తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo Watch 3 : లాంచ్​కు సిద్ధమవుతున్న వివో వాచ్​ 3..

Vivo Watch 3 : లాంచ్​కు సిద్ధమవుతున్న వివో వాచ్​ 3..

Sharath Chitturi HT Telugu

04 November 2023, 7:54 IST

    • Vivo Watch 3 : వివో వాచ్​ 3 స్మార్ట్​వాచ్​.. లాంచ్​కు సిద్ధమవుతోంది. ఇందులో కొత్త సాఫ్ట్​వేర్​ ఉంటుందని తెలుస్తోంది.
వివో వాచ్​ 3 అప్డేట్​
వివో వాచ్​ 3 అప్డేట్​ (Representative image)

వివో వాచ్​ 3 అప్డేట్​

Vivo Watch 3 : వివో సంస్థ నుంచి కొత్త స్మార్ట్​వాచ్​ రాబోతోంది. దీని పేరు వివో వాచ్​ 3. ఈ మోడల్​.. ఈ నెల 13న లాంచ్​కానుంది. తాజాగా.. ఈ స్మార్ట్​వాచ్​కి సంబంధించిన టీజర్​ను సంస్థ రిలీజ్​ చేసింది. ఆ వివరాలు..

వివో వాచ్​ 3 ఫీచర్స్​..

వివో వాచ్​ 3లో రౌండ్​ డయల్​ ఉంటుంది. రెండు కలర్​ ఆప్షన్స్​లో ఈ మోడల్​ లభిస్తుంది. అవి.. బ్లాక్​ విత్​ సిలికోన్​ స్ట్రాప్​, వైట్​ విత్​ లెథర్​ స్ట్రాప్​. ఈ వాచ్​లో బ్లూఓఎస్​ అనే సరికొత్త ఆపరేటింగ్​ సిస్టెమ్​ ఉంటుంది. దీనికి ఏఐ కేపబులిటీ ఉంటుంది. అన్​లిమిటెడ్​ వాచ్​ ఫేస్​ సపోర్ట్​, యాప్​ స్టోర్​ వంటివి పొందొచ్చు. ఇందులో ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉండనుంది.

Vivo Watch 3 features : ఈ వివో వాచ్​ 3కి సంబంధించిన ఇతర ఫీచర్స్​పై ప్రస్తుతం క్లారిటీ లేదు. కాగా.. ఈ వాచ్​తో పాటు ఎక్స్​100 స్మార్ట్​ఫోన్​ సిరీస్​ని కూడా వివో సంస్థ లాంచ్​ చేస్తుందని టాక్​ నడుస్తోంది. ఇందులో ఎక్స్​100, ఎక్స్​100 ప్రో, ఎక్స్​100 ప్రో+ వంటివి ఉంటాయి. బేస్​ వేరియంట్​ ధర రూ. 45,500గా ఉండొచ్చు. చైనాలో తొలుత ఈ మోడల్​ లాంచ్​ అవుతుంది. ఆ తర్వాత ఇండియాలో అడుగుపెడుతుంది. ఇందులో 120హెచ్​జెడ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉండనుంది. ప్రో+ మోడల్​లో 50ఎంపీ ప్రైమరీ, 50ఎంపీ అల్ట్రా వైట్​, 50ఎంపీ టెలిఫొటో లెన్స్​, 200ఎంపీ పెరిస్కోపిక్​ లెన్స్​లు ఉంటాయని లీక్స్​ సూచిస్తున్నాయి.

ఈ వివో స్మార్ట్​ఫోన్స్​ని గిఫ్ట్​గా ఇచ్చేయండి..

ఈ పండుగ సీజన్‌లో మీ ప్రియమైన వారికి స్మార్ట్‌ఫోన్‌ ను గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారా? ఈ టాప్ 5 వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ లను పరిశీలించండి. రూ. 25 వేల లోపు ధరలో బెస్ట్ ఫీచర్స్ తో, ప్రీమియం లుక్స్ తో ఇవి అందుబాటులో ఉన్నాయి.

వివో వై 27 6జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్ తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50ఎంపీ+ 2ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం ఇది 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.64-అంగుళాల ఫుల్​ హెచ్​డీ+ డిస్ప్లేను కలిగి ఉంది. ఇందులో 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్‌తో 5000ఎంఏహెచ్​ బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ రూ.18999 కి కొనుగోలు చేయవచ్చు. వివిధ ఈ కామర్స్ సైట్స్ లో దీనిపై ప్రత్యేక డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం