తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tips To Take Care Of Car : వర్షాకాలంలో రోడ్లన్నీ జలమయం- మీ కారును ఇలా కాపాడుకోండి..

Tips to take care of car : వర్షాకాలంలో రోడ్లన్నీ జలమయం- మీ కారును ఇలా కాపాడుకోండి..

Sharath Chitturi HT Telugu

28 June 2024, 15:30 IST

google News
    • Monsoon car care tips in Telugu : వర్షాకాలంలో బేస్​మెంట్​ నీళ్లతో నిండిపోతోందా? లేక రోడ్లు నీటితో నిండిపోతున్నాయా? మరి కారు పరిస్థితేంటి? కారును ఎలా కాపాడుకోవాలి? ఇక్కడ తెలుసుకోండి..
వర్షాకాలంలో ఎక్కడ చూసినా నీరే! మరి కారును ఎలా కాపాడుకోవాలి?
వర్షాకాలంలో ఎక్కడ చూసినా నీరే! మరి కారును ఎలా కాపాడుకోవాలి?

వర్షాకాలంలో ఎక్కడ చూసినా నీరే! మరి కారును ఎలా కాపాడుకోవాలి?

నైరుతి రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ప్రధాన నగరాల్లోని రోడ్లు జలమయం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పైగా ఇళ్లల్లో పార్కింగ్​ వెసులుబాటు లేని వారు, రోడ్ల మీద కారును ఉంచాల్సిన పరిస్థితి! మరి వర్షాకాలంలో రోడ్లు మీద నీరు పేరుకుపోయినప్పుడు కారును ఎలా రక్షించుకోవాలి? కొన్ని టిప్స్​ని ఇక్కడ తెలుసుకుందాము..

ముందుగా ఇంజిన్ చెక్ చేసుకోండి..

భారీ వర్షం కారణంగా నీట మునిగిన బేస్​మెంట్ పార్కింగ్ ఉంటే, మీ కారు ఇంజిన్​పై మీ మొదటి శ్రద్ధ అవసరం. వరదలు వంటి పరిస్థితులు కారు ఇంజిన్​ను తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందువల్ల నీరు తగ్గిన వెంటనే ఇగ్నీషన్ ఆన్ చేయాలి. మెకానిక్​ను పిలిచి ఎంత మేర నష్టం జరిగింది? అన్నది కచ్చితంగా తెలుసుకోవాలి.

కారును స్టార్ట్ చేసే ప్రయత్నాలకు కూడా నీటి ప్రవాహం ఆటంకం కలిగిస్తుంది. ఫలితంగా చాలాసార్లు ఇంజిన్​ని స్టార్ట్​ చేయడానికి ప్రయత్నిసారు! కానీ అలా చేయకండి. ఒకవేళ చేస్తే.. సిలిండర్ వాల్​, పిస్టన్, కనెక్టింగ్ రాడ్ సరిగ్గా పనిచేయకపోవచ్చు.

టైర్లను చెక్​ చేయండి..

టైర్లను ఎప్పటికప్పుడు చెక్​ చేస్తూ ఉండాలి. అవి సరిగ్గా లేకపోతే బండి స్కిడ్​ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ప్రమాదానికి దారి తీయవచ్చు. ఇది ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా జరుగుతుంది. టైర్లను నిర్దిష్ట ప్రెజర్​కు అనుగుణంగా ఉంచాలి. ట్రెడ్లను కూడా గమనించాలి. ఒకవేళ ట్రెడ్​ల మధ్య ట్రెడ్ ఇండికేటర్లు కనిపిస్తే, యజమాని తప్పనిసరిగా టైర్లను మార్చాలి.

బ్రేక్​లు చెక్​ చేయండి..

సీజన్​ ఏదైనా, కారులో బ్రేకుల ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వర్షాకాలంలో దీని పట్ల ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ వహించాలి. అందువల్ల, బ్రేక్ ఫ్లూయిడ్​ను సరైన స్థాయిలో ఉంచడానికి దానిని తనిఖీ చేయాలి. బ్రేక్ ప్యాడ్​లు, డిస్క్​లను చెక్ చేయడం కోసం టెక్నీషియన్​ని కూడా సంప్రదించాలి. ఒకవేళ ప్యాడ్ లు అరిగిపోయినట్లయితే వాటిని మార్చాల్సి ఉంటుంది.

లైట్లు, ఇండికేటర్​లను చెక్​ చేయండి. వాటర్ లాగింగ్ తరచుగా హెడ్​లైట్​లు, టెయిల్​లైట్​లు లేదా ఇండికేటర్​లలో లోపాన్ని సృష్టిస్తుంది. తరచుగా కారు యజమానులు సరిగ్గా పనిచేసే హెడ్​లైట్ లేదా ఇండికేటర్ లేకుండా తమ వాహనాలను నడుపుతూనే ఉంటారు. భారీ వర్షంలో ఇది చాలా ప్రమాదకరం! తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుంది. అందువల్ల, హెడ్​లైట్​లు, టెయిల్​లైట్​లు, ఇండికేటర్ లు, హజార్డ్ లైట్​లను ఎప్పటికప్పుడు చెక్​ చేయండి.

వైపర్లు చూసుతోండి..

వైపర్​లను ప్రధానంగా వర్షాకాలంలో ఉపయోగిస్తారు. మిగిలిన సంవత్సరమంతా, ఇది దుమ్ము పట్టిపోతుంది! వర్షాకాలం రాకముందే మీ వాహనం వైపర్ల బ్లేడ్లను శుభ్రం చేసి వాటి పనితీరును పరిశీలించాలి.

కారు ఇన్సూరెన్స్ తప్పనిసరి..

ప్రతి విషయాన్ని శ్రద్ధగా పాటించినా ఏదో ఒక సమస్య తలెత్తొచ్చు. అలాంటి పరిస్థితులకు కారు ఇన్సూరెన్స్ బ్యాకప్ ఉండాలి. ఇన్ష్యూరెన్స్​ రెన్యువల్​ డేట్​ని గమనించాలి. రెగ్యులర్​గా బీమా తీసుకోవాలి. లేకపోతే.. మన జేబుల్లో నుంచి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది.

పైన చెప్పిన టిప్స్​ పాటించి.. వర్షాకాలంలో మీరు మీ కారును భద్రంగా చూసుకోండి.

తదుపరి వ్యాసం