Samsung Galaxy Z Fold 3 : క్రేజీ కాంబో.. శాంసంగ్​ ఫోల్డెబుల్​ ఫోన్​తో పాటు వాచ్​పై భారీ డిస్కౌంట్​!-get 49 percent discount on samsung galaxy z fold 3 and galaxy watch 4 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Get 49 Percent Discount On Samsung Galaxy Z Fold 3 And Galaxy Watch 4

Samsung Galaxy Z Fold 3 : క్రేజీ కాంబో.. శాంసంగ్​ ఫోల్డెబుల్​ ఫోన్​తో పాటు వాచ్​పై భారీ డిస్కౌంట్​!

Sharath Chitturi HT Telugu
Feb 27, 2023 10:29 PM IST

Samsung Galaxy Z Fold 3 discount : శాంసంగ్​ గ్యాలెక్సీ ఫోల్డ్​ 3తో పాటు గ్యాలెక్సీ వాచ్​ 4 కాంబోలో అమెజాన్​లో డిస్కౌంట్​ లభిస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

క్రేజీ కాంబో.. శాంసంగ్​ ఫోల్డెబుల్​ ఫోన్​తో పాటు వాచ్​పై భారీ డిస్కౌంట్​!
క్రేజీ కాంబో.. శాంసంగ్​ ఫోల్డెబుల్​ ఫోన్​తో పాటు వాచ్​పై భారీ డిస్కౌంట్​!

Samsung Galaxy Z Fold 3 discount : మంచి ఫోల్డెబుల్​ ఫోన్​ కొనాలని చాలా కాలం నుంచి చూస్తున్నారా? మరి.. డిస్కౌంట్​లో ఆ ఫోన్​ లభిస్తే? అంతేకాకుండా.. ఈ ఫోల్డెబుల్​ ఫోన్​తో పాటు స్మార్ట్​వాచ్​ కూడా కాంబో కింద డిస్కౌంట్​లో దక్కితే? ఇక పండగే కదా! శాంసంగ్​ గ్యాలెక్సీ జెడ్​ ఫోల్డ్​ 3తో పాటు గ్యాలెక్సీ వాచ్​ 4పై ఈ అదిరిపోయే కాంబో ఆఫర్​ నడుస్తోంది. పూర్తి వివరాలు చూసేయండి మరి..

ట్రెండింగ్ వార్తలు

శాంసంగ్​ గ్యాలెక్సీ జెడ్​ ఫోల్డ్​ 3 వాస్తవ ధర రూ. 2,01,998. కాగా అమెజాన్​లో కాంబో ఆఫర్​ కింద గ్యాలెక్సీ వాచ్​ 4తో కలుపుకుని ఈ గ్యాడ్జెట్​ రూ. 1,02,999కే లభిస్తోంది. అంతే కాకుండా యెస్​ బ్యాంక్​ క్రెడిట్​ కార్డ్​పై రూ. 1500 డిస్కౌంట్​ ఉంది. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ కాంబో ధర రూ. 1,01,499కి మీరు దక్కించుకోవచ్చు.

Samsung Galaxy Z Fold 3 Amazon offers : ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. అమెజన్​.ఇన్​లో ఈ కాంబోను కొనుగోలు చేసిన వారికి ఆరు నెలల పాటు స్పాటిఫై ప్రీమియం సబ్​స్క్రిప్షన్​ ఫ్రీగా లభించనుంది!

శాంసంగ్​ గ్యాలెక్సీ జెడ్​ ఫోల్డ్​ 3 కొనొచ్చా..?

మార్కెట్​లో ఇటీవలే శాంసంగ్​ గ్యాలెక్సీ జెడ్​ ఫోల్డ్​ 4 లాంచ్​ అయ్యింది. ఈ నేపథ్యంలో పాత మోడల్​ను కొనుగోలు చేయవచ్చా అన్న సందేహాలు ఉత్పన్నమవుతాయి. అయితే.. పాత మోడల్​లోని ఫీచర్స్​ ఇంకా ఔట్​డేటెడ్​ అవ్వలేదు.

Samsung Galaxy Z Fold 3 price : 2021 ఆగస్ట్​లో ఇది లాంచ్​ అయ్యింది. ఇందులో స్నాప్​డ్రాగన్​ 888 చిప్​సెట్​ ఉంటుంది. 12ఎంపీ వైడ్​, 12ఎంపీ అల్ట్రావైడ్​, 12ఎంపీ టెలిఫొటో లెన్స్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ దీని సొంతం. 7.6 ఇంచ్​ ప్రైమరీ డిస్​ప్లే, 6.2 ఇంచ్​ కవర్​ డిస్​ప్లే వంటివి దీని ఫీచర్స్​. ఆండ్రాయిడ్​ 13 ఆధారంగా ఇది పనిచేస్తుంది.

WhatsApp channel