Instagram Tips: ఈ 5 రహస్య ఫీచర్ల గురించి తెలిస్తే ఇన్ స్టాగ్రామ్ పై పట్టు సాధించినట్లే..-5 hidden features you need to know to master instagram ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Instagram Tips: ఈ 5 రహస్య ఫీచర్ల గురించి తెలిస్తే ఇన్ స్టాగ్రామ్ పై పట్టు సాధించినట్లే..

Instagram Tips: ఈ 5 రహస్య ఫీచర్ల గురించి తెలిస్తే ఇన్ స్టాగ్రామ్ పై పట్టు సాధించినట్లే..

Apr 12, 2024, 05:13 PM IST HT Telugu Desk
Apr 12, 2024, 05:13 PM , IST

Instagram Tips: ఇన్ స్టా గ్రామ్ లో ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం మీకు ఇష్టమైన వ్యాపకమా? ఇన్ స్టా లో ‘ప్రొ’ గా మారాలనుకుంటున్నారా?.. అయితే, ఈ ఐదు సీక్రెట్ ఫీచర్స్ గురించి తెలుసుకోండి.

మీ ఐజీ పోస్టులను షెడ్యూల్ చేయండి: ఇన్స్టాగ్రామ్ సౌకర్యవంతమైన షెడ్యూలింగ్ ఫీచర్ ను అందిస్తుంది, దీనిద్వారా వినియోగదారులు తమ పోస్టులను ఎప్పుడు పబ్లిష్ చేయాలో  ముందే నిర్ణయించవచ్చు. తాము పోస్ట్ చేయాలనుకునే కంటెంట్ లేదా ఫొటోలు, లేదా క్యాప్షన్స్, ఫిల్టర్స్ ను సెలెక్ట్ చేసుకుని, అవి నిర్దిష్టంగా ఏ తేదీన, ఏ సమయంలో పబ్లిష్ కావాలో నిర్ణయించి షెడ్యూల్ చేస్తే చాలు.

(1 / 5)

మీ ఐజీ పోస్టులను షెడ్యూల్ చేయండి: ఇన్స్టాగ్రామ్ సౌకర్యవంతమైన షెడ్యూలింగ్ ఫీచర్ ను అందిస్తుంది, దీనిద్వారా వినియోగదారులు తమ పోస్టులను ఎప్పుడు పబ్లిష్ చేయాలో  ముందే నిర్ణయించవచ్చు. తాము పోస్ట్ చేయాలనుకునే కంటెంట్ లేదా ఫొటోలు, లేదా క్యాప్షన్స్, ఫిల్టర్స్ ను సెలెక్ట్ చేసుకుని, అవి నిర్దిష్టంగా ఏ తేదీన, ఏ సమయంలో పబ్లిష్ కావాలో నిర్ణయించి షెడ్యూల్ చేస్తే చాలు.(unsplash)

క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ క్రియేట్ చేయండి: మీ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ను ఎంపిక చేసుకున్న కొద్ది మందికే షేర్ చేయాలనుకుంటే, ముందుగా, క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్ ద్వారా క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ క్రియేట్ చేయండి. ఈ లిస్ట్ లో అవసరమైన సమయంలో మార్పు, చేర్పులు చేయవచ్చు.

(2 / 5)

క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ క్రియేట్ చేయండి: మీ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ను ఎంపిక చేసుకున్న కొద్ది మందికే షేర్ చేయాలనుకుంటే, ముందుగా, క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్ ద్వారా క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ క్రియేట్ చేయండి. ఈ లిస్ట్ లో అవసరమైన సమయంలో మార్పు, చేర్పులు చేయవచ్చు.(unsplash)

చాట్ థీమ్ మార్చండి: ఇన్ స్టా లో చాట్ థీమ్ ను కస్టమైజ్ చేసుకోవచ్చు. చాట్ థీమ్ లను మార్చడం ద్వారా మీ ఇన్ స్టా అకౌంట్ లుక్ ను మీ మూడ్ కు, లేదా మీ వ్యక్తిత్వానికి అనుగుణంగా తీర్చిదిద్దవచ్చు. చాట్ థీమ్ లో యూజర్లు డిఫాల్ట్ వైట్ బ్యాక్ గ్రౌండ్ నుండి వేర్వేరు థీమ్స్, కలర్స్, గ్రేడియెంట్ లను ఎంచుకోవచ్చు,

(3 / 5)

చాట్ థీమ్ మార్చండి: ఇన్ స్టా లో చాట్ థీమ్ ను కస్టమైజ్ చేసుకోవచ్చు. చాట్ థీమ్ లను మార్చడం ద్వారా మీ ఇన్ స్టా అకౌంట్ లుక్ ను మీ మూడ్ కు, లేదా మీ వ్యక్తిత్వానికి అనుగుణంగా తీర్చిదిద్దవచ్చు. చాట్ థీమ్ లో యూజర్లు డిఫాల్ట్ వైట్ బ్యాక్ గ్రౌండ్ నుండి వేర్వేరు థీమ్స్, కలర్స్, గ్రేడియెంట్ లను ఎంచుకోవచ్చు,(unsplash)

హిడెన్ ఫోల్డర్: ఇన్ స్టాగ్రామ్ లో రహస్య ఫోల్డర్ ఉంటుంది. ఇది అభ్యంతరకరమైన లేదా స్పామ్ సందేశాలను ఫిల్టర్ చేస్తుంది. ఇన్ స్టాగ్రామ్ అల్గారిథమ్స్ ఫ్లాగ్ చేసిన సందేశాలను సమీక్షించడానికి లేదా మాన్యువల్ గా సెట్ చేసిన ప్రమాణాలను సమీక్షించడానికి వినియోగదారులు ఈ ఫోల్డర్ ను యాక్సెస్ చేయవచ్చు. ఈ ఫోల్డర్ ను క్రమం తప్పకుండా చెక్ చేయడం వల్ల ఏదైనా హానికరమైన లేదా తప్పుగా క్లాసిఫై అయిన కంటెంట్ గురించి అవగాహన లభిస్తుంది,

(4 / 5)

హిడెన్ ఫోల్డర్: ఇన్ స్టాగ్రామ్ లో రహస్య ఫోల్డర్ ఉంటుంది. ఇది అభ్యంతరకరమైన లేదా స్పామ్ సందేశాలను ఫిల్టర్ చేస్తుంది. ఇన్ స్టాగ్రామ్ అల్గారిథమ్స్ ఫ్లాగ్ చేసిన సందేశాలను సమీక్షించడానికి లేదా మాన్యువల్ గా సెట్ చేసిన ప్రమాణాలను సమీక్షించడానికి వినియోగదారులు ఈ ఫోల్డర్ ను యాక్సెస్ చేయవచ్చు. ఈ ఫోల్డర్ ను క్రమం తప్పకుండా చెక్ చేయడం వల్ల ఏదైనా హానికరమైన లేదా తప్పుగా క్లాసిఫై అయిన కంటెంట్ గురించి అవగాహన లభిస్తుంది,(unsplash)

క్విక్ షేర్ మెనూ: క్విక్ షేర్ మెనూ ద్వారా ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టమైన కంటెంట్ ను స్నేహితులతో పంచుకోవడం ఆటోమేటిక్ గా జరుగుతుంది. యూజర్లు తమ చిత్రాలు, వీడియోలు లేదా రీల్స్ తో సహా వారు ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన పోస్ట్ లను తమకు నచ్చిన కాంటాక్ట్ లతో నేరుగా పంచుకోవచ్చు. ఈ ఫీచర్ కంటెంట్ షేరింగ్ ను సులభం చేస్తుంది.

(5 / 5)

క్విక్ షేర్ మెనూ: క్విక్ షేర్ మెనూ ద్వారా ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టమైన కంటెంట్ ను స్నేహితులతో పంచుకోవడం ఆటోమేటిక్ గా జరుగుతుంది. యూజర్లు తమ చిత్రాలు, వీడియోలు లేదా రీల్స్ తో సహా వారు ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన పోస్ట్ లను తమకు నచ్చిన కాంటాక్ట్ లతో నేరుగా పంచుకోవచ్చు. ఈ ఫీచర్ కంటెంట్ షేరింగ్ ను సులభం చేస్తుంది.(unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు