Moto G84 5G : మోటో జీ84 5జీ లాంచ్​.. ధర ఎంతంటే!-moto g84 5g launched in india check price features and other details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Moto G84 5g : మోటో జీ84 5జీ లాంచ్​.. ధర ఎంతంటే!

Moto G84 5G : మోటో జీ84 5జీ లాంచ్​.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu
Sep 01, 2023 01:36 PM IST

Moto G84 5G launch : మోటో జీ84 5జీ లాంచ్​ అయ్యింది. ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

మోటో జీ84 లాంచ్​
మోటో జీ84 లాంచ్​ (HT TECH/ Representative image)

Moto G84 5G launch in India : ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లోకి మరో గ్యాడ్జెట్​ను తీసుకొచ్చింది మోటోరోలా సంస్థ. దీని పేరు మోటో జీ84. ఇదొక 5జీ డివైజ్​. లాంచ్​ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​ ఇవేనా..?

మోటో జీ84లో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.55 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ పీఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. స్నాప్​డ్రాగన్​ 695 ప్రాసెసర్​ దీని సొంతం. 128జీబీ ర్యామ్​, 256 జీబీ స్టోరేజ్​ కెపాసిటీ లభిస్తోంది. అంతేకాకుండా.. 1టీబీ వరకు ఎక్స్​పాండెబుల్​ మైక్రోఎస్​డీ కార్డ్​ ఆప్షన్​ కూడా లభిస్తుండటం హైలైట్​!

మొబైల్ రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్​ కెమెరా సెటప్​ లభిస్తోంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఫ్రెంట్​లో 16ఎంపీ కెమెరా వస్తోంది. సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​ ఇందులో ఉంటుంది. ఈ గ్యాడ్జెట్​.. ఆండ్రాయిడ్​ 13 సాఫ్ట్​వర్​పై పనిచేస్తుంది.

ఇక ఈ మోటో జీ84 5జీలో వైఫై 802.11ఏసీ, బ్లూటూత్​ 5.1, జీపీఎస్​, యూఎస్​బీ టైప్​-సీ, ఎన్​ఎఫ్​సీ, 3.5ఎంఎం ఆడియ జాక్​, డాల్బీ అట్మోస్​ సపోర్ట్​త కూడిన స్టీరియో స్పీకర్స్​, డ్యూయెల్​ మైక్రఫోన్స్​ వంటివి వస్తున్నాయి. ఈ డివైజ్​లో ఐపీ54 రేటింగ్​తో కూడిన వాటర్​ రెసిస్టెన్స్​ వస్తోంది. దీని బరువు 166.8 గ్రాములు.

ఈ మొబైల్​ ధర ఎంత?

ఈ మోటో జీ84.. ఓ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​గా మార్కెట్​లోకి అడుగుపెడుతోంది. దీని ధర రూ. 19,999. మార్ష్​మెల్లో బ్లూ, మిడ్​నైట్​ బ్లూ, వివా మెచెంటా వంటి రంగుల్లో లభిస్తుంది. ఈ నెల 8 నుంచి ఫ్లిప్​కార్ట్​లో ఈ డివైజ్​ను కొనుక్కోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్​ క్రెడిట్​ కార్డ్స్​పై రూ. 1000 వరకు ఇనీషియల్​ ఆఫర్స్​ సైతం వస్తోంది.

మోటోరోలా నుంచి మోటో జీ54 స్మార్ట్​ఫోన్​ కూడా లాంచ్​కు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ మోడల్​ ఫీచర్స్​కు సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం