Vivo T2 5G Sale today: వివో టీ2 5జీ ఫస్ట్ సేల్ నేడే: ధర, ఆఫర్లు ఇవే
Vivo T2 5G first sale today: వివో టీ2 5జీ ఫోన్ నేడు ఫస్ట్ సేల్‍కు వస్తోంది. ఈ మొబైల్ ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు ఇక్కడ చూడండి.
Vivo T2 5G first sale today: వివో టీ2 5జీ మొబైల్ నేడు (ఏప్రిల్ 18) తొలిసారి సేల్‍కు రానుంది. వివో టీ2 5జీ సిరీస్‍లో ఇటీవల లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ సేల్ నేడు ప్రారంభం కానుంది. రూ.20వేలలోపు ధరలోనే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, AMOLED డిస్‍ప్లే, 5జీ కనెక్టివిటీ సపోర్టుతో ఈ వివో టీ2 5జీ వచ్చింది. రెండు వేరియంట్లు, రెండు కలర్ ఆప్షన్‍లలో ఈ ఫోన్ లభిస్తుంది. వివో టీ2 5జీ ధర, సేల్, ఆఫర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..
వివో టీ2 5జీ ధర, సేల్
Vivo T2 5G Price: వివో టీ2 5జీ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఉన్న టాప్ వేరియంట్ ధరను రూ.20,999గా వివో నిర్ణయించింది. నేటి (ఏప్రిల్ 18) మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్, వివో ఇండియా వెబ్‍సైట్‍తో పాటు ఆఫ్‍లైన్ స్టోర్లలోనూ వివో టీ2 5జీ సేల్‍కు వస్తుంది.
వివో టీ2 5జీ ఆఫర్లు
Vivo T2 5G Offers: ఎస్‍బీఐ, హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో ఫస్ట్ సేల్‍లో వివో టీ2 5జీ ఫోన్‍ను కొనుగోలు చేస్తే రూ.1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే బేస్ వేరియంట్‍ను రూ.17,499కు దక్కించుకోవచ్చు. టాప్ వేరియంట్‍ను రూ.19,499కు కొనుగోలు చేయవచ్చు.
వివో టీ2 5జీ స్పెసిఫికేషన్లు
- Vivo T2 5G: స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వివో టీ2 5జీ వచ్చింది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍తో అడుగుపెడుతోంది. ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని వర్చువల్‍గా ర్యామ్‍ను పొడిగించుకునే ఫీచర్ కూడా ఉంటుంది.
- వెనుక రెండు కెమెరాల సెటప్‍తో వివో టీ2 5జీ వచ్చింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఉండే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండగా.. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ సెకండరీ కెమెరాగా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్‍కు అమర్చింది వివో.
- 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే 6.38 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లేను వివో టీ2 5జీ మొబైల్ కలిగి ఉంది. 1300 నిట్స్ వరకు పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది.
- వివో టీ2 5జీ మొబైల్‍లో 4,500mAh బ్యాటరీ ఉంది. 44 వాట్ల ఫ్లాష్‍చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ బరువు 172 గ్రాములే ఉంటుంది.
వివో టీ2 5జీ సిరీస్‍లో వివో టీ2ఎక్స్ 5జీ కూడా లాంచ్ అయింది. రూ.12,999 ప్రారంభ ధర ఉన్న ఈ ఫోన్ ఈనెల 21వ తేదీన సేల్‍కు రానుంది.
సంబంధిత కథనం