Vivo T2 5G: వివో నుంచి రెండు కొత్త 5జీ ఫోన్లు లాంచ్: ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే!
Vivo T2 5G, Vivo T2x 5G: వివో టీ2 5జీ, వివో టీ2ఎక్స్ 5జీ మొబైళ్లు లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‍లో వివో టీ2 5జీ హైఎండ్‍గా ఉంది. పూర్తి వివరాలు ఇవే.
Vivo T2 5G, Vivo T2x 5G: వివో టీ2 5జీ సిరీస్ (Vivo T2 5G Series) లాంచ్ అయింది. వివో టీ2 5జీ, వివో టీ2ఎక్స్ 5జీ ఫోన్లు మంగళవారం భారత మార్కెట్‍లో విడుదలయ్యాయి. వివో టీ2 5జీ అమోలెడ్ డిస్‍ప్లే, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కెమెరాతో హైఎండ్ ఫోన్‍గా ఉంది. వివో టీ2ఎక్స్ 5జీ బడ్జెట్ ధరలో వచ్చింది. చీపెస్ట్ వివో 5జీ ఫోన్‍గా నిలుస్తోంది. వివరాలివే..

వివో టీ2 5జీ స్పెసిఫికేషన్లు
Vivo T2 5G Specifications: 6.38 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లేను వివో టీ2 5జీ కలిగి ఉంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది.
వివో టీ2 5జీ ఫోన్ వెనుక రెండు కెమెరాలు ఉంటాయి. OIS సపోర్ట్ ఉండే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ బోకే సెకండరీ కెమెరా ఉన్నాయి. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ వస్తోంది.
వివో టీ2 5జీ మొబైల్‍లో 4,500mAh బ్యాటరీ ఉంది. 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. డ్యుయల్ సిమ్ 5జీకిి సపోర్ట్ చేస్తుంది.
వివో టీ2ఎక్స్ 5జీ స్పెసిఫికేషన్లు
Vivo T2x 5G Specifications: 6.58 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ IPS LCD డిస్‍ప్లేతో వివో టీ2ఎక్స్ 5జీ అడుగుపెట్టింది. ఈ ఫోన్‍లో మీడియాటెక్ డైమన్సిటీ 6020 ప్రాసెసర్ ఉంది.
వివో టీ2ఎక్స్ 5జీ ఫోన్ 5,000mAh బ్యాటరీతో వచ్చింది. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ పవర్ బటన్‍కే ఉంటుంది.
వివో టీ2ఎక్స్ 5జీ వెనుక రెండు కెమెరాల సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ బోకే కెమెరాలు ఉంటాయి. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్‍కు ఇచ్చింది వివో.
ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్‍టచ్ ఓఎస్‍తో ఈ వివో టీ2 సిరీస్ 5జీ మొబైళ్లు వచ్చాయి. డ్యుయల్ సిమ్ 5జీ సపోర్టు, 4జీ ఎల్‍టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.
వివో టీ2 5జీ ధర, సేల్, ఆఫర్లు
Vivo T2 5G Price: వివో టీ2 5జీ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ టాప్ వేరియంట్ ధర రూ.20,999గా ఉంది. ఫ్లిప్‍కార్ట్, వివో ఇండియా వెబ్‍సైట్‍లో ఈనెల 18వ తేదీన ఈ మొబైల్ సేల్‍కు రానుంది. వెలాసిటీ వేవ్, నైట్రో బ్లేజ్ కలర్ ఆప్షన్‍లలో ఈ ఫోన్ లభిస్తుంది.
Vivo T2 5G Offer: ఫస్ట్ సేల్‍లో హెచ్‍డీఎఫ్‍సీ, ఎస్‍బీఐ, ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుతో వివో టీ2 5జీని కొంటే రూ.1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
వివో టీ2ఎక్స్ 5జీ ధర, సేల్, ఆఫర్
Vivo T2x 5G Price: 4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ ఉన్న వివో టీ2ఎక్స్ 5జీ ధర రూ.12,999, 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ ధర రూ.13,999, 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. ఈనెల 21వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‍కార్ట్, వివో వెబ్‍సైట్‍లో ఈ ఫోన్ సేల్‍కు వస్తుంది. మరైన్ బ్లూ, అరోరా గోల్డ్, గ్రిమ్మర్ బ్లాక్ కలర్లలో అందుబాటులోకి రానుంది.
Vivo T2x 5G Offer: వివో టీ2ఎక్స్ మొబైల్‍ను ఫస్ట్ సేల్‍లో హెచ్‍డీఎఫ్‍సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 అదనపు డిస్కౌంట్ దక్కుతుంది.