తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Summer Car Care Tips : వేసవిలో మీ కారుకు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే.. భారీగా డబ్బు ఖర్చు తప్పదు!

Summer car care tips : వేసవిలో మీ కారుకు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే.. భారీగా డబ్బు ఖర్చు తప్పదు!

Sharath Chitturi HT Telugu

16 April 2024, 13:03 IST

    • Summer car care tips : వేసవిలో మీ కారుకు ప్రత్యేకమైన కేర్​ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే భారీ ఖర్చు అవుతుంది. ఎలాంటి కేర్​ తీసుకోవాలో ఇక్కడ చూడండి..
వేసవిలో మీ కారును ఇలా జాగ్రత్తగా చూసుకోండి..
వేసవిలో మీ కారును ఇలా జాగ్రత్తగా చూసుకోండి..

వేసవిలో మీ కారును ఇలా జాగ్రత్తగా చూసుకోండి..

Summer car care tips in Telugu : మీరు కొత్తగా కారు కొన్నారా? సమ్మర్​లో కారును జాగ్రత్తగా చూసుకోకపోతే.. భవిష్యత్తులో చాలా ఖర్చు అవుతుందని మీకు తెలుసా? అందుకే.. వేసవిలో కారు సంరక్షణ కోసం ప్రత్యేక టిప్స్​ పాటించాలి. వాటిని ఇక్కడ చూసేయండి..

ట్రెండింగ్ వార్తలు

Upcoming compact SUVs in India : ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్న ఎస్​యూవీలు ఇవే..!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో కొత్త వేరియంట్లు.. త్వరలోనే లాంచ్​!

Tata Nexon SUV : టాటా నెక్సాన్​లో కొత్త ఎంట్రీ లెవల్​ వేరియంట్లు.. భారీగా దిగొచ్చిన ఎస్​యూవీ ధర!

Gold price today : స్థిరంగా పసిడి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా..

ఏసీని ఎప్పటికప్పుడు చెక్​ చేయండి..

వేసవిలో కారు ప్రయాణం అంటే ఏసీ ఉండాల్సిందే! వేసవిలో ఓవర్ టైమ్ పనిచేసే ముఖ్యమైన భాగాల్లో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఒకటి. కానీ.. వేసవిలో ఏసీ వేసినా క్యాబిన్​ చల్లపడటానికి చాలా సమయం పడుతోందని వాహన యజమానులు తరచూ చెబుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో.. ఏసీ దాని గరిష్ట స్థాయిలో పనిచేస్తుంది కానీ కారు లోపల చిక్కుకున్న వేడి తగ్గడానికి మాత్రం టైమ్​ పడుతుంది. దీనిని నివారించడానికి.. కారును డైరక్ట్​ సన్​లైట్​లో పార్క్ చేయకుండా చూసుకోండి. పైకప్పు కింద లేదా కనీసం నీడ అందుబాటులో ఉన్న చెట్టు కింద పార్క్ చేస్తే మంచిది. అప్పటికీ మార్పులేకపోతే.. ఏసీ యూనిట్​ను టెక్నీషియన్​తో తనిఖీ చేయించి ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాలి. అలాగే, క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మురికి ఫిల్టర్ వల్ల క్యాబిన్ లోపల ఏసీ పనితీరు క్షీణించవచ్చు. దుర్వాసన రావొచ్చు.

ఫ్లూయిడ్స్​ని చెక్​ చేయండి..

Car care tips for summer : అధిక ఉష్ణోగ్రతలు తరచుగా ఇంజిన్ ఆయిల్​ను త్వరగా బర్న్​ చేస్తాయి. ఆయిల్ పాతదైతే ఈ పరిస్థితి ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంజిన్ ఆయిల్ లెవల్స్​ని క్రమం తప్పకుండా చెక్ చేయడం, పవర్ ప్లాంట్​కు ఎలాంటి నష్టం జరగకుండా ఉండటం కోసం ఓఈఎం సిఫార్సు చేసిన విధంగా.. తగిన ఆయిల్​ని యాడ్​ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ లూబ్రికెంట్​గా పనిచేస్తుంది, మోటార్ కదిలే భాగాలను ఫ్రిక్షన్​ నుంచి రక్షిస్తుంది.

బ్యాటరీని చెక్​ చేయండి..

కారు బ్యాటరీ సరైన కండిషన్​లో ఉందా? లేదా? అనేది చెక్​ చేస్తూ ఉండాలి. దానిని శుభ్రంగా ఉంచండి. బ్యాటరీ కేబుల్స్​ను క్రమం తప్పకుండా విడతీసి, టెర్మినల్స్​ను తుడవండి. అలాగే, శుభ్రం చేసిన తర్వాత.. బ్యాటరీ సురక్షితంగా బిగించామా? లేదా అనేది కూడా చెక్​ చేసుకోవాలి. అన్ని కనెక్షన్లు సరిగ్గా, సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. బ్యాటరీ టెర్మినల్స్ తుప్పు, ధూళి లేకుండా ఉన్నాయని నిర్ధారించుకోండి.

టైర్ ప్రెజర్​ని చెక్ చేయండి..

Tips for car maintenance : సమ్మర్​లో టైర్లలోని ఎయిర్​ ప్రెజర్​ పడిపోతూ ఉంటుంది. టైర్​ ప్రెజర్​ తక్కువగా ఉంటే.. ఫ్యూయెల్​ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇంజిన్​పై అధిక భారం పడుతుంది. అందుకే.. టైర్​ ప్రెజర్​ని ఎప్పటికప్పుడు చెక్​ చేస్తూ, ఓఈఎం చెప్పినట్టు మెయిన్​టైన్​ చేయాలి.

విండ్ షీల్డ్ వైపర్లను చెక్​ చేయండి..

వర్షాకాలంలో విండ్ షీల్డ్ వైపర్లు అత్యంత ప్రభావవంతంగా పనిచేసేటప్పటికీ.. వేసవిలో, అవి నేరుగా వేడిని తీసుకోవడం వల్ల రబ్బర్లపై ప్రభావం పడుతుంది. ఫలితంగా.. విండ్ షీల్డ్​ను శుభ్రపరచడంలో అవి తక్కువ ప్రభావవంతంగా ఉంటాయి. వైపర్ బ్లేడ్లు అరిగిపోయాయా? లేదా సరిగ్గానే ఉన్నాయా? అన్నది చూసుకోవడం మంచిది.

వేసవిలో ఇలాంటి బేసిక్ కార్ మెయింటెనెన్స్ టిప్స్​ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇంధన సామర్థ్యం తగ్గడం, కారు బ్రేక్​డౌన్​లు, ఖరీదైన మరమ్మత్తులు జరుగుతాయి. మీ కారును సమ్మర్​కి తగ్గట్టు రెడీగా ఉంచాలంటే.. పైన చెప్పిన టిప్స్​ పాటించాల్సిందే!

తదుపరి వ్యాసం