Upcoming smartphones in October : క్రేజీ ఫీచర్స్‌తో లాంచ్‌కు సిద్ధమవుతున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే!
29 September 2023, 8:50 IST
- smartphones launch in October 2023 : గూగుల్ పిక్సెల్ 8 నుంచి ఒప్పో ఏ18 వరకు.. అనేక ఆసక్తికరమైన స్మార్ట్‌ఫోన్స్.. అక్టోబర్‌లో లాంచ్ అవుతున్నాయి. ఆ వివరాలు..
అక్టోబర్‌లో లాంచ్ అవుతున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే..
smartphones launch in October 2023 : ఐఫోన్ 15 సిరీస్ లాంచ్‌తో సెప్టెంబర్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కళకళలాడిపోయింది. యాపిల్‌తో పాటు అనేక సంస్థలు కొత్త మోడల్స్‌ను లాంచ్ చేశాయి. ఇక అక్టోబర్‌లో కూడా అనేక స్మార్ట్‌ఫోన్స్.. లాంచ్‌కు సిద్ధమవుతున్నాయి. ఆ వివరాలు..
అక్టోబర్‌లో లాంచ్ అవుతున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే..
వివో వీ29, వివో వీ29 ప్రో:- అక్టోబర్ 4, మధ్యాహ్నం 12 గంటలకు.. వివో వీ29, వీ29 ప్రో మోడల్స్ లాంచ్కానున్నాయి. ఇందులో 6.78 ఇంచ్ డిస్ప్లే స్క్రీన్ ఉండనుంది. పవర్ఫుల్ ఐఎంఎక్స్663 సెన్సార్ కెమెరా దీని సొంతం.
Google Pixel 8 release date : గూగుల్ పిక్సెల్ 8:- స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మచ్ అవైటెడ్ గ్యాడ్జెట్ ఇది. అక్టోబర్ 4న జరగనున్న గూగుల్ ఈవెంట్లో ఈ సిరీస్ లాంచ్ అవుతుంది. ఇందులో గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో మోడల్స్ ఉంటాయి. క్రేజీ ఫీచర్స్ వీటిల్లో ఉంటాయని తెలుస్తోంది.
వన్‌ప్లస్ ఓపెన్:- ఈ వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్.. గత కొంతకాలంగా వార్తల్లో ఉంది. ఎట్టకేలకు.. ఇది మార్కెట్లో లాంచ్‌కానుందని తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. అక్టోబర్ తొలి వారంలో ఈ మోడల్ లాంచ్ అవుతుంది.
ఇదీ చూడండి:- Samsung Galaxy: ఏడు వేల రూపాయల లోపు ధరలోనే సామ్సంగ్ స్మార్ట్ ఫోన్; డోంట్ మిస్..
సామ్సంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ:- వాస్తవానికి ఈ మొబైల్.. సెప్టెంబర్‌లోనే లాంచ్ అవుతుందని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు అక్టోబర్ లాంచ్‌కు సిద్ధమవుతోందని తెలుస్తోంది. అక్టోబర్ 19న లాంచ్ అవ్వొచ్చు.
సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్44:- ఇదొక మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్. అక్టోబర్ నెల మధ్యలో ఇది లాంచ్ అవ్వొచ్చు. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్ దీని సొంతమని లీక్స్ సూచిస్తున్నాయి.
Oppo A18 launch date in India : ఒప్పో ఏ18:- బడ్జెట్ ఫ్రెండ్లీ ఒప్పో ఏ18.. ఇప్పటికే యూఏఈలో లాంచ్ అయ్యింది. ఇండియాలో అక్టోబర్‌లో లాంచ్కానుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
షావోమీ 13టీ సిరీస్:- షావోమీ నుంచి 13టీ, 13టీ ప్రో గ్యాడ్జెట్స్ లాంచ్ అవ్వాల్సి ఉంది. అక్టోబర్‌లో ఈ కస్టమర్ల ముందుకు వస్తాయని తెలుస్తోంది. ఫ్లాగ్‌షిఫ్ ఫీచర్స్ ఇందులో ఉంటాయని సమాచారం.
ప్రస్తుతం ఈ మోడల్స్‌పైనే అప్డేట్స్ ఉన్నాయి. వీటి ఫీచర్స్, ధర వివరాలు తెలియాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఈ లిస్ట్ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.