తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Scooters In India 2023 : ఇండియాలో లాంచ్​ అయిన టాప్​ ఈ-స్కూటర్లు ఇవే!

Electric scooters in India 2023 : ఇండియాలో లాంచ్​ అయిన టాప్​ ఈ-స్కూటర్లు ఇవే!

Sharath Chitturi HT Telugu

24 December 2023, 11:50 IST

    • Top electric scooters launched in India : ఇండియాలో.. ఈ ఏడాదిలో పలు క్రేజీ ఈ-స్కూటర్లు లాంచ్​ ఆయ్యాయి. వీటిల్లోని టాప్​-5 లిస్ట్​ మీకోసం..
ఇండియాలో లాంచ్​ అయిన టాప్​ ఈ-స్కూటర్లు ఇవే!
ఇండియాలో లాంచ్​ అయిన టాప్​ ఈ-స్కూటర్లు ఇవే!

ఇండియాలో లాంచ్​ అయిన టాప్​ ఈ-స్కూటర్లు ఇవే!

Top electric scooters launched in India in 2023 : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ వెహికిల్​ సెగ్మెంట్​ శరవేగంగా వృద్ధిచెందుతోంది. మరీ ముఖ్యంగా.. ఎలక్ట్రిక్​ స్కూటర్ల సెగ్మెంట్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. డిమాండ్​ను క్యాష్​ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆటోమొబైల్​ సంస్థలు.. 2023లో క్రేజీ ఈ-స్కూటర్లను లాంచ్​ చేశాయి. 2023 ముగింపు నేపథ్యంలో.. ఈ ఏడాదిలో లాంచ్​ అయిన టాప్​ 5 ఎలక్ట్రిక్​ స్కూటర్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఓలా ఎస్​ 1 ఎక్స్​:-

Ola S1 X price in India : ఓలా ఎస్​1 ఎక్స్​లో 2 మోడల్స్​ ఉంటాయి. డ్యూయెల్​ టోన్​ డిజైన్​, సింగిల్​ పీస్​ సీట్​, ట్యూబ్యులర్​ గ్రాబ్​ రెయిల్​, డ్యూయెల్​ పాడ్​ ఎల్​ఈడీ హెడ్​లైట్​ యూనిట్​ వంటివి వస్తున్నాయి. ఈ స్కూటర్లలో 2కేడబ్ల్యూహెచ్​, 3కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్స్​ ఉన్నాయి. వీటి రేంజ్​ వరుసగా 91కి.మీలు, 151కి.మీలు. ఈ వెహికిల్​ ఎక్స్​షోరూం ధర రూ. 90లక్షలు.

ఏథర్​ 450ఎస్​:-

2023లో లాంచ్​ అయిన ఎలక్ట్రిక్​ స్కూటర్లలో ఏథర్​ 450ఎస్​ అట్రాక్షన్​గా నిలిచింది. ఈ మోడల్​ డిజైన్​ చాలా స్పోర్టీగా ఉంటుంది. 7 ఇంచ్​ టచ్​స్క్రీన్​, స్లీక్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్​, 12 ఇంచ్​ వీల్స్​ వంటివి వస్తున్నాయి.

Ather 450S price in Hyderabad : ఈ ఈ-స్కూటర్​లో 2.9 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 115 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. ఈ ఈవీ ఎక్స్​షోరూం ధర రూ. 1.18లక్షలు.

రివర్​ ఇండీ:-

రివర్​ ఇండీ నుంచి వచ్చి ఎలక్ట్రిక్​ స్కూటర్​లో డ్యూయెల్​ పాడ్​ హెడ్​లైట్​ సెటప్​ ఉంటుంది. సింగిల్​ పీస్​ సీట్​, 42 లీటర్​ అండర్​ సీట్​ స్టోరేజ్​, 12 లీటర్​ లాకెబుల్​ గ్లోవ్​ బాక్స్​ (ఫ్రెంట్​లో), 14 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ వంటివి వస్తున్నాయి.

ఈ రివర్​ ఇండీ ఈ-స్కూటర్​లో 4 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీని రేంజ్​ 120 కి.మీలు. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.25లక్షలు.

సింపుల్​ డాట్​ 1:-

Best Electric scooters in India : సింపుల్​ డాట్​ 1 స్కూటర్​ డిజైన్​ అగ్రెసివ్​గా ఉంటుంది. మౌంటెడ్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​, వైడ్​ హ్యాండిల్​ బార్​, ఫ్లాట్​ ఫుట్​బోర్డ్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 12 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ వంటివి లభిస్తున్నాయి.

ఇందులో 3.7 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 151కి.మీల దూరం ప్రయాణిస్తుందట. ఈ వెహికిల్​ ఎక్స్​షోరూం ధర రూ. 99లక్షలు.

టీవీఎస్​ ఎక్స్​:-

ఈ లిస్ట్​లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఈ టీవీఎస్​ ఎక్స్​. దీని ఎక్స్​షోరూం ధర రూ. 2.5లక్షలు. ఇదొక ప్రీమియం ఎలక్ట్రిక్​ స్కూటర్​ అనే చెప్పుకోవాలి. ఇందులో వర్టికల్లీ స్టేక్​డ్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​ క్లస్టర్​, వైడ్​ హ్యాండిల్​ బార్​, స్లిమ్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్​, భారీ 10.25 ఇంచ్​ టీఎఫ్​టీ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ వంటివి ఉంటయి.

TVS X electric scooter price : ఈ టీవీఎస్​ ఎక్స్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 3.8 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీని రేంజ్​ 140 కి.మీలు.

తదుపరి వ్యాసం