Vivo V29 : ఇంకొన్ని రోజుల్లో వివో వీ29 లాంచ్.. ఫీచర్స్ ఇవేనా?
Vivo V29 : ఇంకొన్ని రోజుల్లో వివో వీ29 లాంచ్కానుంది. ఈ మోడల్ ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఆ వివరాలు..
Vivo V29 launch date in India : వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. అదే.. వివో వీ29. ఈ మోడల్ లాంచ్‌పై అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఈ స్మార్ట్‌ఫోన్ ఈ నెల 7న అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. కాగా.. లాంచ్‌కి ముందే కొన్ని కీలక ఫీచర్స్‌కు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇవేనా..?
లీక్స్ ప్రకారం.. వివో వీ29లో 6.78 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే ఉండనుంది. 1260x2800 పిక్సెల్స్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, అండర్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్లు ఉంటాయి. 'వీ' సిరీస్‌లోని ఇతర మోడల్స్లానే.. ఈ గ్యాడ్జెట్ కూడా స్లిమ్‌గా ఉంటుంది. దీని థిక్నెస్ 7.46ఎంఎం. బరువు 186ఎంఎం.
Vivo V29 features : ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 778జీ చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది. 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ ఆప్షన్ లభించొచ్చు. ఈ మోడల్లో 4,6000ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుందని సమాచారం. ఆడ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుందని తెలుస్తోంది.
ఇక కెమెరా విషయానికొస్తే.. రేర్‌లో ఇందులో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్, 2ఎంపీ డెప్త్ సెన్సార్లు ఉండొచ్చు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50ఎంపీ ఫ్రెంట్ కెమెరా లభించనుంది!
ఈ మోడల్ ధర ఎంత..?
Vivo V29 price in India : ఈ వివో వీ29 స్మార్ట్‌ఫోన్.. సెప్టెంబర్ 7న అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అవ్వొచ్చు. అయితే ఇండియాలో లాంచ్ డేట్‌ను సంస్థ ఇంకా ఫిక్స్ చేయలేదు. కాకాపోతే ఇండియాలో కచ్చితంగా లాంచ్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 39 దేశాల్లో ఈ గ్యాడ్జెట్‌ను లాంచ్ చేసేందుకు సంస్థ ప్లాన్స్ చేస్తోంది.
ఇక ధర విషయానికొస్తే.. యూరోప్‌లోని వెబ్సైట్లో ఈ మోడల్ రేటు 389 డాలర్లుగా కనిపించింది. అంటే ఇండియన్ కరెన్సీలో అది దాదాపు రూ. 32,200.
వివో వీ29ఈ స్మార్ట్‌ఫోన్‌ను చూశారా?
Vivo V29E price in India : వివో వీ29ఈ గ్యాడ్జెట్‌ను ఇటీవలే ఇండియాలో లాంచ్ చేసింది స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ. ఇందులో కర్వ్డ్ డిస్ప్లే, సెంటర్ అలైన్డ్ పంచ్ హోల్ కటౌట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు ఉంటాయి. ఈ గ్యాడ్జెట్‌కు 120హెచ్‌జెడ్‌తో కూడిన 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే లభిస్తుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 93శాతంగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం