Google Pixel 8 series launch : అక్టోబర్​లో గూగుల్​ పిక్సెల్​ 8 సిరీస్​ లాంచ్​..!-google pixel 8 series may launch in october everything we know so far ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Google Pixel 8 Series Launch : అక్టోబర్​లో గూగుల్​ పిక్సెల్​ 8 సిరీస్​ లాంచ్​..!

Google Pixel 8 series launch : అక్టోబర్​లో గూగుల్​ పిక్సెల్​ 8 సిరీస్​ లాంచ్​..!

Sharath Chitturi HT Telugu
Jun 11, 2023 08:20 PM IST

Google Pixel 8 release date : గూగుల్​ పిక్సెల్​ 8 సిరీస్​.. ఈ ఏడాది అక్టోబర్​లో లాంచ్​ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పిక్సెల్​ 8పై ఉన్న వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

అక్టోబర్​లో గూగుల్​ పిక్సెల్​ 8 సిరీస్​ లాంచ్​..!
అక్టోబర్​లో గూగుల్​ పిక్సెల్​ 8 సిరీస్​ లాంచ్​..!

Google Pixel 8 release date : గూగుల్​ నుంచి వచ్చే పిక్సెల్​ స్మార్ట్​ఫోన్స్​కు ఇండియాలో మంచి డిమాండ్​ ఉంటుంది. దీనిని క్యాచ్​ చేసుకునేందుకు గూగుల్​ కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే గూగుల్​ పిక్సెల్​ 8 త్వరలోనే రాబోతోంది! ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్​ఫోన్​ సిరీస్​.. అక్టోబర్​లో లాంచ్​కానుంది. అయితే.. లాంచ్​కి ముందే ఫీచర్స్​కు సంబంధించిన అనేక వివరాలు ఆన్​లైన్​లో లీకయ్యాయి. వాటిని ఓసారి చూద్దాము..

గూగుల్​ పిక్సెల్​ 8లో ఏముంటుంది..?

గూగుల్​ పిక్సెల్​ 8 సిరీస్​లో రెండు స్మార్ట్​ఫోన్స్​ ఉంటాయి. అవి పిక్సెల్​ 8, పిక్సెల్​ 8 ప్రో. వీటికి సంబంధించిన రెండర్స్​ చాలా కాలం క్రితమే బయటకొచ్చాయి. ఇక ఇప్పుడు కెమెరా, చిప్​సెట్​తో పాటు ఇతర వివరాలు లీక్​ అయ్యాయి.

పిక్సెల్​ 8​లో టాప్​ సెంటర్డ్​ పంచ్​ హోల్​ కటౌట్​, రౌండెడ్​ కార్నర్స్​, ఇన్​- డిస్​ప్లే ఫింగర్​ప్రింట్​ స్కానర్​లు ఉంటాయి. ప్రో మోడల్​లో ఫ్లాట్​ స్క్రీన్​ ఉంటుంది.

ఇదీ చూడండి:- Xiaomi 12 Pro: అత్యంత తక్కువ ధరకే షావోమి 12 ప్రొ; ఫస్ట్ టైమ్ 46 శాతం డిస్కౌంట్

లీక్​ ప్రకారం.. పిక్సెల్​ 8 ప్రోలో 5ఎంపీ ఐసోసెల్​ జెన్​2 ప్రైమరీ కెమెరా ఉండొచ్చు. పిక్సెల్​ 7 సిరీస్​లో జెన్​1 సెన్సార్​ ఉంటుంది. ఇక 12ఎంపీ ఐఎంఎక్స్​386 అల్ట్రా వైడ్​ కెమెరా ఉండొచ్చు. పిక్సెల్​ 8 ప్రోలో మాత్రం 64ఎంపీ ఐఎంఎక్స్​787 అల్ట్రా వైడ్​ కామ్​ ఉండే అవకాశం ఉంది. ప్రో మోడల్​లో 48ఎంపీ శాంసంగ్​ జీఎం5 పెరిస్కోపిక్​ కెమెరా సైతం లభిస్తుంది.

ఇతర ఫీచర్స్​ ఇవేనా..?

ఈ గూగుల్​ పిక్సెల్​ 8 సిరీస్​లో అడాప్టివ్​ టచ్​ ఫీచర్​ వస్తుంది. అంటే. పరిసరాల ఆధారంగా ఫ్లాష్​ ఇన్టెన్సిటీ ఆటోమెటిక్​గా అడ్జెస్ట్​ అవుతుంది. ఫలితంగా లో లైట్​ ఫొటోగ్రఫి మెరుగ్గా ఉంటుంది. ఇందులో వీడియో బుకేహ్​ బ్లర్​ లెవల్​ సెక్షన్​ లభించొచ్చు. సినిమాటిక్​ మోడ్​ కోసం కస్టమర్లు దీనిని ఉపయోగించుకోవచ్చు.

Google Pixel 8 pro release date India : ఇక ఈ స్మార్ట్​ఫోన్స్​లో టెన్సార్​ జీ3 చిప్​సెట్​ ఉండనుంది. 4 కార్టెక్స్​ ఏ510, 4 కార్టెక్స్​ ఏ715, సింగిల్​ కార్కెక్స్​ ఎక్స్​3 సీపీయూ కోర్స్​ ఇందులో ఉంటాయి. “ఫైండ్​ మై డివైజ్​” ఫీచర్​ కూడా ఇందులో ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్​ 14పై ఇవి పనిచేయవచ్చు.

మరి ఈ లీక్స్​లో ఎంత నిజం ఉందనేది గూగుల్​ పిక్సెల్​ 8 లాంచ్​ సమయంలోనే తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్​, ధరతో పాటు ఇతర వివరాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా.. ఈ స్మార్ట్​ఫోన్​ సిరీస్​తో పాటు సెకెండ్​ జన్​ పిక్సెల్​ వాచ్​ని కూడా సంస్థ లాంచ్​ చేస్తుందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

సంబంధిత కథనం