Vivo Y28 5G : వివో నుంచి కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్.. వై28 5జీ లాంచ్
08 January 2024, 14:35 IST
- Vivo Y28 5G launch date in India : వివో వై28 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వివో వై28 5జీ లాంచ్..
Vivo Y28 5G launch date in India : వివో సంస్థ.. సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ని ఇండియాలో లాంచ్ చేసింది. దీని పేరు వివో వై28. ఇదొక 5జీ గ్యాడ్జెట్. ఈ వివో వై28 5జీ.. గతేడాది లాంచ్ అయిన వివో వై27కి సక్సెసర్‌గా వస్తోంది.ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము.
బడ్జెట్ ఫ్రెండ్లీ వివో వై28 ఫీచర్స్..
వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌లో 6.56 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ ఉంటుంది. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన హెచ్డీ+ రిసొల్యూషన్ స్క్రీన్ లభిస్తోంది. సెంటర్లో వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ కనిపిస్తోంది. ఈ వివో వై28 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. దీనికి 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ లభిస్తోంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్.. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది.
Vivo Y28 5G price in India : ఇక ఈ మొబైల్లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకెండరీ లెన్స్‌తో కూడిన డ్యూయెల్ రేర్ కెమెరా సెటప్ వస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8ఎంపీ కెమెరా లభిస్తోంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఐపీ54 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ వంటివి ఇందులో ఉన్నాయి. బ్లూటూత్ 5.1, 5జీ, డ్యూయెల్ సిమ్, టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్స కూడా లభిస్తున్నాయి. ఇక ఈ గ్యాడ్జెట్ బరువు 186 గ్రాములు.
వివో వై28 5జీ ధర ఎంతంటే..
బడ్జెట్ ఫ్రెండ్లీ వివో వై28 5జీలో రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవి.. గ్లిట్టర్ ఆక్వా, క్రిస్టల్ పర్పుల్.
- వివో వై28 5జీ 4జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999.
- Vivo Y28 5G specifications : 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,499.
- ఇక 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ ధర రూ. 16,999.
వివో నుంచి వచ్చిన ఈ కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్‌ని అమెజాన్, క్రోమా, జియోమార్ట్, క్రోమ్‌తో పాటు ఇతర స్టోర్స్‌లో కొనుగోలు చేసుకోవచ్చు.
వివో ఎక్స్100ని చెక్ చేశారా..?
వివో ఎక్స్100 సిరీస్ ఇటీవలే లాంచ్ అయ్యింది. ఇందులో రెండు గ్యాడ్జెట్స్ ఉన్నాయి. అవి.. వివో ఎక్స్100, ఎక్స్100 ప్రో. ఈ గ్యాడ్జెట్స్‌లో.. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. వాటర్, డస్ట్ రెసిస్టన్స్ దీని సొంతం. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ వీటిల్లో ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.