Oukitel C35 : మార్కెట్లోకి నయా స్మార్ట్‌ఫోన్.. ఓకిటెల్ సీ35 ఫీచర్స్ ఇవే!
Oukitel C35 : ఓకిటెల్ సీ35 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇదొక బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్. ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
Oukitel C35 : అంతర్జాతీయ మార్కెట్లో తాజాగా ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది ఓకిటెల్ సంస్థ. దీని పేరు ఓకిటెల్ సీ35. ఇదొక బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్‌గా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందంటే..!
ఓకిటెల్ సీ35 బరువు కేవలం 199 గ్రాములు. ఇందులో 6.56 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది. ఈ డివైజ్‌లో ఆక్టా-కోర్ యూనీఎస్ఓసీ టైగర్ టీ616 ప్రాసెసర్ ఉంటుంది. 12జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ వేరియంట్ లభిస్తోంది. ర్యామ్‌ను 24జీబీ వరకు, స్టోరేజ్‌ను 1టీబీ వరకు కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఫలితంగా.. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్‌ను స్టోర్ చేసుకునేందుకు చాలా స్పేస్ లభిస్తున్నట్టే!
Oukitel C35 features : ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ హైలైట్ అని చెప్పుకోవాలి. ఇందులో 5,150ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేసి స్టాండ్‌బై మోడ్‌లో పెడితే.. ఈ ఓకిటెల్ సీ35.. 280 గంటల పాటు పనిచేస్తుందని సంస్థ చెబుతోంది. తమ ఫోన్లో యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుందని అంటోంది. మ్యూజిక్ వినడం, గేమింగ్, వెబ్ బ్రౌజింగ్‌కు ది బెస్ట్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఇదీ చూడండి:- iPhone 15 price: ఐ ఫోన్ 15 ధర ఎంత ఉండబోతోందో తెలుసా? ఇండస్ట్రీ అంచనా ఇదే..
ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ ఓకిటెల్ సీ35 రేర్‌లో 50ఎంపీ డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫ్రెంట్లో 8ఎంపీ కెమెరా వస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత..?
Oukitel C35 price details : అయితే.. ఈ ఓకిటెల్ సీ35 ప్రస్తుతం అమెరికా మార్కెట్‌కే పరిమితమైంది. దీని ధర 199 డాలర్లు. ఇండియన్ కరెన్సీలో అది సుమారు రూ. 16,500.
ఓకిటెల్కు ఇప్పటికే సీ8, కే9తో పాటు ఇతర స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ డివైజ్‌లో ఉంటాయి.
సంబంధిత కథనం