తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Today Gold Rate September 18th : కాస్త తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా

Today Gold Rate September 18th : కాస్త తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా

Anand Sai HT Telugu

18 September 2024, 5:39 IST

google News
    • Today Gold and Silver Price : దేశంలో బంగారం ధరలు బుధవారం కాస్త తగ్గాయి. వెండి ధరలు సైతం పడిపోయింది. తెలుగు రాష్ట్రాలతోపాటుగా దేశంలోని ఇతర నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
నేటి బంగారం, వెండి ధరలు
నేటి బంగారం, వెండి ధరలు

నేటి బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి రూ.68,640కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 68,650గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 6,86,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,864గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి రూ. 74880గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 74890గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 తగ్గి రూ. 7,48,800గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,488గా ఉంది.

దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,790గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,030గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,640 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 74,880గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,640గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,880గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 68,640గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 74,880గాను ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,640గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,880గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.68,690గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,930గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 68,640గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,880గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు

దేశంలో వెండి ధరలు సైతం బుధవారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 9190గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 91,900గా కొనసాగుతోంది. మంగళవారం ఈ ధర రూ. 92,000గా ఉండేది.

హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 96,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 91,900.. బెంగళూరులో రూ. 85,900గా ఉంది.

ప్లాటీనం ధరలు

దేశంలో ప్లాటీనం రేట్లు బుధవారం కాస్త పడిపోయాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 310 తగ్గి రూ. 26,580కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 26,890గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,580గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

తదుపరి వ్యాసం