తెలుగు న్యూస్ / ఫోటో /
Google Pixel Fold: త్వరలో గూగుల్ పిక్సెల్ ఫోల్డ్; మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఫోల్డబుల్ ఫోన్స్ ఇవే
స్మార్ట్ ఫోన్స్ లో ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్స్ ట్రెండ్ నడుస్తోంది. గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ మే 10వ తేదీన మార్కెట్లోకి రాబోతోంది. గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ కు పోటీగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోల్డబుల్ ఫోన్స్ వివరాలు..
(1 / 5)
మే 10 వ తేదీన గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ మార్కెట్లోకి లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ కు సంబంధించి ఒక చిన్న వీడియోను గూగుల్ విడుదల చేసింది. అందులో కొన్ని వివరాలను వెల్లడించింది. వైట కలర్ లో, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో ఆ పోల్డబుల్ ఫోన్ ఉంది.(Google)
(2 / 5)
మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం గూగుల్ పిక్సెల్ ధర సుమారు రూ. 148000 (1799 డాలర్లు) గా ఉండవచ్చు. ఈ ఫోన్ కవర్ డిస్ ప్లే 5.8 ఇంచెస్, ఇన్నర్ డిస్ ప్లే 7.69 ఇంచెస్ ఉంటుంది. వెనుకవైపు 48 ఎంపీ, 10.8 ఎంపీ అల్ట్రా వైడ్, 10.8 టెలిఫొటో కెమెరా సెటప్ ఉంది. (Google)
(3 / 5)
సామ్సంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 4 ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 164999 లకు లభిస్తుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్ సెట్ అమర్చారు. అలాగే, 7.6 ఇంచ్ Full HD+ డిస్ ప్లే ఉంది. వెనుకవైపు 50 ఎంపీ, 12 ఎంపీ, 10 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.(HT Tech)
(4 / 5)
Tecno Phantom V Fold 5G: 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో టెక్నో కంపెనీ రూపొందించిన ఫోల్డబుల్ ఫోన్ టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ (Tecno Phantom V Fold 5G). ఈ ఫోన్ ప్రస్తుతం ఆమెజాన్ లో రూ. 88888లకు లభిస్తుంది. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ 5 జీ చిప్ సెట్ ఉంది.(HT Tech)
ఇతర గ్యాలరీలు