తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp New Feature: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్; ఇది చాలా యూజ్ ఫుల్

WhatsApp new feature: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్; ఇది చాలా యూజ్ ఫుల్

HT Telugu Desk HT Telugu

17 April 2024, 8:27 IST

google News
  • WhatsApp new feature: ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. అందులో భాగంగానే, లేటెస్ట్ గా 'రీసెంట్ ఆన్ లైన్ కాంటాక్ట్స్ (Recent Online Contacts)' పేరుతో మరో యూజ్ ఫుల్ ఫీచర్ ను తీసుకువచ్చింది.

వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్
వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ (Bloomberg)

వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్

WhatsApp new feature: వాట్సాప్ లో త్వరలో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇది రెగ్యులర్ గా చాట్ చేసే కాంటాక్ట్స్ జాబితాను యూజర్ కు యాప్ స్క్రీన్ పై ప్రముఖంగా చూపుతుంది. ఈ రీసెంట్ ఆన్ లైన్ కాంటాక్ట్స్ (Recent Online Contacts) జాబితా తో యూజర్లు తమ చాటింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు.

రీసెంట్ యాక్టివిటీతో..

ఈ వాట్సాప్ (WhatsApp) ఫీచర్ ద్వారా వినియోగదారులు ఇటీవల తాము ఇంటరాక్ట్ అయిన వారితో సులభంగా చాట్ లను ప్రారంభించడానికి వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ Recent Online Contacts ఫీచర్ బీటా టెస్టింగ్ దశలో ఉంది. ఈ కొత్త ఫంక్షనాలిటీ, ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న లేదా ఇటీవల ఆన్ లైన్ లో ఉన్న కాంటాక్ట్ లను హైలైట్ చేయడం ద్వారా యూజర్ కమ్యూనికేషన్ ను మరింత మెరుగుపరుస్తుంది.

మెరుగైన యూజర్ ఎక్స్ పీరియన్స్

మెటా యాజమాన్యంలోని పాపులర్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్ (WhatsApp) యూజర్ ఎక్స్ పీరియన్స్ ను, సెక్యూరిటీని మెరుగుపరచడానికి తన ఫీచర్లను నిరంతరం అప్ డేట్ చేస్తోంది. ప్రస్తుతం చాటింగ్ కు అందుబాటులో ఉన్న స్నేహితులు, కుటుంబం, సహోద్యోగులతో కనెక్ట్ కావడానికి ఈ రీసెట్ ఆన్ లైన్ కాంటాక్ట్స్ (Recent Online Contacts) ఫీచర్ మరింత వెసులుబాటును అందిస్తుందని వాబీటాఇన్ఫో (wabetainfo) నివేదించింది .

క్యూరేటెడ్ కాంటాక్ట్ లిస్ట్

WhatsApp ఫీచర్ లో మరో సదుపాయం కూడా ఉంది. ఇందులో అన్ని ఆన్లైన్ కాంటాక్ట్స్ లు ఉన్న సమగ్ర జాబితా ఉండదు. ఇందులో పరిమిత సంఖ్యలో ఇటీవలి క్రియాశీల కాంటాక్ట్స్ (active contacts) మాత్రమే కనిపిస్తాయి. వినియోగదారులు కాల్ లేదా చాట్ ప్రారంభించడానికి కాంటాక్ట్ లను ఎంచుకునేటప్పుడు ఈ క్యూరేటెడ్ జాబితా సహాయపడుతుంది. కమ్యూనికేషన్ కోసం ఎవరు తక్షణమే అందుబాటులో ఉన్నారనే విషయాన్ని వెల్లడిస్తుంది.

ఖాతాల క్లోజింగ్

వాట్సాప్ (WhatsApp) ప్లాట్ ఫామ్ ను దుర్వినియోగపరుస్తున్న వ్యక్తులపై ఇటీవల వాట్సాప్ దృష్టి పెట్టింది. భారత్ లో ఉన్న అలాంటి, సుమారు 7.6 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించింది. వినియోగదారుల భద్రత తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. నిషేధించిన మొత్తం ఖాతాలలో, 1.4 మిలియన్లను వాట్సాప్ ముందస్తుగా తొలగించింది. ఈ చర్యలు ఐటి రూల్స్ 2021 కు అనుగుణంగా ఉన్నాయి.

తదుపరి వ్యాసం