తెలుగు న్యూస్  /  బిజినెస్  /  What Is Mid Cap Mutual Fund : మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే ఏంటి? రిస్క్​ ఎంత ఉంటుంది?

What is mid cap mutual fund : మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే ఏంటి? రిస్క్​ ఎంత ఉంటుంది?

Sharath Chitturi HT Telugu

03 February 2024, 11:09 IST

google News
    • Mid cap mutual find explained in Telugu : మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే ఏంటి? ఇందులో ఎంత రిస్క్​ ఉంటుంది? ఎవరు ఇన్​వెస్ట్​ చేయాలి? ఇక్కడ తెలుసుకుందాము..
మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే ఏంటి? రిస్క్​ ఎంత ఉంటుంది?
మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే ఏంటి? రిస్క్​ ఎంత ఉంటుంది?

మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే ఏంటి? రిస్క్​ ఎంత ఉంటుంది?

Mid cap mutual funds to invest in 2024 : స్టాక్​ మార్కెట్​లో మీ ఇన్​వెస్ట్​మెంట్​ జర్నీని మొదలుపెడదామని అనుకుంటున్నారా? మ్యూచువల్​ ఫండ్స్​తో లాంగ్​ టర్మ్​లో మంచి రిటర్నులు వస్తాయని తెలుసుకున్నారా? అయితే.. మీరు మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ గురించి తెలుసుకోవాల్సిందే! రిస్క్​తో మంచి రివార్డు ఇచ్చే ఈ తరహా ఫండ్స్​ మీకు సూట్​ అవ్వొచ్చు, చూడండి..

మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే ఏంటి?

మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ అర్థం.. మిడ్​ క్యాప్​ సంస్థల్లో ఇన్​వెస్ట్​ చేయడమే! మార్కెట్​ క్యాపిటలైజేషన్​లో 101-250 మధ్యలో ఉన్న సంస్థలను మిడ్​ క్యాప్​లుగా పిలుస్తుంటారు. ఈ ర్యాంకింగ్స్​ని స్టాక్​ మార్కెట్​ రెగ్యులేటర్​ సెబీ నిర్ణయిస్తుంది. 101వ సంస్థ మార్కెట్​ క్యాపిటల్​ రూ. 30,000-40,000 మధ్యలో ఉండగా.. 250వ మిడ్​ క్యాప్​ కంపెనీ మార్కెట్​ క్యాపిటల్​ రూ. 10,000- 9,000 మధ్యలో ఉంటుంది.

మిడ్​ క్యాంప్​ సంస్థలు.. లార్జ్​ క్యాప్​- స్మాల్​ క్యాప్​ల మధ్యలో ఉంటాయి. ఇవి.. మదుపర్లకు కొంత ప్రయోజనాలను చేకూరుస్తాయి. లార్జ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ కన్నా.. మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ కాస్త ఎక్కువ రిటర్నులు ఇస్తాయి. అందుకు తగ్గట్టుగానే.. రిస్క్​ కూడా కాస్త ఎక్కువ ఉంటుంది. అదే సమయంలో.. స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​తో పోల్చుకుంటే.. మిడ్​ క్యాప్ ఫండ్స్​ నిలకడగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే..మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​తో మంచి రిస్క్​తో మంచి రివార్డు లభిస్తుందని నిపుణులు చెబుతూ ఉంటారు.

Mid cap mutual find explained in Telugu : మంచి ఫండ్​ మేనేజర్​, డైవర్సిఫైడ్​ సెక్టార్స్​​, మెరుగైన ప్రదర్శన చేసే స్టాక్స్​ ఉండే ఫండ్స్​ని ఎంచుకుంటే చాలు.. మీకు దీర్ఘకాలంలో మంచి రిటర్నులు వస్తాయి.

ఇవి తెలుసుకునే ఇన్​వెస్ట్​ చేయండి..

లార్జ్​ క్యాప్​తో పోల్చుకుంటే.. మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​లో ఒడుదొడుకులు ఎక్కువ అన్న విషయం కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రిస్క్​లు భరించలేకపోతే.. మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ను ఎంచుకూకోడదు. అదే సమయంలో.. ఈ తరహా మ్యూచువల్​ ఫండ్​లో కనీసం 10ఏళ్లు అయినా ఇన్​వెస్ట్​ చేయాలి. అప్పుడే సూపర్​ సంపద లభిస్తుంది.

లార్జ్​ క్యాప్​తో పోల్చుకుంటే మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​తో సంపద సృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అది.. మనం ఎంచుకునే మ్యూచువల్​ ఫండ్​పైనే ఆధారపడి ఉంటుందని గ్రహించాలి. స్టాక్​ మార్కెట్​లో చాలా రీసెర్చ్​ చేసి, మంచి స్టాక్స్​ను ఎంచుకునే మ్యూచువల్​ ఫండ్​లోనే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రతి మ్యూచువల్​ ఫండ్​ స్కీమ్​కి రేటింగ్స్​ ఉంటాయని మీకు తెలుసా?. ఇన్​వెస్ట్​మెంట్​ మొదలుపెట్టే ముందు.. వాటిని కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఆ మ్యూచువల్​ ఫండ్​కి చెదిన గత ప్రదర్శనను కూడా ట్రాక్​ చేయాలి.

What is Mid Cap mutual fund : మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ కోసం రిస్క్​తో పాటు.. మీ ఫైనాన్షియల్​ గోల్స్​ని దృష్టిలో పెట్టుకుని ఇన్​వెస్ట్​ చేయాలి. తొందరపడి ఏదో ఒకటి ఎంచుకుంటే.. దీర్ఘకాలంలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అప్పుడు బాధపడకూడదు అంటే, ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకోవాలి.

మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​లో పెట్టుబడి విషయంలో మీ వయస్సుని కూడా దృష్టిలో పెట్టుకోవాలి! మీరు యంగ్​ ఏజ్​లో ఉంటే.. రిస్క్​ తీసుకోవచ్చు. అదే రిటైర్మెంట్​కు సమీపిస్తున్నప్పుడు రిస్క్​ తీసుకోవాలన్న ఆలోచనలు శ్రేయస్కరం కాదు.

ఈక్విటీ ఫండ్​ కారణంగా.. మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​పై వచ్చే లాభాల మీద క్యాపిటల్​ గెయిన్​ ట్యాక్స్​, డివిడెండ్​ డిస్ట్రిబ్యూషన్​ ట్యాక్స్​ పడుతుందని గుర్తుపెట్టుకోవాలి.

Best Mid Cap mutual fund to invest : లార్డ్​ క్యాప్​తో పోల్చితే.. స్మాల్​ క్యాప్​, మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​లో పెట్టుబడి పెట్టే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అర్థం చేసుకోండి.

నిన్నటి మిడ్​ క్యాప్​.. నేటి లార్జ్​ క్యాప్​..

నిన్నటి మిడ్​ క్యాప్​ కంపెనీలే.. నేటి లార్జ్​ క్యాప్​ సంస్థలు! మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​తో సంపద సృష్టికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. అన్నింటిని క్షుణ్నంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి.

(గమనిక:- ఇవి కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​, మ్యూచువల్​ ఫండ్​లో ఇన్​వెస్ట్​ చేసే ముందు మీ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం