Google Pixel Fold vs OPPO Find N2 : ఈ రెండు ఫోల్డెబుల్​ ఫోన్స్​లో ఏది బెస్ట్​?-google pixel fold vs oppo find n2 which is better check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Google Pixel Fold Vs Oppo Find N2 : ఈ రెండు ఫోల్డెబుల్​ ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Google Pixel Fold vs OPPO Find N2 : ఈ రెండు ఫోల్డెబుల్​ ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
May 14, 2023 08:10 PM IST

Google Pixel Fold vs OPPO Find N2 : గూగుల్​ పిక్సెల్​ ఫోల్డ్​ వర్సెస్​ ఒప్పో ఫైండ్​ ఎన్​2.. ఈ రెండింట్లో ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకోండి..

ఈ రెండు ఫోల్డెబుల్​ ఫోన్స్​లో ఏది బెస్ట్​?
ఈ రెండు ఫోల్డెబుల్​ ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Google Pixel Fold vs OPPO Find N2 : పవర్​ఫుల్​ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్న వారికి.. గూగుల్​ పిక్సెల్​ ఫోల్డ్​, ఒప్పో ఫైండ్​ ఎన్​2 మంచి ఆప్షన్స్​గా ఉన్నాయి. వీటికి మంచి రివ్యూలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెటర్​? అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాము..

గూగుల్​ పిక్సెల్​ ఫోల్ట్​ వర్సెస్​ ఒప్పో ఫైండ్​ ఎన్​2- డిజైన్​..

పిక్సెల్​ ఫోల్డ్​, ఫైండ్​ ఎన్​2లో ఇన్వర్డ్​ ఫోల్డింగ్​ డిజైన్​, డ్యూయెల్​ డిస్​ప్లేలు, అల్యూమీనియం ఫ్రేమ్​, ప్రొటెక్టివ్​ గ్లాస్​, సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ ప్రింట్​ స్కానర్​లు లభిస్తున్నాయి. ఈ రెండు ఫోన్స్​.. వివిధ యాంగిల్స్​లో ఫోల్డ్​ అవ్వగలవు! ఫైండ్​ ఎన్​2 కన్నా పిక్సెల్​ ఫోల్డ్​ కాస్త బరువు ఎక్కువ (235గ్రాములు/ 283గ్రాములు).

Google Pixel Fold price in India : పిక్సెల్​ ఫోల్డ్​లో 7.6 ఇంచ్​ క్యూహెచ్​డీ|+ ఓఎల్​ఈడీ మెయిన్​ ప్యానెల్​, 5.8 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ ఓఎల్​ఈడీ పంచ్​ హోల్​ కవర్​ స్క్రీన్​లు వస్తున్నాయి.

ఒప్పో ఫైండ్​ ఎన్​2లో 7.1 ఇంచ్​ క్యూహెచ్​డీ+ అమోలెడ్​ ప్రైమరీ స్క్రీన్​, 5.54 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ కవర్​ ప్యానెల్​లు వస్తున్నాయి.

OPPO Find N2 price : ఈ రెండు డివైజ్​లలోనూ 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన ఇంటర్నల్​, ఎక్స్​టర్నల్​ స్క్రీన్స్​ ఉన్నాయి.

ఇదీ చూడండి:- Vivo X Fold 2 vs Samsung Galaxy Z Fold 4 : ఈ రెండు ఫోల్డెబుల్​ ఫోన్స్​లో ఏది బెస్ట్​?

గూగుల్​ పిక్సెల్​ ఫోల్ట్​ వర్సెస్​ ఒప్పో ఫైండ్​ ఎన్​2- ఫీచర్స్​..

Google Pixel Fold features : పిక్సెల్​ ఫోల్డ్​లో 48ఎంపీ మెయిన్​, 10.8ఎంపీ అల్ట్రా వైడ్​, 10.8ఎంపీ టెలీఫొటో కెమెరా సెటప్​ ఉంది. సెల్ఫీ కోసం 9.5ఎంపీ, 8ఎంపీ ఇన్నర్​ కెమెరాలు లభిస్తున్నాయి. ఇందులో టెన్సార్​ జీ2 ఎస్​ఓసీ టైటాన్​ ఎం2 సెక్యూరిటీ క ప్రాసెసర్​ ఉంటుంది. 4,821ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం.

ఇక ఒప్పో ఫైండ్​ ఎన్​2లో 50ఎంపీ ప్రైమరీ, 48ఎంపీ అల్ట్రా వైడ్​, 32ఎంపీ టెలీఫొటో కెమెరా సెటప్​ ఉంటుంది. 32ఎంపీ స్నాపర్స్​ వస్తున్నాయి. ఇందులో స్నాప్​డ్రాగన్​ 8+ జెన్​ 1 ఎస్​ఓసీ ప్రాసెసర్​ ఉంటుంది. 4,520ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం.

గూగుల్​ పిక్సెల్​ ఫోల్ట్​ వర్సెస్​ ఒప్పో ఫైండ్​ ఎన్​2- ధర..

Google Pixel Fold launch date : గూగుల్​ పిక్సెల్​ ఫోల్డ్​ 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ను రూ. 1,48,000కు.. 12జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​ వేరియంట్​ను రూ. 1,58,000కు ప్రీ బుక్​ చేసుకోవచ్చు.

OPPO Find N2 features : ఇక ఒప్పో ఫైండ్​ ఎన్​2 ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​ ప్రస్తుతానికి చైనాకే పరిమితమైంది. 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర సుమారు రూ. 95వేలుగా ఉంది. 16జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర సుమారు రూ. 1,06,000గా ఉంది.

సంబంధిత కథనం