Fake WhatsApp Calls: పాక్ నుంచి ఫేక్ వాట్సాప్ కాల్స్; ఈ కంట్రీ కోడ్ తో వాట్సాప్ కాల్స్ వస్తే వెంటనే రిపోర్ట్ చేయండి-your mobile number will get blocked govt warns against fake whatsapp calls from pakistan ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fake Whatsapp Calls: పాక్ నుంచి ఫేక్ వాట్సాప్ కాల్స్; ఈ కంట్రీ కోడ్ తో వాట్సాప్ కాల్స్ వస్తే వెంటనే రిపోర్ట్ చేయండి

Fake WhatsApp Calls: పాక్ నుంచి ఫేక్ వాట్సాప్ కాల్స్; ఈ కంట్రీ కోడ్ తో వాట్సాప్ కాల్స్ వస్తే వెంటనే రిపోర్ట్ చేయండి

HT Telugu Desk HT Telugu
Mar 29, 2024 06:50 PM IST

Fake WhatsApp Calls: వాట్సాప్ కాల్స్ తో జాగ్రత్త. ముఖ్యంగా తెలియని నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ వస్తే ఆన్సర్ చేయకండి. తెలియని నంబర్స్ నుంచి వచ్చే వాట్సాప్ వీడియో కాల్స్ కు అస్సలు స్పందించకండి. వాట్సాప్ ఫేక్ కాల్స్ పై ప్రభుత్వం యూజర్లను హెచ్చరిస్తోంది.

వాట్సాప్ ఫేక్ కాల్స్ తో జాగ్రత్త
వాట్సాప్ ఫేక్ కాల్స్ తో జాగ్రత్త (Bloomberg)

WhatsApp Fake Calls: మీకు ఏదైనా తెలియని నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వస్తే, ఎవరైనా టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ కు చెందిన ప్రభుత్వ అధికారి అని చెప్పుకుంటే, అది మీ వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్న స్కామర్ కావచ్చని గమనించండి. ఇలాంటి వాట్సాప్ కాల్స్ గురించి కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు చెందిన టెలికమ్యూనికేషన్స్ విభాగం (DOT) భారతీయ పౌరులకు ఒక అలర్ట్ ను జారీ చేసింది. ఈ WhatsApp కాల్స్ కు స్పందిస్తే, వారు తమకు తాము ప్రభుత్వ అధికారులమని చెప్పుకుంటూ, వ్యక్తిగత డేటాను అడుగుతున్నారని డాట్ తెలిపింది. వ్యక్తిగత వివరాలు చెప్పకపోతే, మొబైల్ నంబర్ ను డీయాక్టివేట్ చేస్తామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాలుపంచుకుంటున్నారని కేసులు పెడ్తామని బెదిరిస్తున్నారని, అలాంటి బెదిరింపులకు భయపడవద్దని సూచించింది.

yearly horoscope entry point

పాకిస్తాన్ నుంచి..

ముఖ్యంగా ఫేక్ వాట్సాప్ కాల్స్ పాకిస్తాన్ నుంచి వస్తున్నట్లు గుర్తించారు. భారతదేశం కంట్రీ కోడ్ +91. మన మొబైల్ నంబర్స్ అన్నీ ఆ కోడ్ తోనే ప్రారంభమవుతాయి. అలాగే, పాకిస్తాన్ కంట్రీ కోడ్ +92. ఈ కోడ్ తో ప్రారంభమయ్యే నంబర్స్ నుంచి ఏవైనా కాల్స్ వస్తే, వాటిని ఆన్సర్ చేయవద్దని టెలీకాం శాఖ హెచ్చరిస్తోంది. వీలైతే ఆ నంబర్స్ ను బ్లాక్ చేయాలని, రిపోర్ట్ చేయాలని సూచిస్తోంది. ‘వాట్సాప్ వినియోగదారులు, సాధారణంగా, తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి మరియు అపరిచిత వ్యక్తుల నుండి వీడియో కాల్స్ స్వీకరించకుండా ఉండాలి’ అని సూచించింది.

సైబర్ క్రైమ్స్

వాట్సాప్ (WhatsApp) ద్వారా ఎవరినైనా ఎంటర్టైన్ చేసే ముందు కాల్ చేసిన వ్యక్తి గుర్తింపును ముందుగా ధృవీకరించడం మంచిదని కేంద్ర టెలీకాం శాఖ తెలిపింది. ‘‘సైబర్ నేరగాళ్లు ఇలాంటి కాల్స్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. టెలికాం శాఖ తరఫున అలాంటి కాల్స్ చేయడానికి ఎవరికీ అధికారం ఉండదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాంటి కాల్స్ స్వీకరించవద్దు. ఒకవేళ అలాంటి కాల్స్ ను ఆన్సర్ చేసినా, తమ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు’’ అని టెలీకాం శాఖ వివరించింది. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే ‘సంచార్ సాథీ పోర్టల్ (www.sancharsaathi.gov.in)’ లోని 'చక్షు-రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్స్ (Chakshu-Report Suspected Fraud Communications)’ కు రిపోర్ట్ చేయాలని సూచించింది. తద్వారా సైబర్ నేరాలను, ఆర్థిక మోసాలను నివారించవచ్చని తెలిపింది.

సంచార్ సాథీ పోర్టల్

పౌరులు సంచార్ సాథీ పోర్టల్ (www.sancharsaathi.gov.in) లోని 'నో యువర్ మొబైల్ కనెక్షన్స్' సదుపాయం ద్వారా తమ పేరుతో ఉన్న మొబైల్ కనెక్షన్లను తనిఖీ చేసుకోవచ్చు. వారు తీసుకోని లేదా అవసరం లేని ఏదైనా మొబైల్ కనెక్షన్ ను తొలగించుకోవచ్చు. సైబర్ క్రైమ్ లేదా ఫైనాన్షియల్ ఫ్రాడ్ బాధితులు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 లేదా www.cybercrime.gov.in లో రిపోర్ట్ చేయాలని టెలికాం శాఖ పౌరులకు సూచించింది.

Whats_app_banner