Electrified roads : ఈ రోడ్డు మీద వెళితే చాలు.. మీ ఈవీ రీఛార్జ్ అయిపోతుంది!
Electrified roads in Sweden : స్విడెన్‌లో ఎలక్ట్రిఫైడ్ రోడ్లు రానున్నాయి! అంటే.. ఈవీలు వాటిపై వెళితే.. రీఛార్జ్ అయిపోతాయి. పూర్తి వివరాలు..
Electrified roads in Sweden : మీరు కొత్తగా ఈవీ కొన్నారా? ఛార్జింగ్‌కు గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తోందా? అసలు ఛార్జింగ్ పెట్టకుండా.. రోడ్ల మీద వెళుతున్నప్పుడు వెహికిల్ దానంతట అదే ఛార్జ్ అయిపోతే ఎలా ఉంటుంది? యూరోపియన్ దేశం స్విడెన్ ఇప్పుడు ఇదే చేస్తోంది! ఈవీలు రన్నింగ్‌లో ఉన్నప్పుడే.. రీఛార్జ్ అయ్యే విధంగా రోడ్లను రూపొందిస్తోంది. ఈ 'రోడ్ల' విశేషాలు తెలుసుకుందాము..
ఎలక్ట్రిఫైడ్ రోడ్లు- హైవేలు..
వరల్డ్ ఫస్ట్ పర్మనెంట్ ఎలక్ట్రిఫైడ్ మోటార్వేను రూపొందించే పనిలో పడింది స్విడెన్. 2025 నాటికి ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. తద్వారా.. బండి రన్నింగ్‌లో ఉన్నప్పుడే రీఛార్జ్ అవుతుంది! ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే.. 2035 నాటికి మరో 3వేల కి.మీ ఎలక్ట్రిఫైడ్ హైవేలను యాడ్ చేస్తుంది. ఇదే జరిగితే.. ప్రజలకు భారీగా ఛార్జింగ్ ఖర్చులు తగ్గుతాయి!
Electrified roads : స్టాక్‌హోమ్, మాల్మో, గుథెన్బర్గ్ను కనెక్ట్ చేస్తూ ఈ ఎలక్ట్రిఫైడ్ రోడ్లు రానున్నాయి. ప్రస్తుతం ఇది ప్రొక్యూర్మెంట్ దశలో ఉంది. ఛార్జింగ్ కోసం పలు ఆప్షన్స్ ఉన్నాయి. అధికారులు ఇంకా ఒకదానిని ఎంచుకోలేదు.
3 ఛార్జింగ్ ఆప్షన్స్..
ఈ ప్రాజెక్ట్ కోసం కండక్టివ్, కాటెనరీ, ఇండక్టివ్ వంటి మూడు ఛార్జింగ్ ఆప్షన్స్ ఉన్నాయి.
కండక్టివ్ ఛార్జింగ్‌లో కార్లు, ట్రక్స్‌ను కండక్షన్ సిస్టెమ్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. అంటే.. రోడ్ల మీద వేసే కండక్టర్ స్టిక్.. ఛార్జింగ్ రేల్ను తాకి బండి ఛార్జ్ అవుతుంది. కాటెనరీ సిస్టెమ్లో.. బస్సులు, ట్రామ్స్‌ను ఛార్జ్ చేసే విధంగా ఓవర్‌హెడ్ వైర్లు ఉంటాయి. భారీ వాహనాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
Sweden Electrified roads : ఇక ఇండక్టివ్ ఛార్జింగ్ సిస్టెమ్లో రోడ్డు కింద ప్యాడ్/ ప్లేట్ పెడతారు. దాని మీద వెళ్లినప్పుడు.. ఎలక్ట్రిసిటీ అనేది ఈవీలోని కాయిల్‌కు చేరుకుని, బండి ఛార్జ్ అవుతుంది. ఈ తరహా సిస్టెమ్ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. స్విడెన్ కూడా దీనినే వాడుతుందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
గతంలోనూ..
ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ లైన్స్‌తో 2016లోనే రోడ్డును నిర్మించింది స్విడెన్. రెండు కి.మీల మేర రోడ్డు వేసింది. పాంటోగ్రాఫ్ పద్ధతి ద్వారా వాహనాలు ఛార్జ్ అవుతాయి.
Electrified roads in the world : రెండేళ్ల తర్వాత.. ప్రపంచంలోనే తొలి ఛార్జింగ్ రేల్ (ఈవీల కోసం)ను రూపొందించింది. రాసెర్స్బర్గ్- స్టాక్‌హోం మధ్య నిర్మించింది. 2020లో.. విస్బీలో ఒక వయర్లెస్ ఎలక్ట్రిక్ రోడ్‌ను వేసింది. టెక్నాలజీ పరంగా దూసుకెళుతున్న ఈ దేశం.. ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాన్ని కలిగించేందుకు విభిన్న రీతిలో ప్రయత్నాలు చేస్తూనే ఉంటోంది!
సంబంధిత కథనం
టాపిక్