Tecno Phantom V Flip : టెక్నో ఫాంటమ్ వీ ఫ్లిప్ లాంచ్.. తక్కువ ధరకే ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్!
23 September 2023, 9:29 IST
Tecno Phantom V Flip : టెక్నో ఫాంటమ్ వీ ఫ్లిప్ పేరుతో ఓ కొత్త ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది సంస్థ. తక్కువ ధరకే మంచి ఫీచర్స్‌ను ఇస్తోంది. ఆ వివరాలు.
టెక్నో ఫాంటమ్ వీ ఫ్లిప్ లాంచ్..
Tecno Phantom V Flip : ఇండియాలో తొలి ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది టెక్నో సంస్థ. దీని పేరు టెక్నో ఫాంటమ్ వీ ఫ్లిప్ 5జీ. ఇతర ఫోల్డెబుల్ స్మార్ట్ఫోన్స్తో పోల్చుకుంటే.. తమ గ్యాడ్జెట్ చాలా ప్రత్యేకమని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త ఫ్లిప్ ఫోన్ ఎలా ఉంది?
సరసమైన ధరలో లగ్జరీ ఫీచర్స్‌ను పొందాలనుకునే వారి కోసమే ఈ ఫాంటమ్ వీ ఫ్లిప్‌ను రూపొందించినట్టు టెక్నో సంస్థ వెల్లడించింది. యూనివర్స్ నుంచి స్ఫూర్తి పొంది ఈ గ్యాడ్జెట్‌ను తయారు చేసినట్టు స్పష్టం చేసింది. ఇందులో ఉండే సర్క్యులర్ కవర్ స్క్రీన్‌ను ది ప్లానెట్‌గా పిలుస్తోంది. కెమెరా మాడ్యూల్ డిజైన్.. ఆస్ట్రాయిడ్ బెల్ట్‌ను గుర్తుచేస్తోంది. ఫోన్ రేర్‌లో ప్రీమియం లిచ్- పాటర్న్ క్లాసిక్ వేగన్ లెథర్‌ను ఉపయోగించడంతో ఈ గ్యాడ్జెట్‌కు లగ్జరీ ఫీల్ వస్తోంది. 2లక్షలకుపైగా ఫోల్డ్స్ను తట్టుకునే విధంగా ఈ ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్టు సంస్థ చెబుతోంది.
Tecno Phantom V Flip price in India : ఈ టెక్నో ఫాంటమ్ వీ ఫ్లిప్‌లో 64ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ విషయానికొస్తే ఈ డివైజ్‌లో 32ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఉంటుంది. ఫ్రీకామ్ సిస్టెమ్తో అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చు.
ఇదీ చూడండి:- HONOR V Purse : వావ్.. ఇది పర్సులా ఉండే ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్!
ఇక ఈ మోడల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 5జీ చిప్సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ దీని సొంతం. అయితే ఈ గ్యాడ్జెట్‌కు 4000ఎంఏహెచ్ బ్యాటరీ మాత్రమే లభిస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వైఫ్, బ్లూటూత్, జీపీఎస్, 5జీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ సైతం ఇందులో ఉన్నాయి.
కొత్త ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత?
Tecno Phantom V Flip amazon : ఇండియాలో టెక్నో ఫాంటమ్ వీ ఫ్లిప్ 5జీ ఇంట్రొడక్టరీ ధర రూ. 49,999గా ఉంది. ఐకానిక్ బ్లాక్, మిస్టిక్ డాన్ కలర్ ఆప్షన్స్ లభిస్తున్నాయి. అమెజాన్‌లో ఈ మోడల్‌ను అక్టోబర్ 1 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.
ఇతర దేశాల్లో కూడా ఈ ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోంది.