Vivo X Fold 2 : వివో నుంచి మరో ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​.. లాంచ్​ డేట్​ ఇదే!-vivo x fold 2 to launch next week check features price expectations and other details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Vivo X Fold 2 To Launch Next Week: Check Features, Price Expectations And Other Details Here

Vivo X Fold 2 : వివో నుంచి మరో ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​.. లాంచ్​ డేట్​ ఇదే!

Sharath Chitturi HT Telugu
Apr 15, 2023 09:20 AM IST

Vivo X Fold 2 launch : వివో నుంచి కొత్త ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​ రాబోతోంది. ఈ వివో ఎక్స్​ ఫోల్డ్​ 2 ఈ నెల 20న లాంచ్​కానుంది. పూర్తి వివరాలు..

vivo x fold 5g
vivo x fold 5g

Vivo X Fold 2 launch : వివో నుంచి మరో ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​ రానుంది. ఈ వివో ఎక్స్​ ఫోల్డ్​ 2.. అంతర్జాతీయ మార్కెట్​లో ఈ నెల 20న లాంచ్​కానున్నట్టు తెలుస్తోంది. గతేడాది లాంచ్​ అయిన వివో ఎక్స్​ ఫోల్డ్​కు సెకెండ్​ జెనరేషన్​ మోడల్​ ఈ ఎక్స్​ ఫోల్డ్​ 2. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​పై ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

వివో ఎక్స్​ ఫోల్డ్​ 2- ఫీచర్స్​..

వివో ఎక్స్​ ఫోల్డ్​ 2లో బుక్​ తరహా డిజైన్​ ఉంటుంది. డ్యూయెల్​ డిస్​ప్లే, ఔటర్​- ఇన్నర్​ స్క్రీన్స్​లో పంచ్​ హోల్​ కటౌట్స్​ ఉంటాయి. ఇందులో 8.0 ఇంచ్​, 2కే అమోలెడ్​ మెయిన్​ స్క్రీన్​ ఉంటుంది. దీనితో పాటు 6.53 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ|+ స్క్రీన్​ కూడా ఉండొచ్చు. బ్లాక్​, బ్లూ వంటి రెండు మోడల్స్​లో ఈ ఫోల్డెబుల్​ ఫోన్​ అందుబాటులోకి రానుంది.

Vivo X Fold 2 price : వివో ఎక్స్​ ఫోల్డ్​ 2లో ట్రిపుల్​ కెమెరా సెటప్​ ఉండనుంది. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్​, 12ఎంపీ సెకండరీ సెన్సార్​లు రెండు ఉండనున్నాయి. ఇక సెల్ఫీల కోసం 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఉంటుంది.

ఈ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​లో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 ఎస్​ఓసీ చిప్​సెట్​ ఉంటుందని తెలుస్తోంది. ఇది 12జీబీ ర్యామ్​, 512జీబీ స్టోరేజ్​తో రావొచ్చు. ఆడ్రాయిడ్​ 13ఓస్​ ఉండొచ్చు.

వివో ఎక్స్​ ఫోల్డ్​ 2- ధర..

Vivo X Fold 2 specifications : వివో ఎక్స్​ ఫోల్డ్​ 2 ధరకు సంబంధించిన వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే.. ఈ గ్యాడ్జెట్​ ఈ నెల 20 చైనాలో లాంచ్​కానుంది. ఆ తర్వాత ఇండియాలోనూ అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. లాంచ్​ తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి.

ఇక లాంచ్​ తర్వాత ఈ గ్యాడ్జెట్​.. శాంసంగ్​ గ్యాలెక్సీ జెడ్​ ఫోల్డ్​4కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

వివో టీ2 5జీ సిరీస్​..

Vivo T2 5G Series launch : వివో టీ2 5జీ సిరీస్ ఇటీవలే లాంచ్ అయింది. వివో టీ2 5జీ, వివో టీ2ఎక్స్ 5జీ ఫోన్లు భారత మార్కెట్‍లోకి విడుదలయ్యాయి. వివో టీ2 5జీ అమోలెడ్ డిస్‍ప్లే, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరాతో హైఎండ్ ఫోన్‍గా ఉంది. వివో టీ2ఎక్స్ 5జీ బడ్జెట్ ధరలో వచ్చింది. చీపెస్ట్ వివో 5జీ ఫోన్‍గా నిలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం