Oppo F23 5G launch date: ఒప్పో ఎఫ్23 5జీ వచ్చేస్తోంది: విడుదల తేదీ, స్పెసిఫికేషన్లను అధికారికంగా వెల్లడించిన ఒప్పో-new oppo f23 5g set to launch in india on may 15 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  New Oppo F23 5g Set To Launch In India On May 15

Oppo F23 5G launch date: ఒప్పో ఎఫ్23 5జీ వచ్చేస్తోంది: విడుదల తేదీ, స్పెసిఫికేషన్లను అధికారికంగా వెల్లడించిన ఒప్పో

Chatakonda Krishna Prakash HT Telugu
May 09, 2023 06:09 PM IST

Oppo F23 5G launch date: ఒప్పో ఎఫ్23 5జీ ఫోన్ ఇండియాలో మే 15న లాంచ్ కానుంది. ఈ మొబైల్ కీలక స్పెసిఫికేషన్లను ఒప్పో అధికారికంగా వెల్లడించింది.

Oppo F23 5G launch date: ఒప్పో ఎఫ్23 5జీ వచ్చేస్తోంది (Photo: Oppo)
Oppo F23 5G launch date: ఒప్పో ఎఫ్23 5జీ వచ్చేస్తోంది (Photo: Oppo)

Oppo F23 5G launch date in India: ఒప్పో ఎఫ్ సిరీస్‍లో మరో 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. ఒప్పో ఎఫ్23 5జీ (Oppo F23 5G) మొబైల్ అడుగుపెట్టనుంది. ఈ మొబైల్ లాంచ్ డేట్‍ను ఒప్పో అధికారికంగా వెల్లడించింది. ఈనెల 15వ తేదీన ఒప్పో ఎఫ్23 5జీ మొబైల్‍ను ఇండియాలో లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. కొన్ని కీలక స్పెసిఫికేషన్లను కూడా వెల్లడించింది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ఈ ఫోన్ రానుంది. 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో ఒప్పో ఎఫ్23 5జీ వస్తోంది. పూర్తి వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

ఒప్పో ఎఫ్23 5జీ లాంచ్ వివరాలు

Oppo F23 5G launch date in India: మే 15వ తేదీన ఒప్పో ఎఫ్23 5జీ మొబైల్‍ను లాంచ్ చేయనున్నట్టు ఒప్పో వెల్లడించింది. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ ఫోన్ కోసం అధికారిక వెబ్‍సైట్‍లో ఓ పేజీని క్రియేట్ చేసింది. దీని ద్వారా ఈ మొబైల్‍కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను వెల్లడించింది. లాంచ్ సమయంలో ఆఫర్లు కూడా ఉంటాయని టీజ్ చేసింది.

డిస్‍ప్లే, ప్రాసెసర్

Oppo F23 5G: 6.72 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ డిస్‍ప్లేతో ఒప్పో ఎఫ్23 5జీ రానుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 680 నిట్స్ వరకు పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్ ఈ మొబైల్‍లో ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ కలర్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍తో వస్తుంది. 8జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్‍తో వేరియంట్లు ఉంటాయి.

బ్యాటరీ, కనెక్టివిటీ

Oppo F23 5G launch date in India: ఒప్పో ఎఫ్23 5జీ ఫోన్‍లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్ల SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. డ్యుయల్ సిమ్ 5జీ, 4జీ ఎల్‍టీఈ, వైఫై 6, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లతో వస్తుంది.

32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

Oppo F23 5G launch: ఒప్పో ఎఫ్23 5జీ మొబైల్ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ రానుంది.

ఒప్పో ఎఫ్23 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ.20,999 నుంచి రూ.24,999 మధ్య ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. లాంచ్ సమయంలో ఈ ఫోన్ అధికారిక ధరను ఒప్పో వెల్లడిస్తుంది.

WhatsApp channel