World environment day : ది బెస్ట్ రేంజ్ ఉన్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!
05 June 2023, 18:50 IST
- World environment day : పర్యావరణ ప్రేమికుల్లో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలవైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాలో మంచి రేంజ్ ఇచ్చే ఈవీల వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
ది బెస్ట్ రేంజ్ ఉన్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!
World environment day 2023 : వాతావరణ మార్పులపై ఇటీవలి కాలం విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేకమంది ప్రజలు.. సాధారణ వాహనాలను విడిచి ఈవీలవైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే.. మంచి రేంజ్ ఉన్న వాహనాన్ని చూసి కొనుగోలు చేయాలని కస్టమర్లు భావిస్తున్నారు. వీరిలో మీరు కూడా ఉన్నారా? మంచి రేంజ్ ఇచ్చే ఈవీని తీసుకోవాలని చూస్తున్నారా? అయితే.. ఇండియాలో.. ది బెస్ట్ రేంజ్ ఇస్తున్న ఈవీల వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్..
దేశ ఈవీ సెగ్మెంట్లో రారాజుగా కొనసాగుతోంది టాటా మోటార్స్. ఇందుకు కారణం ఈ అటోమొబైల్ సంస్థ పోర్ట్‌ఫోలియో. ముఖ్యంగా టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్.. 400 కిలోమీటర్లకుపైగా రేంజ్‌ను ఇస్తోంది. 7.2కేడబ్ల్యూ ఏసీ ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 6-7 గంటల్లోనే ఫుల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. వేగంగా కావాలంటే 50 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో గంటలో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు కూడా.
ఎంజీ జెడ్ఎస్ ఈవీ..
జెడ్ఎస్ ఈవీని గతేడాది మార్చ్‌లో అప్డేట్ చేసింది ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్. ఫలితంగా రేంజ్ మెరుగుపడింది. సంస్థ ప్రకారం.. ఈ ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 461కి.మీల దూరం ప్రయాణించవచ్చు! 0-100 కేఎంపీహెచ్‌ను కేవలం 8.5 సెకన్లలో అందుకోగలదు కూడా.
ఇదీ చూడండి:- Best electric scooters in India : మార్కెట్లో ఉన్న ది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
హ్యుందాయ్ ఐయానిక్ 5..
ప్రీమియం ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్న వారికి ఈ హ్యుందాయ్ ఐయానిక్ 5 మంచి ఆప్షన్ అవుతుంది! ఇందులోని 72.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 631కి.మీల వరకు ప్రయాణించవచ్చు. 350కేడబ్ల్యూ డీసీ ఛార్జర్‌తో 10-80శాతం ఛార్జింగ్‌ను కేవలం 18 నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు!
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ ఎస్యూవీ..
Electric cars with highest range in India : ఈ లగ్జరీ ఎస్‌యూవీలో 107.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని రేంజ్ 857 కి.మీలు. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌కు 400వీ వోల్టేజ్ సప్లైను అందిస్తే.. కేవలం 30 నిమిషాల్లోన 80శాతం వరకు ఛార్జింగ్ అవుతుంది. ఈ మోడల్ టాప్ స్పీడ్ 210కేఎంపీహెచ్.
ఆడీ ఈ-ట్రాన్ జీటీ..
ఈ ఆడీ ఈ ట్రాన్‌లో 93కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని రేంజ్ 500కి.మీలు. 0-100 కేఎంపీహెచ్‌ను కేవలం 4.1 సెకన్లలో అందుకోగలదు!