River Indie vs Ather 450X : బెంగళూరు ఆధారిత ఈవీ స్టార్టప్ సంస్థ 'రివర్'.. తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్‌ను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఈ ఈ- స్కూటర్ పేరు రివర్ ఇండీ. ఈ మోడల్.. ఏథర్ 450ఎక్స్‌కు పోటీనిచ్చే విధంగా ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఏథర్ 450ఎక్స్‌లో ఏప్రాన్-మౌంటెడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, యాంగ్యులర్ బాడీ ప్యానెల్స్, ఫ్లష్ ఫిట్టెడ్ సైడ్ స్టాండ్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్, 12 ఇంచ్ అలాయ్ వీల్స్, 7.0 ఇంచ్ టీఎఫ్టీ టచ్‌స్క్రీన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఇన్-బిల్ట్ నేవిగేషన్ వంటివి వస్తున్నాయి.
River Indie electric scooter price : ఇక రివర్ ఇండీలో డ్యూయెల్ పాడ్ హెడ్‌లైట్ మౌంటెడ్ ఏప్రాన్, వైడ్ హ్యాండిల్‌బార్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, సింగిల్-పీస్ సీట్, 42 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్, 12 లీటర్ లాకెబుల్ గ్లోవ్ బాక్స్, 14 ఇంచ్ అలాయ్ వీల్స్ లభిస్తున్నాయి.
ఈ రెండు ఈవీల్లో కూడా ఫ్రెంట్, రేర్ వీల్స్‌కు డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టెమ్, రీజనరేటివ్ బ్రేకింగ్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ లభిస్తున్నాయి.
Ather 450X electric scooter price Hyderabad : సస్పెన్షన్స్ విషయానికొస్తే.. ఈ రెండు ఈ-స్కూటర్స్‌కి కూడా ఫ్రెంట్లో టెలిస్కోపిక్ ఫోర్క్స్ వస్తున్నాయి. కాకపోతే.. ఏథర్ 450ఎక్స్‌కు రేర్‌లో మోనో షాక్ యూనిట్స్ వస్తుండగా.. రివర్ ఇండీకి డ్యూయెల్ రేర్ షాక్ అబ్సార్బర్స్ లభిస్తున్నాయి.
ఇక ఏథర్ 450ఎక్స్‌లో 6.4 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటర్ ఉంటుంది. ఇది 3.7కేడబ్ల్యూహెచ్ బ్యాటరీకి లింక్ అయ్యి ఉంటుంది. ఈ ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 150కి.మీల వరకు ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది.
మరోవైపు.. రివర్ ఇండీ ఎలక్ట్రిక్ వెహికిల్‌లోని 6.7 కేడబ్ల్యూ మిడ్- మౌంటెడ్ మోటర్.. 4కేడబ్ల్యూహెచ్ లిథియం-ఐయాన్ బ్యాటరీ ప్యాక్‌తో లింక్ అయ్యి ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 120కి.మీల వరకు ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది.
River Indie electric scooter price Hyderabad : ఇండియాలో ఏథర్ 450ఎక్స్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.45లక్షలుగా ఉంది. రివర్ ఇండీ ఎక్స్‌షోరూం ధర రూ. 1.25లక్షలుగా ఉంది.
సంబంధిత కథనం