Vivo X Fold 2 vs Samsung Galaxy Z Fold 4 : ఈ రెండు ఫోల్డెబుల్​ ఫోన్స్​లో ఏది బెస్ట్​?-vivo x fold2 vs samsung galaxy z fold4 check feature price and detailed comparison here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo X Fold 2 Vs Samsung Galaxy Z Fold 4 : ఈ రెండు ఫోల్డెబుల్​ ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Vivo X Fold 2 vs Samsung Galaxy Z Fold 4 : ఈ రెండు ఫోల్డెబుల్​ ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Apr 22, 2023 08:47 AM IST

Vivo X Fold 2 vs Samsung Galaxy Z Fold 4 : వివో ఎక్స్​ ఫోల్డ్​ 2, శాంసంగ్​ గ్యాలెక్సీ జెడ్​ ఫోల్డ్​ 4.. ఈ రెండు ఫోల్డెబుల్​ ఫోన్స్​లో ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకోండి..

ఈ రెండు ఫోల్డెబుల్​ ఫోన్స్​లో ఏది బెస్ట్​?
ఈ రెండు ఫోల్డెబుల్​ ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Vivo X Fold 2 vs Samsung Galaxy Z Fold 4 : ఎక్స్​ ఫోల్డ్​ 2ను చైనాలో ఆవిష్కరించింది ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ వివో. ఇది ఇండియాలోనూ అడుగుపెట్టనుంది. ఈ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​.. శాంసంగ్​ గ్యాలెక్సీ జెడ్​ ఫోల్డ్​ 4కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది కొంటే బెటర్​ అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

వివో ఎక్స్​ ఫోల్డ్​ 2 వర్సెస్​ శాంసంగ్​ గ్యాలెక్సీ జెడ్​ ఫోల్డ్​ 4- స్పెసిఫికేషన్స్​..

Vivo X Fold 2 launch date in India : వివో ఎక్స్​ ఫోల్డ్​ 2, శాంసంగ్​ గ్యాలెక్సీ జెడ్​ ఫోల్డ్​ 4లలో బుక్​ లైక్​ ఇన్​వర్డ్​ ఫోల్డింగ్​ మెకానిజం ఉంటుంది. డ్యూయెల్​ డిస్​ప్లే, టాప్​ సెంటర్డ్​ పంచ్​ హోల్​ కెమెరా సెటప్​ వంటివి ఔటర్​ స్క్రీన్​లో కనిపిస్తాయి.

గ్యాలెక్సీ జెడ్​ ఫోల్డ్​ 4లో ఐపీఎక్స్​-8 రేటింగ్​ వాటర్​ ప్రొటెక్షన్​ లభిస్తుండటం విశేషం. రేర్​ ప్యానెల్​, కవర్​ స్క్రీన్​పై కార్నింగ్స్​ గొరిల్లా గ్లాస్​ విక్టస్​+ ప్రొటెక్షన్​ కూడా వస్తోంది. ఎస్​ పెన్​ డ్రాయింగ్​, నోట్​ టేకింగ్​ వంటివి ఈ ఫోన్​ సపోర్ట్​ చేస్తుంది.

Samsung Galaxy Z Fold 4 features : వివో ఎక్స్​ ఫోల్డ్​ 2లో 8 ఇంచ్​ 2కే|+ (1960X2160 పిక్సెల్స్​) ఎల్​టీపీఓ ఈ6 అమోలెడ్​ మెయిన్​ స్క్రీన్​ ఉంటుంది. ఇది డాల్బీ విజన్​ను సపోర్ట్​ చేస్తుంది. 6.53 ఇంచ్​ కవర్​ డిస్​ప్లే ఉంటుంది.

ఇక శాంసంగ్​ గ్యాలెక్సీ జెడ్​ ఫోల్డ్​ 4లో 7.6 ఇంచ్​ క్యూఎక్స్​జీఏ+ (1812X2176 పిక్సెల్స్​) డైనమిక్​ అమోలెడ్​ 2ఎక్స్​ మెయిన్​ స్క్రీన్​ లభిస్తుంది.

ఈ రెండు ఫోల్డెబుల్​ ఫోన్స్​లోనూ 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ డిస్​ప్లేలు ఉన్నాయి.

వివో ఎక్స్​ ఫోల్డ్​ 2 వర్సెస్​ శాంసంగ్​ గ్యాలెక్సీ జెడ్​ ఫోల్డ్​ 4- ఫీచర్స్​..

Vivo X Fold 2 price : వివో ఎక్స్​ ఫోల్డ్​ 2లో 50ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ 108- డిగ్రీ అల్ట్రా వైడ్​, 12ఎంపీ పోట్రైట్​ స్నాపర్​ కెమెర సెటప్​ ఉంటుంది. సెల్ఫీ కోసం 16ఎంపీ డ్యూయెల్​ కెమెరా లభిస్తుంది.

ఇక గ్యాలెక్సీ జెడ్​ ఫోల్డ్​ 4లో వర్టికల్లీ స్టాక్​డ్​ 50ఎంపీ ప్రైమర, 12ఎంపీ 123-డిగ్రీ అల్ట్రా వైడ్​, 10ఎంపీ టెలిఫొటో లెన్స్​ లభిస్తాయి. 10ఎంపీ కవర్​ కెమెరాతో పాటు 4ఎంపీ అండర్​ డిస్​ప్లే కెమెరా దక్కుతుంది.

Vivo X Fold 2 price : ఎక్స్​ ఫోల్డ్​ 2లో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 ఎస్​ఓసీ(12జీబీ ఎల్​పీడీడీఆర్​5ఎక్స్​ ర్యామ్​, 512జీబీ యూఎఫ్​ఎస్​ 4.0 స్టోరేజ్​), 4,800ఎంఏహెచ్​ బ్యాటరీ, 120డబ్ల్యూ వయర్​ సపోర్ట్​, 50డబ్ల్యు వయర్​లెస్​ ఛార్జింగ్​ వంటివి లభిస్తున్నాయి. గ్యాలెక్సీ జెడ్​ ఫోల్డ్​ 4లో స్నాప్​డ్రాగన్​ 8+ జెన్​ 1 చిప్​సెట్​ (12జీబీ ఎల్​పీడీడీఆర్​5 ర్యామ్​, 1టీబీ యూఎఫ్​ఎస్​ 3.1 స్టోరేజ్​) ఉంటుంది. 4,440ఎంఏహెచ్​ బ్యాటరీ విత్​ 25డబ్ల్యూ వయర్డ్​, 15డబ్ల్యూ వయర్​లెస్​ ఛార్జింగ్​ సపోర్ట్​ ఉంటుంది.

వివో ఎక్స్​ ఫోల్డ్​ 2 వర్సెస్​ శాంసంగ్​ గ్యాలెక్సీ జెడ్​ ఫోల్డ్​ 4- ధర..

Samsung Galaxy Z Fold 4 price : వివో ఎక్స్​ ఫోల్డ్​ 2 ధరకు సంబంధించిన వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. కాగా.. అమెజాన్​లో శాంసంగ్​ గ్యాలెక్సీ జెడ్​ ఫోల్డ్​ 4 ధర రూ. 1,54,999గా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం