ఫుడ్ ఆర్డర్ల లిస్ట్ లో రెండో స్థానంలో పీజా నిలిచింది. జొమాటో(zomato)లో 2022 సంవత్సరంలో ఇండియన్స్ నిమిషానికి 139 పీజాలను ఆర్డర్ ఇచ్చారట.