Vivo T2x vs Samsung Galaxy M14 : వివో టీ2ఎక్స్​- శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం14లో ఏది బెస్ట్​?-vivo t2x vs samsung galaxy m14 check price features and detailed comparison here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo T2x Vs Samsung Galaxy M14 : వివో టీ2ఎక్స్​- శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం14లో ఏది బెస్ట్​?

Vivo T2x vs Samsung Galaxy M14 : వివో టీ2ఎక్స్​- శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం14లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Apr 23, 2023 09:25 AM IST

Vivo T2x vs Samsung Galaxy M14 : వివో టీ2ఎక్స్​ వర్సెస్​ శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం14. ఈ రెండు గ్యాడ్జెట్స్​లో ఏది కొంటే బెటర్​? ఇక్కడ తెలుసుకోండి..

ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో బెస్ట్​ ఏది?
ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో బెస్ట్​ ఏది?

Vivo T2x vs Samsung Galaxy M14 : వివో టీ2ఎక్స్​, శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం14 స్మార్ట్​ఫోన్స్​.. ఇండియా మార్కెట్​లో అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది వాల్యూ ఫర్​ మనీ? ఏది కొంటే బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

వివో టీ2ఎక్స్​ వర్సెస్​ శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం14- స్పెసిఫికేషన్స్​..

వివో టీ2ఎక్స్​,​ శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం14లలో సెల్ఫీ కెమెరా కోసం వాటర్​డ్రాప్​ నాచ్​ ఉంటుంది. సైడ్​- ఫేసింగ్​ ఫింగర్​ప్రింట్​ సెన్సార్​ కూడా ఉంటుంది. శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం14లో గొరిల్లా గ్లాస్​ 5 ప్రొటెక్షన్​ లభిస్తుండటం విశేషం.

Vivo T2x price in India : వివో టీ2ఎకస్​లో 6.58 ఇంచ్​ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. 1080X2408 పిక్సెల్స్​ ఫుల్​ హెచ్​డీ+ రిసొల్యూషన్​ లభిస్తుంది. గ్యాలెక్సీ ఎం14లో 6.6 ఇంచ్​ ఎల్​సీడీ స్క్రీన్​ ఉంటుంది. ఇందులోనూ 1080X2408 పిక్సెల్స్​ ఫుల్​ హెచ్​డీ+ రిసొల్యూషన్​ ఉంది.

వివో టీ2ఎక్స్​ వర్సెస్​ శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం14- ఫీచర్స్​..

వివో టీ2ఎక్స్​లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ మాక్రో కెమెరా సెటప్​ ఉంటుంది. ఎల్​ఈడీ ఫ్లాష్​ లైట్​ కూడా వస్తోంది. సెల్ఫీ కోసం ఇందులో 8ఎంపీ కెమెరా లభిస్తోంది.

Samsung Galaxy M14 price : మరోవైపు శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం14లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకెండరీతో పాటు డెప్త్​ సెన్సార్​ కూడా ఉంది. సెల్ఫీ కోసం 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది.

ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​ కూడా.. ఫుల్​ హెచ్​డీ (1080పీ) వీడియోలను షూట్​ చేయగలవు.

ఇదీ చదవండి:- Vivo X Fold 2 vs Samsung Galaxy Z Fold 4 : ఈ రెండు ఫోల్డెబుల్​ ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Vivo T2x features : వివో టీ2ఎక్స్​లో 7ఎన్ఎం ఆక్టా కోర్​ మీడియాటెక్​ డైమెన్సిటీ 6020 చిప్​సెట్​ ఉంటుంది. మూడు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది. ఈ గ్యాడ్జెట్​కు 5000ఎంఏహెచ్​ బ్యాటరీ లభిస్తోంది.

గ్యాలెక్సీ ఎం14లో 5ఎన్​ఎం ఆక్టా కోర్​ ఎక్సినోస్​ 1330 ప్రాసెసర్​ ఉంది. రెండు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది. ఇందులో 6000ఎఏహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉండటం విశేషం.

Samsung Galaxy M14 features : వివో టీ2ఎక్స్​, శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం14లో వైఫై 5, జీపీఎస్​, 3.5ఎంఎం జాక్​, టైప్​-సీ పోర్ట్​, బ్లూటూత్​ 5.1, 5.2 వంటి కనెక్టివిటీ ఫీచర్స్​ ఉన్నాయి. ఈ రెండూ కూడా ఆండ్రాయిడ్​ 13పైనే పనిచేస్తాయి.

వివో టీ2ఎక్స్​ వర్సెస్​ శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం14- ధర..

Vivo T2x specifications : వివో టీ2ఎక్స్​ 4జీబీ ర్యామ్​/ 128జీబీ స్టోరేజ్​ ధర రూ. 12,999. 6జీబీ ర్యామ్​/ 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 13,999. 8జీబీ ర్యామ్​/ 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 15,999. ఆరోరా గోల్డ్​, గ్లిమ్మర్​ బ్లాక్​, మరైన్​ బ్లూ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది.

Samsung Galaxy M14 specifications : శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం14 4జీబీ ర్యామ్​/ 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 14,990. 6జీబీ ర్యామ్​/ 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 16,490. బెర్రీ బ్లూ, స్మోకీ టీల్​, ఐసీ సిల్వ్​ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం