తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Activa Electric Scooter : హోండా యాక్టివాకు ఈవీ టచ్​.. ఎలక్ట్రిక్​ స్కూటర్​ వచ్చేస్తోంది!

Honda Activa electric scooter : హోండా యాక్టివాకు ఈవీ టచ్​.. ఎలక్ట్రిక్​ స్కూటర్​ వచ్చేస్తోంది!

Sharath Chitturi HT Telugu

10 December 2023, 16:40 IST

    • Honda Activa electric scooter : హోండా యాక్టివాకు ఎలక్ట్రిక్​ వర్షెన్​ రాబోతోంది. ఈ ఈవీపై ఓ కీలక అప్డేట్​ బయటకొచ్చింది. ఆ వివరాలు..
హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​ వచ్చేస్తోంది!
హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​ వచ్చేస్తోంది!

హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​ వచ్చేస్తోంది!

Honda Activa electric scooter : ఇండియా 2 వీలర్​ సెగ్మెంట్​లో హోండా యాక్టివ్​కు ప్రత్యేక ఫ్యాన్​ బేస్​ ఉంది! ఈ స్కూటర్​కు మంచి డిమాండ్​ ఉంటుంది. ఈ నేపథ్యంలో.. హోండా యాక్టివాకు ఎలక్ట్రిక్​ వర్షెన్​ను సిద్ధం చేస్తోంది సంస్థ. ఇక ఇప్పుడు.. ఈ ఈ-స్కూటర్​పై కీలక అప్డేట్​ బయటకు వచ్చింది. 2024 జనవరి 9న.. అమెరికా లాస్​ వేగాస్​లో జరగనున్న కన్జ్యూమర్​ ఎలక్ట్రానిక్స్​ షో (సీఈఎస్​)లో హోండా యాక్టివ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని సంస్థ రివీల్​ చేస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హోండా యాక్టివా ఈవీ..

ఈ హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​లో ఫిక్స్​డ్​ బ్యాటరీ సెటప్​ ఉంటుందని తెలుస్తోంది. ఈ ఈవీ టాప్​ స్పీడ్​ 50 కేఎంపీహెచ్​ అని సమాచారం. స్పీడ్​, పర్ఫార్మెన్స్​ కన్నా.. హోండా యాక్టివా ఈవీలోని రేంజ్​పై సంస్థ ఎక్కువగా ఫోకస్​ చేసిందట.

Honda Activa electric : అయితే.. ఇలా ఫిక్స్​డ్​ బ్యాటరీ సెటప్​ ఉండటం నగరాల్లోని మల్టీ-స్టోర్​ అపార్ట్​మెంట్స్​లో నివాసముంటున్న వారికి ఇబ్బందికరంగా ఉంటుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి వారికోసం.. స్వాప్​ చేసుకునే బ్యాటరీ ప్యాక్​తో కూడిన ఓ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ని లాంచ్​ చేసేందుకు సంస్థ ప్లాన్​ చేస్తోందట. హోండా యాక్టివా ఈవీ లాంచ్​ అయిన కొన్ని నెలలకు ఇది కూడా మార్కెట్​లోకి అడుగుపెడుతుందని సమాచారం.

కాగా.. ఈ హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​పై ప్రస్తుతం పూర్తి వివరాలు అందుబాటులో లేవు. బ్యాటరీ ప్యాక్​, రేంజ్​, ఫీచర్స్​తో పాటు ధరకు సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సి ఉంది. లాస్​ వేగాస్​లో జరగే ఈవెంట్​తో వీటిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Honda Activa electric scooter price in Hyderabad : మరోవైపు.. జనవరిలో ఈ మోడల్​ని రివీల్​ చేయనున్న సంస్థ.. 2024 మొదటి భాగంలోనే ఇండియాలో లాంచ్​ చేస్తుందని టాకన్​ నదుస్తోంది. అంతేకాకుండా.. ఈ ఈవీ లాంచ్​కానున్న తొలి దేశం ఇండియానే కాబోతోందని వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.

Honda Activa EV launch : ఇక లాంచ్​ తర్వాత.. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న ఓలా ఎస్​1, టీవీఎస్​ ఐక్యూబ్​, బజాజ్​ చేతక, ఏథర్​ 450ఎక్స్​ మధ్య ఉన్న పోటీని.. ఈ హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​ మరింత పెంచుతుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

ఏది ఏమైనా.. హోండా యాక్టివా ఈవీ వర్షెన్​ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తదుపరి వ్యాసం